పేటీఎంలో మీ డబ్బు ఎంత సేఫ్?

మొబైల్ రీఛార్జ్, బిల్లుల చెల్లింపులు, టికెట్ల బుకింగ్... ఇలా అన్ని అవసరాలకు పేటీఎం వాడుతున్నారు. అయితే పేటీఎం యూజర్ల డేటాకు వచ్చిన ముప్పేమీ లేదని పేటీఎం సంస్థ చెబుతున్నా... మీ జాగ్రత్తలో మీరు ఉండటం మంచిది. పేటీఎం అప్లికేషన్ సురక్షితమైనదే అయినా... మీరూ కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.

news18-telugu
Updated: October 23, 2018, 7:18 PM IST
పేటీఎంలో మీ డబ్బు ఎంత సేఫ్?
Paytm Credit Score: మీ క్రెడిట్ స్కోర్ ఎంత? పేటీఎంలో ఫ్రీగా తెలుసుకోండి ఇలా... (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
సాక్షాత్తూ పేటీఎం వ్యవస్థాపకుడు విజయ్ శేఖర్ శర్మ వ్యక్తిగత సమాచారాన్నే ఆ సంస్థ ఉద్యోగులు దొంగిలించారు. దాన్ని అడ్డం పెట్టుకొని రూ.20 కోట్లు నొక్కేద్దామని చూశారు. అలాంటి వారికి పేటీఎం యూజర్ల వ్యక్తిగత వివరాలు దొంగిలించడం పెద్ద కష్టమేమీ కాదు. మరి పేటీఎంను ఉపయోగిస్తున్న మీ డేటా ఎంతవరకు సేఫ్? డేటా సంగతి సరే... వాలెట్‌లో ఉన్న మీ డబ్బుల సంగతేంటీ? సాక్షాత్తూ సీఈఓకే ఉద్యోగులు షాకిస్తే... యూజర్లను వదిలిపెడతారా? ఇప్పుడు అందరిలో ఇవే భయాలు. ఆందోళనలు. అయితే యూజర్ల డేటాకు వచ్చిన ముప్పేమీ లేదని పేటీఎం ఓ ప్రకటన రిలీజ్ చేసింది.

పేటీఎం ఉపయోగించడం వల్ల చాలా లాభాలున్నాయి. జేబులో డబ్బులు లేకపోయినా సరే... ఎక్కడైనా పేటీఎంతో చెల్లింపులు జరిపే సౌకర్యం ఉంటుంది. నోట్ల రద్దు తర్వాత సామాన్యుల్లో పేటీఎం వినియోగం చాలా పెరిగింది. మొబైల్ రీఛార్జ్, బిల్లుల చెల్లింపులు, టికెట్ల బుకింగ్... ఇలా అన్ని అవసరాలకు పేటీఎం వాడుతున్నారు. అయితే పేటీఎం యూజర్ల డేటాకు వచ్చిన ముప్పేమీ లేదని పేటీఎం సంస్థ చెబుతున్నా... మీ జాగ్రత్తలో మీరు ఉండటం మంచిది. పేటీఎం అప్లికేషన్ సురక్షితమైనదే అయినా... మీరూ కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.

1. గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసిన పేటీఎం యాప్‌నే వాడండి.
2 .పేటీఎం యాప్ పేరుతో వచ్చే 'ఏపీకే' ఫార్మాట్ ఫైల్స్‌ ఇన్‌స్టాల్ చేయొద్దు.
3. మీ పేటీఎం పాస్‌వర్డ్‌ని ఎవరితో షేర్ చేయొద్దు.
4. మీ పేటీఎం యాప్‌ని పాస్‌కోడ్, పాటర్న్‌‌తో ఓపెన్ చేసేలా సెట్టింగ్స్ మార్చుకోవాలి.
5. పేటీఎం అకౌంట్‌కి స్ట్రాంగ్ పాస్‌వర్డ్ క్రియేట్ చేయండి.6. లాగిన్ చేసిన తర్వాత లాగౌట్ చేయడం మర్చిపోవద్దు.
7. వాలెట్ రీఛార్జ్ చేసే సమయంలో క్రెడిట్, డెబిట్ కార్డుల వివరాలు సేవ్ చేయకూడదు.
8. పబ్లిక్ వైఫైకి కనెక్ట్ చేసి పేటీఎంతో చెల్లింపులు చేయొద్దు. మీ డేటా పబ్లిక్ వైఫై ద్వారా కొట్టేసే ప్రమాదం ఉంది.
9. మీరు పేటీఎం నుంచి పేమెంట్స్ ఎక్కువగా చేసేటట్టైతే ఫోన్‌లో లైసెన్స్‌డ్‌ వర్షన్ యాంటీవైరస్ వాడండి.
10. మీ ఫోన్‌ను అపరిచితులకు ఇవ్వకూడదు. ఎందుకంటే పేటీఎం నుంచి డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయడం చాలా సులువు.
11. పేటీఎం వ్యాలెట్‌లో ఎక్కువ డబ్బులు ఉంచకూడదు. ఓ వారానికి మీరు ఎంత ఖర్చు చేస్తారో అంతే మనీ లోడ్ చేయండి.
12. పేటీఎం నుంచి చెల్లింపులకు, డబ్బులు తీసుకునేందుకు క్యూఆర్ కోడ్స్ ఉపయోగించడం మంచిది.

ఇవి కూడా చదవండి:

గూగుల్‌లో మీ డేటాను ఎలా డిలిట్ చేయాలో తెలుసా?

లీకైన గూగుల్ ప్లస్ డేటా... ఇప్పుడు మీరేం చేయాలి?

వాట్సప్ డేటా బ్యాకప్: నవంబర్ 12 డెడ్‌లైన్!

Video: వాట్సప్ డేటా బ్యాకప్ ఎలా చేసుకోవాలి?

పెట్రోల్ కొంటారా? పేటీఎం సూపర్ ఆఫర్!

గూగుల్‌లోనే ఫ్లిప్‌కార్ట్, పేటీఎం, స్నాప్‌డీల్ 'షాపింగ్ ట్యాబ్స్'

 
First published: October 23, 2018, 5:38 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading