ఐఫోన్ ఎక్స్ఎస్: ఏ దేశంలో రేటెంత?

ఐఫోన్ ఎక్స్ఎస్ ఫోన్ ఇండియాలో కొనాలంటే రూ.99,990 ఖర్చు చేయాలి. ఇంతకన్నా తక్కువ ధరకే ఇతర దేశాల్లో దొరుకుతుంది ఈ ఫోన్.

news18-telugu
Updated: September 14, 2018, 3:00 PM IST
ఐఫోన్ ఎక్స్ఎస్: ఏ దేశంలో రేటెంత?
apple event
  • Share this:
యాపిల్ కంపెనీ మూడు ఫోన్లను గ్రాండ్‌గా రిలీజ్ చేసింది. అందులో ప్రముఖంగా చెప్పుకోవాల్సింది ఐఫోన్ ఎక్స్ఎస్ గురించే. ఐఫోన్ ఎక్స్ఎస్ మ్యాక్స్ పేరుతో మరో మోడల్ ఉంది. ఇవి మోస్ట్ అడ్వాన్స్‌డ్ ఐఫోన్స్‌ అని చెబుతోంది కంపెనీ. ఎక్స్ఎస్ డిస్‌ప్లే 5.8 అంగుళాలు, ఎక్స్ఎస్ మ్యాక్స్ డిస్‌ప్లే 6.5 అంగుళాలు. ఈ రెండు ఫోన్లల్లో 7 నానో మీటర్ ఏ12 బయోనిక్ చిప్ ఉంది. ఇది ఏ11 కన్నా 15% వేగంగా పనిచేస్తుంది. బ్యాటరీ 40% తక్కువ ఖర్చవుతుంది. గ్రాఫిక్స్ 50% వేగంగా ఉంటాయి. 12 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్, 12 మెగాపిక్సెల్ టెలిఫోనిక్ లెన్స్‌తో గతంలో ఉన్న ఫోన్లలాగే ఉన్నాయి. ఐఫోన్ ఎక్స్ఎస్-999 డాలర్లు, ఐఫోన్ ఎక్స్ఎస్ మ్యాక్స్-1099 డాలర్లు. ఐఫోన్ ఎక్స్ఎస్ ఫోన్ ఇండియాలో కొనాలంటే రూ.99,990 ఖర్చు చేయాలి. ఇండియా కన్నా చాలా తక్కువ ధరకే ఐఫోన్ ఎక్స్ఎస్ ఇతర దేశాల్లో దొరుకుతుంది. ఆ దేశాల జాబితా చూడండి.

భారతీయ కరెన్సీలో...

అమెరికా- రూ.71,833
కెనెడా- రూ.76,212
హాంకాంగ్- రూ.78,845
యూఏఈ- రూ.82,771
ఆస్ట్రేలియా- రూ.84,049

రష్యా- రూ.92,355
యూకే- రూ.93,621
జెర్మనీ- రూ.96,079

apple watch, apple event, Apple Products, iPhone Xs, iPhone Xs Max, iPhone Xr, యాపిల్ వాచ్, యాపిల్ ఈవెంట్, యాపిల్ ప్రొడక్ట్స్, ఐఫోన్ ఎక్స్ఎస్, ఐఫోన్ ఎక్స్ఎస్ మ్యాక్స్, ఐఫోన్ ఎక్స్ఆర్

ఇవి కూడా చదవండి:

మూడు కొత్త ఫోన్స్ లాంఛ్ చేసిన యాపిల్

Photos: యాపిల్ ఐఫోన్ ఈవెంట్ 2018

యాపిల్ గ్యాడ్జెట్స్‌పై నెటిజన్ల సెటైర్లు

Photos: 'ఐఫోన్ ఎక్స్ఎస్' ధరలో మీరు ఏమేం కొనొచ్చు!

విశాఖలో గూగుల్ 'నైబర్లీ' సేవలు!

2019 మార్చి నుంచి 'ఇన్‌బాక్స్' యాప్ కనిపించదు!

19న షావోమీ ఎంఐ 8 యూత్ లాంఛింగ్!

Video: ప్యాలెస్ ఆన్ వీల్స్: ప్రపంచంలోనే నాలుగో లగ్జరీ ట్రెయిన్!
Published by: Santhosh Kumar S
First published: September 14, 2018, 3:00 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading