HOME »NEWS »TECHNOLOGY »how driverless trains work what are the uses of it here details ns gh

Driverless Trains: డ్రైవర్ లెస్ ట్రైన్లు ఎలా పని చేస్తాయో తెలుసా? వాటితో ప్రయోజనమెంతంటే..

Driverless Trains: డ్రైవర్ లెస్ ట్రైన్లు ఎలా పని చేస్తాయో తెలుసా? వాటితో ప్రయోజనమెంతంటే..
ఢిల్లీ మెట్రో రైలు

మానవ తప్పిదాలను అరికట్టాలనే ఉద్దేశంతో దేశంలోని మొట్టమొదటి డ్రైవర్‌లెస్ ట్రైన్‌ను దిల్లీలో ప్రధానమంత్రి మోదీ ప్రారంభించిన సందర్భంగా.. ఆ ట్రైన్లు ఎలా పని చేస్తాయి? వాటితో ఉపయోగాల గురించి తెలుసుకుందాం..

  • Share this:
ప్రపంచ జనాభాలో సుమారు 70 శాతం మంది ప్రజలు నగరాల్లోనే నివసిస్తున్నారని ఒక అంచనా. ఇంత వేగంగా మారుతున్న పట్టణీకరణ ప్రభావం రవాణా వ్యవస్థపై పడుతోంది. దీంతో సాంకేతికను అందిపుచ్చుకుంటూ పెద్ద పెద్ద నగరాల్లో మెట్రో రైళ్లు, బుల్లెట్ రైళ్లను అందుబాటులోకి తీసుకువస్తున్నారు. ఇలాంటి ప్రయాణ పద్ధతుల్లో మానవ తప్పిదాలకు అవకాశం ఇవ్వకుండా పూర్తిగా సాంకేతికతతోనే రైళ్లు నడిచే ఆటోమెటిక్ సిస్టమ్‌ను పరిశోధకులు అభివృద్ధి చేస్తున్నారు. భవిష్యత్తు అవసరాలకు మరిన్ని డ్రైవర్‌లెస్‌ ట్రైన్స్ అందుబాటులోకి రానున్నాయి. దీనిపై ప్రపంచ స్థాయి సంస్థలు పరిశోధనలు సైతం మొదలుపెట్టాయి. ప్రస్తుతం అందుబాటులో ఉన్న మౌలిక సదుపాయాలను మరింత సమర్థవంతంగా ఉపయోగించుకోవటానికి మెట్రో మార్గాలను అందుబాటులోకి తీసుకువచ్చారు. వీటికి అదనంగా ఆటోమేటిక్ ట్రైన్ కంట్రోల్, సేఫ్టీ సిస్టమ్‌ను అభివృద్ధి చేశారు. మానవ తప్పిదాలను అరికట్టాలనే ఉద్దేశంతో దేశంలోని మొట్టమొదటి డ్రైవర్‌లెస్ ట్రైన్‌ను దిల్లీలో ప్రధానమంత్రి మోదీ(PM Narendra Modi) ప్రారంభించిన సందర్భంగా.. వీటి గురించి మరిన్ని వివరాలను పరిశీలిద్దాం.

అటోమెటిక్ కార్లపై పరిశోధనలు


సెల్ఫ్ డ్రైవింగ్ కార్లపై గత కొన్ని సంవత్సరాలుగా పరిశోధనలు కొనసాగుతున్నాయి. ఈ టెక్నాలజీని విజయవంతంగా అమలు చేయగలిగితే ట్యాక్సీలు, కమర్షియల్ ట్రక్ డ్రైవర్లు అందించే సేవలను ఇవి మరిన్ని భద్రతా ప్రమాణాలతో అందించగలవు. కానీ ఈ వాహనాల్లో ఉపయోగించే టెక్నాలజీ కోసం కాంప్లెక్స్ అల్గారిథమ్, ట్రాఫిక్ పరిస్థితులు, భద్రతా నిబంధనలు, రోడ్లు, ఇతర వసతులను అభివృద్ధి చేయడం ప్రపంచ దేశాలకు అతిపెద్ద సవాలుగా మారనుంది. అందువల్ల ట్యాక్సీలతో పోలిస్తే డ్రైవర్‌లెస్ రైళ్ల సేవలకు ఇలాంటి అవరోధాలు ఉండవు. ట్రైన్‌ను ట్రాక్‌పై నావిగేట్ చేయడం చాలా సులభం. ట్రాక్‌పై డ్రైవర్‌లెస్ ట్రైన్‌లు ముందుకు లేదా వెనక్కు మాత్రమే వెళ్లగలుగుతాయి. ఇతర టెక్నకల్ సమస్యలను రైల్వే నెట్‌వర్క్‌ ఎప్పటికప్పుడూ పర్యవేక్షిస్తూ ప్రమాదాలను నియంత్రిస్తుంది. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా వివిధ రకాల ట్రైన్ ఆటోమేషన్ సిస్టమ్స్‌ అందుబాటులో ఉన్నాయి.

ఆటోమెటిక్ ట్రైన్స్‌లో ఎన్ని రకాలు?
1. డ్రైవర్ కంట్రోల్డ్ మోడ్ (Driver-controlled mode)
ఈ పద్ధతిలో ఎలాంటి సాంకేతికత అవసరం లేకుండా రైలును డ్రైవర్‌ నేరుగా ట్రాక్‌పై నడుపుతాడు. ట్రైన్‌కు ఎలాంటి సపోర్ట్ సిస్టమ్ ఉండదు. రైల్వే నెట్‌వర్క్‌ సిగ్నల్స్ ఆధారంగా డ్రైవర్ రైలును నియంత్రిస్తాడు. ప్రపంచంలోని అనేక పెద్ద నగరాల్లో ఇది ప్రధాన రైల్వే ట్రాన్స్‌పోర్టేషన్‌ మోడ్‌గా ఉంది.

2. Partly automated mode
ఈ విధానంలో కూడా రైలును డ్రైవర్ నడుపుతుంటాడు. బ్రేక్ సిస్టమ్‌పై డ్రైవర్‌కు పూర్తి నియంత్రణ ఉంటుంది. కానీ ట్రైన్ సేఫ్టీ సిప్టమ్ రైలు వేగాన్ని ఎప్పటికప్పుడూ పర్యవేక్షిస్తుంది. దీంతోపాటు నెట్‌వర్క్‌లోని ట్రాక్స్‌పై వెళ్లే ఇతర రైళ్లు, వాటి వేగం, ఇతర గణాంకాలు డ్రైవర్ క్యాబిన్‌లో డిస్‌ప్లే అవుతాయి. వీటి ఆధారంగా డ్రైవర్ రైళ్లను నడిపేటప్పుడు అదనపు జాగ్రత్తలు తీసుకుంటాడు.

3. సెమీ ఆటోమేటెడ్ మోడ్ (Semi-automated mode)
ఈ పద్ధతిలో ట్రైన్‌లో డ్రైవర్ ఉంటాడు. కానీ ఇంజిన్‌ను స్టార్ట్ చేసిన తరువాత ఆటోమెటిక్‌ డ్రైవింగ్ సిస్టమ్ ఆధారంగా ట్రైన్ పనిచేస్తుంది. రెండు స్టేషన్ల మధ్య రైలు కదలికలపై దీనికే పూర్తి నియంత్రణ ఉంటుంది. ప్లాట్‌ఫామ్‌ల వద్ద రైలును ఆపడం, తలుపులు తెరవడం, మూసివేయడం వంటివన్నీ ఆటోమెటిక్‌గా జరుగుతాయి.

4. డ్రైవర్‌లెస్ మోడ్ (Driverless mode)
ఈ ట్రైన్‌లకు డ్రైవర్ అవసరం ఉండదు. ఆటోమేటిక్ డ్రైవింగ్ సిస్టమ్‌ ఆధారంగా ట్రైన్ రాకపోకలు సాగిస్తుంది. రైలు బయలుదేరే సమయం, ఏయే స్టేషన్లలో ఆగాలి, ఎంత సమయంలో చేరుకోవాలి, ట్రైన్ తలుపులు మూసుకోవడం, తెరుచుకోవడం వంటివన్నీ ఆటోమెటిక్‌గా పనిచేస్తాయి. కానీ సిస్టమ్ ఫెయిల్యూర్స్ వంటి అత్యవసర పరిస్థితులు, ఇతర అసాధారణ సమస్యలను పర్యవేక్షించడానికి ఒక వ్యక్తి ఎప్పుడూ ఆన్‌బోర్డ్‌లో ఉంటాడు.

5. డ్రైవర్ అవసరం లేని రైళ్లు (Unattended driverless mode)
డ్రైవర్‌లెస్ మోడ్‌లో మాదిరిగానే రైలుకు సంబంధించిన కార్యకలాపాలన్నీ పూర్తిగా ఆటోమెటిక్‌గా జరుగుతాయి. ఆటోమెటిక్ డ్రైవింగ్ సిస్టమ్ పర్యవేక్షణలోనే ట్రైన్ పనిచేస్తుంది. కానీ దీంట్లో డ్రైవర్ లేదా అటెండర్ అవసరం ఉండదు. ట్రైన్‌లో ఆన్‌బోర్డ్‌లో ఎవరూ ఉండరు. బోగీలను అమర్చుకోవడం, వాటిని అన్ క్లిప్పింగ్ చేయడం, రిమోర్ట్ రిపేర్ ఆప్షన్లు వంటివన్నీ మనుషుల ప్రమేయం లేకుండా ఆటోమెటిగ్గానే జరుగుతాయి.

డ్రైవర్‌లెస్ ఆటోమేషన్ టెక్నాలజీ ఎలా పనిచేస్తుంది?
డ్రైవర్‌లెస్ రైళ్లలో ఉపయోగించే టెక్నాలజీని కమ్యూనికేషన్ బేస్డ్ ట్రైన్ కంట్రోల్ (CBTC) అంటారు. ఈ టెక్నాలజీతో ట్రైన్ ట్రాఫిక్‌, ట్రాక్‌పై ఉన్న రైలు మధ్య మంచి కమ్యూనికేషన్‌ ఉంటుంది. సాంప్రదాయ సిగ్నలింగ్ వ్యవస్థలా కాకుండా ట్రైన్ పొజిషన్స్, బోగీ అలైన్మెంట్, ట్రైన్ స్టెబిలిటీ వంటివన్నీ ఆటోమెటిగ్గా, మెరుగైన పనితీరును ప్రదర్శిస్తాయి. దీని ద్వారా ట్రైన్ సిస్టమ్‌కు, ప్రయాణికులకు మెరుగైన సామర్థ్యం, సౌలభ్యం, భద్రత లభిస్తాయి. సాంప్రదాయ మెట్రో రైలు పట్టాలకు సిగ్నలింగ్, ట్రైన్ పైలట్ జోక్యం అవసరం. కానీ CBTCతో పనిచేసే రైళ్లు మనుషులు అందించే డేటాతో ఆటోమెటిగ్గా పనిచేస్తాయి. దీంట్లో వైర్‌లెస్ కమ్యూనికేషన్ నెట్‌వర్క్ ద్వారా డేటా ట్రాన్స్‌ఫర్ అవుతుంది. ఇందుకు మొబైల్ కమ్యూనికేషన్స్-రైల్వే (GSM-R), వైర్‌లెస్ లోకల్ ఏరియా నెట్‌వర్క్‌లు (WLAN) వంటి కమ్యూనికేషన్ నెట్‌వర్క్‌లను ఉపయోగిస్తారు.

ఎలాంటి టెక్నాలజీ?
డ్రైవర్‌లెస్ ట్రైన్ టెక్నాలజీ కోసం ప్లాట్‌ఫాం ట్రాక్ మానిటరింగ్ సిస్టమ్, ప్లాట్‌ఫాం స్క్రీన్లు, ఎవైడెన్స్, రిమోట్ సెన్సింగ్ సిస్టమ్స్ వంటివి తప్పనిసరిగా అవసరమవుతాయి. ట్రాక్‌లలో ఏర్పడే ప్రమాదాన్ని నివారించడానికి, ప్రయాణికుల భద్రతకు ఇవన్నీ తోడ్పడుతూ ట్రైన్ పనితీరును మెరుగుపరుస్తాయి. ప్రయాణికులు ఎమర్జెన్సీ బటన్‌ను నొక్కితే రైలులో ఏర్పడే ఇబ్బందులు, ప్రమాదాలను ప్యాసింజర్ ఏరియా సర్వైలెన్స్ ద్వారా కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి పర్యవేక్షిస్తారు. రైలు లోపల, ట్రాక్‌లపై ఉండే స్మోక్ డిటెక్టర్లు అగ్ని ప్రమాదాలు ఎదురయ్యే అవకాశాలను కంట్రోల్ రూమ్‌కు చేరవేస్తాయి. ఇవన్నీ సిస్టమ్‌ పనితీరును అర్థం చేసుకోవడానికి, ప్రమాదాలను నివారిస్తూ నెట్‌వర్క్‌ను వీలైనంత త్వరగా మార్చేందుకు ఉపయోగపడతాయి. అందువల్ల డ్రైవర్‌లెస్ ట్రైన్లను అందుబాటులోకి తీసుకురావడానికి ముందు మౌలిక సదుపాయాలను విస్తృతంగా అభివృద్ధి చేయాల్సి ఉంటుంది.
Published by:Nikhil Kumar S
First published:December 28, 2020, 15:04 IST

टॉप स्टोरीज