హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

5G Mobile Gaming: 5Gతో ఇండియాలో మొబైల్ గేమింగ్ రంగం పరుగులు.. పూర్తి వివరాలివే..

5G Mobile Gaming: 5Gతో ఇండియాలో మొబైల్ గేమింగ్ రంగం పరుగులు.. పూర్తి వివరాలివే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఇండియాలో మొబైల్ గేమింగ్ ఇండస్ట్రీ వేగంగా అభివృద్ధి చెందుతోంది. అయితే 5G ఇంటర్నెట్ పూర్తిగా అందుబాటులోకి వస్తే మొబైల్ గేమర్స్ మరింత పెరిగి మొబైల్ గేమింగ్ ఇండస్ట్రీ మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది. 

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad | Vijayawada

గత కొన్నేళ్లుగా ఇండియాలో మొబైల్ గేమింగ్ (Gaming) పాపులారిటీ చాలా వేగంగా పెరుగుతోంది. ఈ రోజుల్లో రూ.15-20వేల నుంచి లభించే స్మార్ట్‌ఫోన్లు మోస్ట్ పవర్‌ఫుల్ ప్రాసెసర్లతో అందుబాటులోకి వస్తున్నాయి. వీటితో పబ్జీ వంటి హైఎండ్ గేమ్స్ ఆడటం సాధ్యమవుతోంది. అందుకే చాలామంది మొబైల్ గేమింగ్‌కి (Mobile Gaming) అలవాటు పడుతున్నారు. ఫలితంగా ఇండియాలో మొబైల్ గేమింగ్ ఇండస్ట్రీ వేగంగా అభివృద్ధి చెందుతోంది. అయితే 5G (5G Technology) ఇంటర్నెట్ పూర్తిగా అందుబాటులోకి వస్తే మొబైల్ గేమర్స్ మరింత పెరిగి మొబైల్ గేమింగ్ ఇండస్ట్రీ మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది.

2025 నాటికి 65 కోట్ల మొబైల్‌ యూజర్లు

ఇండియా దాదాపు 500 మిలియన్ల స్మార్ట్‌ఫోన్ యూజర్లతో, చైనా తర్వాత ప్రపంచంలో అత్యధిక స్మార్ట్‌ఫోన్ యూజర్లు ఉన్న దేశంగా నిలుస్తోంది. ఇంతమంది యూజర్లు 43 కోట్లకు పైగా మొబైల్ గేమర్స్‌ ఉన్నారు. ఇంటర్నెట్, మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (IAMAI) లేటెస్ట్ డేటా ప్రకారం, 2025 నాటికి వారి సంఖ్య 65 కోట్లకు పెరుగుతుందని అంచనా. అయితే ఇండియన్ గేమింగ్ మార్కెట్ 2025 నాటికి 3.9 బిలియన్ డాలర్లు చేరుకోవడానికి సిద్ధంగా ఉందని IAMAI లేటెస్ట్ రిపోర్ట్ తెలిపింది. ప్రస్తుతానికి హార్డ్‌కోర్ మొబైల్ గేమర్లలో 40 శాతం మంది తమ గేమ్‌ల కోసం సగటున నెలకు రూ.230 ఖర్చు చేస్తున్నారని పేర్కొంది.

Business Benefits Of 5G: 5జీ నెట్వర్క్ తో వ్యాపార ప్రయోజనాలివే.. ఓ లుక్కేయండి

గేమింగ్‌ ఇండస్ట్రీలో అవకాశాలు

కరోనా సమయంలో ఇండియాలో మొబైల్ యాప్ డౌన్‌లోడ్స్‌ 50 శాతం పెరగగా.. యూజర్ ఎంగేజ్‌మెంట్ 20 శాతం పెరిగింది. దాంతో ఈ రంగంలో వృద్ధి అనేది చాలా వేగంగా జరిగినట్లు IAMAI నివేదిక వివరించింది. అలాగే ఇండియాలోని గేమింగ్ ఇండస్ట్రీలో అవకాశాలు అపారంగా ఉన్నాయి. 5G నెట్‌వర్క్‌ను లాంచ్ చేస్తే భారతదేశంలో మొబైల్ గేమింగ్ రంగానికి మరింత సపోర్ట్ అందించినట్లు అవుతుందని నిపుణులు అంటున్నారు. భారతదేశంలో 5G రాకతో హై డేటా స్పీడ్, లో లేటెన్సీ, వర్చువల్ రియాలిటీ, ఆగ్మెంటెడ్ రియాలిటీ వంటి వాటితో గేమింగ్ ఎక్స్‌పీరియన్స్ మరింత పెరుగుతుంది. దీనివల్ల ఈ ఎక్స్‌పీరియన్స్ అందరూ మొబైల్ గేమ్స్ వైపు మళ్లే అవకాశం ఉంది.

ఇక 5G సపోర్ట్‌తో ఇప్పటికే ఇండియాలో ఎన్నో స్మార్ట్‌ఫోన్లు అందుబాటు ధరలోనే రిలీజ్ అయ్యాయి. దీనివల్ల మొబైల్ గేమింగ్ మార్కెట్ 5G ఆగమనంతో తప్పకుండా వృద్ధి చెందుతుందని తెలుస్తోంది. ఇండియాలో 45 ఏళ్లలోపు జనాభాలో 75 శాతం మంది మొబైల్ గేమ్స్ ఆడుతున్నారు. మొబైల్ గేమింగ్ ద్వారా డబ్బు కూడా చాలామంది సంపాదిస్తున్నారు. డెవలపర్లు ఎక్కువ మంది మహిళలు, పిల్లల కోసం గేమ్‌లను రూపొందించడంపై దృష్టి సారిస్తున్నారు. దీనివల్ల ఎక్కువ మంది గేమ్స్ వైపు మళ్లే అవకాశం ఉంది.

ఆరు నెలల్లో 1 బిలియన్‌ డాలర్ల పెట్టుబడి

ఇక 'eAsian Games 2022′లో మెడల్ ఈవెంట్‌ల కోసం ఆన్‌లైన్ గేమ్‌లను అధికారిక క్రీడగా చేర్చడాన్ని బట్టి గేమ్స్ ఆడటం ఒక స్కిల్‌గా మారిందని చెప్పొచ్చు. దేశంలో స్మార్ట్‌ఫోన్ వినియోగం వేగంగా పెరగడం వల్ల మొబైల్ ప్లాట్‌ఫామ్‌ల కోసం హెవీ కన్సోల్, పీసీ గేమ్‌లు మొబైల్ వెర్షన్లలో కూడా అందుబాటులోకి వస్తున్నాయి. ఈ రంగం కూడా పెట్టుబడులను ఆకర్షిస్తోంది.

గత ఆరు నెలల్లో ఈ రంగంలో దాదాపు 1 బిలియన్ డాలర్లను పెట్టుబడిగా పెట్టారు. 5G రాకతో క్లౌడ్ గేమింగ్ అందుబాటులోకి వస్తుంది. దీనివల్ల హెవీ గేమ్స్‌ను హైఎండ్ మొబైల్స్ లేకపోయినా ఆడుకోవడం సాధ్యమవుతుంది. ఎయిర్‌టెల్, జియో వంటి కంపెనీలు ఈ సర్వీసులను తీసుకువచ్చే పనిలో పడ్డాయి. మొత్తంగా చూసుకుంటే 5G ఇంటర్నెట్ సేవలు ఇండియాలో మొబైల్ గేమింగ్ రంగాన్ని మరింత ముందుకు తీసుకెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Published by:Nikhil Kumar S
First published:

Tags: 5G, 5G Smartphone, Gaming

ఉత్తమ కథలు