హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Honor View 20 Release: 48 మెగాపిక్సెల్ కెమెరాతో హానర్ వ్యూ 20

Honor View 20 Release: 48 మెగాపిక్సెల్ కెమెరాతో హానర్ వ్యూ 20

Honor View 20: రిలయెన్స్ డిజిటల్, మై జియో స్టోర్లల్లో హానర్ వ్యూ 20 సేల్

Honor View 20: రిలయెన్స్ డిజిటల్, మై జియో స్టోర్లల్లో హానర్ వ్యూ 20 సేల్

హానర్ వ్యూ 20 స్మార్ట్‌ఫోన్‌లో నాచ్ డిస్‌ప్లే లేదు. నాచ్ డిస్‌ప్లేను పంచ్ హోల్ డిస్‌ప్లేతో రీప్లేస్ చేసి అబ్బురపర్చింది హానర్. 48 మెగాపిక్సెల్ రియర్ కెమెరా, 25 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరాలు ఉండటం మరిన్ని ప్రత్యేకతలు.

  స్మార్ట్‌ఫోన్ లవర్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న హానర్ వ్యూ 20 ఇండియాలో రిలీజైంది. కొద్దిరోజుల క్రితం ప్యారిస్‌లో జరిగిన ఈవెంట్‌లో హానర్ వ్యూ20 స్మార్ట్‌ఫోన్‌ను ఆవిష్కరించారు. అప్పట్నుంచి ఇండియాలో ఈ స్మార్ట్‌ఫోన్ ఎప్పుడు రిలీజ్ చేస్తారా అని యూజర్లు ఎదురుచూశారు. కారణం ఆ ఫోన్ ఫీచర్లు, స్పెసిఫికేషన్లు ఆకట్టుకోవడమే. ఇప్పుడంతా నాచ్ డిస్‌ప్లే హవా నడుస్తుంటే... హానర్ వ్యూ 20 స్మార్ట్‌ఫోన్‌లో నాచ్ డిస్‌ప్లే లేదు. నాచ్ డిస్‌ప్లేను పంచ్ హోల్ డిస్‌ప్లేతో రీప్లేస్ చేసి అబ్బురపర్చింది హానర్. అదొక్కటే కాదు 48 మెగాపిక్సెల్ రియర్ కెమెరా, 25 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరాలు ఉండటం మరిన్ని ప్రత్యేకతలు. హానర్ వ్యూ 20 అమెజాన్ ఇండియాలో ఎక్స్‌క్లూజీవ్‌గా లభిస్తుంది. ఈ ఫోన్ ఇండియాలో వన్‌ప్లస్‌ స్మార్ట్‌ఫోన్లకు గట్టిపోటీ ఇవ్వొచ్చని అంచనా.


  హానర్ వ్యూ20 స్పెసిఫికేషన్స్

  డిస్‌ప్లే: 6.4 అంగుళాల ఫుల్‌హెచ్‌డీ+, 1080x2310 పిక్సెల్స్, 19.5:9 యాస్పెక్ట్ రేషియో, 91.8 స్క్రీన్-టు-బాడీ రేషియో

  ర్యామ్: 6 జీబీ, 8జీబీ

  ఇంటర్నల్ స్టోరేజ్: 128 జీబీ, 256 జీబీ

  ప్రాసెసర్: ఆక్టాకోర్ కిరిన్ 980

  రియర్ కెమెరా: 48 మెగాపిక్సెల్

  ఫ్రంట్ కెమెరా: 25 మెగాపిక్సెల్

  బ్యాటరీ: 4,000 ఎంఏహెచ్

  ఆపరేటింగ్ సిస్టమ్: ఆండ్రాయిడ్ పై, మ్యాజిక్ యూఐ 2.0

  కలర్స్: మిడ్‌నైట్ బ్లాక్, సఫైర్ బ్లూ, ఫాంటమ్ బ్లూ, ఫాంటమ్ రెడ్

  ధర:

  6జీబీ+128జీబీ- రూ.37,999

  8జీబీ+256జీబీ- రూ.45,999


  హానర్ వ్యూ 20 ఫోటోలు ఇక్కడ చూడండి
  ఇవి కూడా చదవండి:


  Will you marry me?: వాయిస్ అసిస్టెంట్‌కు యూజర్ల ప్రశ్నలు... గూగుల్ ఫన్నీ రిప్లై


  Facebook Tips: మీ ఫేస్‌బుక్‌లో చేయకూడని 9 అంశాలివే...


  Alert: కేవైసీ పూర్తి కాలేదా? మీ ఇ-వ్యాలెట్ బ్లాక్ అవుతుంది జాగ్రత్త

  First published:

  Tags: Amazon, AMAZON INDIA, Honor, Huawei, Smartphone

  ఉత్తమ కథలు