Honor View 20: రిలయెన్స్ డిజిటల్, మై జియో స్టోర్లల్లో హానర్ వ్యూ 20 సేల్

Honor View 20 | హానర్ వ్యూ 20 ఆఫ్‌లైన్‌లో కేవలం రిలయెన్స్ డిజిటల్, మై జియో స్టోర్లల్లో మాత్రమే ఈ స్మార్ట్‌ఫోన్ లభిస్తుంది. హువావే సబ్‌ బ్రాండ్ అయిన హానర్ ఈ మేరకు రిలయెన్స్ డిజిటల్‌తో ఒప్పందం కుదుర్చుకుంది.

news18-telugu
Updated: February 2, 2019, 5:36 PM IST
Honor View 20: రిలయెన్స్ డిజిటల్, మై జియో స్టోర్లల్లో హానర్ వ్యూ 20 సేల్
Honor View 20: రిలయెన్స్ డిజిటల్, మై జియో స్టోర్లల్లో హానర్ వ్యూ 20 సేల్
news18-telugu
Updated: February 2, 2019, 5:36 PM IST
స్మార్ట్‌ఫోన్ యూజర్లకు గుడ్ న్యూస్. మీరు హానర్ వ్యూ 20 స్మార్ట్‌ఫోన్ కొనాలంటే ఆన్‌లైన్ సేల్ కోసమే ఎదురుచూడాల్సిన అవసరం లేదు. దేశంలోని 700 రిలయెన్స్ డిజిటల్, మై జియో స్టోర్లల్లో హానర్ వ్యూ 20 కొనొచ్చు. ఆఫ్‌లైన్‌లో కేవలం రిలయెన్స్ డిజిటల్, మై జియో స్టోర్లల్లో మాత్రమే ఈ స్మార్ట్‌ఫోన్ లభిస్తుంది. హువావే సబ్‌ బ్రాండ్ అయిన హానర్ ఈ మేరకు రిలయెన్స్ డిజిటల్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. ఫిబ్రవరి 6 నుంచి హానర్ వ్యూ 20 ఆఫ్‌లైన్ స్టోర్లల్లో అందుబాటులోకి వస్తుంది.

Read This: జనవరిలో రిలీజైన టాప్ 5 స్మార్ట్‌ఫోన్లు ఇవే... ఏది బెస్ట్?

హానర్ వ్యూ 20 కొద్దిరోజుల క్రితమే ఇండియాలో రిలీజైంది. ఆ ఫోన్ ఫీచర్లు, స్పెసిఫికేషన్లు స్మార్ట్‌ఫోన్ యూజర్లను బాగా ఆకట్టుకుంటోంది. ఇప్పుడంతా నాచ్ డిస్‌ప్లే హవా నడుస్తుంటే... హానర్ వ్యూ 20 స్మార్ట్‌ఫోన్‌లో నాచ్ డిస్‌ప్లే లేదు. నాచ్ డిస్‌ప్లేను పంచ్ హోల్ డిస్‌ప్లేతో రీప్లేస్ చేసింది హానర్. అదొక్కటే కాదు 48 మెగాపిక్సెల్ రియర్ కెమెరా, 25 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరాలు ఉండటం మరిన్ని ప్రత్యేకతలు.

Read This: Redmi Go: షావోమీ నుంచి మరో చీప్ అండ్ బెస్ట్ స్మార్ట్‌ఫోన్



హానర్ వ్యూ20 స్పెసిఫికేషన్స్
డిస్‌ప్లే: 6.4 అంగుళాల ఫుల్‌హెచ్‌డీ+, 1080x2310 పిక్సెల్స్, 19.5:9 యాస్పెక్ట్ రేషియో, 91.8 స్క్రీన్-టు-బాడీ రేషియో
ర్యామ్: 6 జీబీ, 8జీబీ
Loading...
ఇంటర్నల్ స్టోరేజ్: 128 జీబీ, 256 జీబీ
ప్రాసెసర్: ఆక్టాకోర్ కిరిన్ 980
రియర్ కెమెరా: 48 మెగాపిక్సెల్
ఫ్రంట్ కెమెరా: 25 మెగాపిక్సెల్
బ్యాటరీ: 4,000 ఎంఏహెచ్
ఆపరేటింగ్ సిస్టమ్: ఆండ్రాయిడ్ పై, మ్యాజిక్ యూఐ 2.0
కలర్స్: మిడ్‌నైట్ బ్లాక్, సఫైర్ బ్లూ, ఫాంటమ్ బ్లూ, ఫాంటర్ రెడ్
ధర:
6జీబీ+128జీబీ- సుమారు రూ.37,999
8జీబీ+256జీబీ- సుమారు రూ.45,999

Honor View 20: అదిరిపోయే ఫీచర్లతో హానర్ వ్యూ 20...

ఇవి కూడా చదవండి:

Attention Please: ఇకపై మీ రైలు ఆలస్యంగా రాదు... భారతీయ రైల్వే కొత్త ప్లానింగ్

Income Tax: 80సీ లిమిట్ మొత్తం వాడేశారా? పన్ను ఆదా చేయడానికి మరో 5 మార్గాలు

Health Insurance: హెల్త్ ఇన్స్యూరెన్స్ పాలసీలో యాడ్-ఆన్ మంచిదేనా?
First published: February 2, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...
  • I agree to receive emails from NW18

  • I promise to vote in this year's elections no matter what the odds are.

    Please check above checkbox.

  • SUBMIT

Thank you for
taking the pledge

But the job is not done yet!
vote for the deserving condidate
this year

Click your email to know more

Disclaimer:

Issued in public interest by HDFC Life. HDFC Life Insurance Company Limited (Formerly HDFC Standard Life Insurance Company Limited) (“HDFC Life”). CIN: L65110MH2000PLC128245, IRDAI Reg. No. 101 . The name/letters "HDFC" in the name/logo of the company belongs to Housing Development Finance Corporation Limited ("HDFC Limited") and is used by HDFC Life under an agreement entered into with HDFC Limited. ARN EU/04/19/13618
T&C Apply. ARN EU/04/19/13626