HONOR TechChic: సరికొత్త 'టెక్‌చిక్' స్మార్ట్‌ఫోన్‌‌తో హానర్ సంచలనం

HONOR TechChic | ఆధునిక టెక్ సావీ జనరేషన్ కోసం HONOR చిక్ లైఫ్ స్టైల్ అనే సరికొత్త విధానాన్ని రూపొందించి, ఈ అద్భుతమైన సాంకేతికత, నూతన జీవనశైలి సమాహారాన్ని "TechChic" గా పిలుస్తుంది.

news18-telugu
Updated: December 27, 2019, 6:13 PM IST
HONOR TechChic: సరికొత్త 'టెక్‌చిక్' స్మార్ట్‌ఫోన్‌‌తో హానర్ సంచలనం
HONOR TechChic: సరికొత్త 'టెక్‌చిక్' స్మార్ట్‌ఫోన్‌‌తో హానర్ సంచలనం
  • Share this:
మొబైల్ దిగ్గజాలు మార్కెట్లో సరసమైన వాటాలను పొంది, తద్వారా తమ అమ్మకాలను పెంచుకోవడానికి సాంకేతిక పరిజ్ఞానంలో భారీ పురోగతిని సాధిస్తున్నాయి. ఈ టెక్నాలజీ మార్కెట్లో తమ బ్రాండ్ పేరును మరింతగా పెంచుకోవడానికి పలు రకాల సరికొత్త ఫీచర్లను అందిస్తున్నాయి. మరింత తీవ్రమైన ఈపోటీలో మొబైల్ కంపెనీలు తమ అమ్మకాలను మరింతగా పెంచుకోవడానికి సృజనాత్మకమైన మార్కెటింగ్ నైపుణ్యాలతో కూడిన ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుంటున్నాయి. అసాధారణమైన సాంకేతికత గురించి మాట్లాడితే గనుక, అత్యుత్తమ సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన స్మార్ట్‌ఫోన్లను అందించి మార్కెట్లో మంచి పేరుని సంపాదించిన HONOR బ్రాండ్ ఖచ్చితంగా ఈ కోవలోకి వస్తుంది.

ఆధునిక టెక్ సావీ జనరేషన్ కోసం HONOR చిక్ లైఫ్ స్టైల్ అనే సరికొత్త విధానాన్ని రూపొందించి, ఈ అద్భుతమైన సాంకేతికత, నూతన జీవనశైలి సమాహారాన్ని "TechChic" గా పిలుస్తుంది. ఈ సరికొత్త పదం HONOR ను స్టైలిష్, హై-టెక్ స్మార్ట్ఫోన్లను అందించే బ్రాండ్‌గా మార్చింది. అంతేకాక దీనిని బ్రాండెడ్ ఫోన్ల వరుసలో అగ్ర స్థానంలో నిలిపింది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన ఫోన్లను అందించడంలో అత్యంత ప్రసిద్ధి చెందిన HONOR, ఈ Techchic విధానాన్ని రూపొందించి, స్మార్ట్ఫోన్ పరిశ్రమలోనే తదుపరి స్మార్ట్‌ఫోన్ విభాగంలో విప్లవాత్మక మార్పే ప్రధాన లక్ష్యంగా పెట్టుకుంది.

Honor tech chic technology, Honor new gen tech chic, Honor smartphones, Honor new smartphone, Honor new technology, హానర్ టెక్ చిక్ టెక్నాలజీ, హానర్ న్యూ జెన్ టెక్ చిక్, హానర్ స్మార్ట్‌ఫోన్, హానర్ స్మార్ట్‌ఫోన్, హానర్ టెక్నాలజీ

2017 లో వినూత్నమైన డిజైన్ తో విడుదలైన HONOR 9 మార్కెట్‌లో ఊహించని ప్రకంపనలను సృష్టించింది. 15-లేయర్డ్ ప్రాసెస్ 3డీ కర్వ్డ్ అరోరల్ గ్లాస్‌తో వచ్చిన దీని అద్భుతమైన డిజైన్ స్మార్ట్‌ఫోన్‌కు మరింత ఆకర్షణీయంగా నిలిచింది. ఆ తరువాత డిస్కలర్డ్ పోలార్ లైట్ కోటింగ్ టెక్నాలజీతో HONOR 10 మొబైల్ ను విడుదల చేసి సాంకేతిక పురోగతిలో HONOR మరో మెట్టు పైకి ఎదిగింది. ఎన్నో ప్రశంసలను సొంతం చేసుకున్న వినూత్నమైన ఈ డిజైన్ 2018-2019 ఈఐఎస్ఏ (యూరోపియన్ ఇమాజిన్ అండ్ సౌండ్ అసోసియేషన్) లైఫ్ స్టైల్ స్మార్ట్ఫోన్ ఆఫ్ ది ఇయర్ టైటిల్‌ను సొంతం చేసుకుంది.

Honor tech chic technology, Honor new gen tech chic, Honor smartphones, Honor new smartphone, Honor new technology, హానర్ టెక్ చిక్ టెక్నాలజీ, హానర్ న్యూ జెన్ టెక్ చిక్, హానర్ స్మార్ట్‌ఫోన్, హానర్ స్మార్ట్‌ఫోన్, హానర్ టెక్నాలజీ

ప్రతీసారి పోటీదారుల తలదన్నే సరికొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని పరిచయం చేస్తూ HONOR ముందుకు సాగుతుంది. ఈ మొబైల్ దిగ్గజం బటర్‌ఫ్లై స్క్రీన్ స్ట్రక్చర్డ్, 3డీ కర్వ్డ్ ఆప్టికల్ నానోమీటర్ వాక్యూమ్ కోటింగ్ టెక్నాలజీతో HONOR Magic 2 ని విడుదల చేసి అందరి దృష్టిని ఆకర్షించింది. ప్రతీ మోడల్‌తో గుర్తించదగిన సాంకేతిక పురోగతిని సాధించిన HONOR ఎన్నో ప్రశంసలు పొందుతూ భారీ మార్కెట్ షేర్లను సొంతం చేసుకుంది.

Honor tech chic technology, Honor new gen tech chic, Honor smartphones, Honor new smartphone, Honor new technology, హానర్ టెక్ చిక్ టెక్నాలజీ, హానర్ న్యూ జెన్ టెక్ చిక్, హానర్ స్మార్ట్‌ఫోన్, హానర్ స్మార్ట్‌ఫోన్, హానర్ టెక్నాలజీఅరోరల్ నానో టెక్నాలజీతో HONOR View20ని విడుదల చేసి HONOR మరింత విజయాన్ని సొంతం చేసుకుంది. దీనిలోని అద్భుతమైన పంచ్-హోల్ డిస్‌ప్లే, వేగవంతమైన కిరిన్ 980 చిప్‌సెట్‌ దీనిని ఆల్ రౌండర్‌గా నిలిపింది. విలక్షణమైన డిజైన్, వేగవంతమైన సాంకేతిక పరిజ్ఞానంతో HONOR ఇతర స్మార్ట్‌ఫోన్ బ్రాండ్‌లకు వాటి ప్రమాణాలను అధికం చేసింది.

Honor tech chic technology, Honor new gen tech chic, Honor smartphones, Honor new smartphone, Honor new technology, హానర్ టెక్ చిక్ టెక్నాలజీ, హానర్ న్యూ జెన్ టెక్ చిక్, హానర్ స్మార్ట్‌ఫోన్, హానర్ స్మార్ట్‌ఫోన్, హానర్ టెక్నాలజీ

Techchic అనే పదాన్ని పరిచయం చేస్తూ HONOR యువతరానికి అందిస్తున్న ఆధునిక సాంకేతిక ఉత్పతులు వారి జీవినశైలితో మిళితమవుతాయి, అంతే కాకుండా ఇవి సరసమైన ధరలకే అందుబాటులో లభిస్తున్నాయి. వినూత్నమైన స్టైల్, సాంకేతిక పరిజ్ఞానాన్ని కోరుకునే యువతరం దృష్టిని ఇది ఎంతగానో ఆకర్షిస్తుంది. కలర్, గ్రేడియంట్ పరంగా చూస్తే HONOR మొదటి నుండి తన స్టైల్ ను మెరుగుపరచుకుంటూ, మరింత అభివృద్ధి చెందుతూ వస్తుంది. తన సృష్టిని మరింత ముందుకు తీసుకెళుతూ HONOR బ్రాండ్ డైనమిక్ హాలోగ్రాఫిక్ బ్యాక్ డిజైన్‌తో HONOR 20 Pro, HONOR 20 ను విడుదల చేసింది. చిన్న చిన్న విషయాలకు కూడా మరింత శ్రద్ధ చూపే ఈ బ్రాండ్ వెనక్కి తిరిగి చూసుకునే అవసరం లేకుండా మార్కెట్ లో గొప్ప పేరుని సంపాదించింది. మొత్తానికి అల్ట్రా మోడర్న్, హై-టెక్ డిజైన్, ట్రెండీ కలర్స్ తో కూడిన స్మార్ట్‌ఫోన్‌లను అందించడంలో ప్రసిద్ధి చెందిన HONOR, Techchic అనే సరికొత్త పదాన్ని పరిచయం చేసింది. తన ఆధునిక సాంకేతికత, సరికొత్త స్టైల్ తో వినియోగదారులను ప్రతీసారి ఆశ్చర్యంలో ముంచెత్తడానికి ఈ బ్రాండ్ ఎంతగానో కృషి చేస్తుంది.

Honor tech chic technology, Honor new gen tech chic, Honor smartphones, Honor new smartphone, Honor new technology, హానర్ టెక్ చిక్ టెక్నాలజీ, హానర్ న్యూ జెన్ టెక్ చిక్, హానర్ స్మార్ట్‌ఫోన్, హానర్ స్మార్ట్‌ఫోన్, హానర్ టెక్నాలజీ

వినియోగదారులకు ఉత్తమ స్మార్ట్‌ఫోన్లను అందించడానికి సాంకేతిక పరిజ్ఞానం పరంగా ముందుకు సాగుతున్న క్రమంలో HONOR, ప్రపంచంలోని అగ్రశ్రేణి మొబైల్ దిగ్గజాల వ్యతిరేకతను ఎదుర్కొంటుంది. HONOR తను విడుదల చేసే ప్రతీ మోడల్ లో వినూత్నమైన ఆవిష్కరణలు చేయడంలో ప్రసిద్ధి. వినూత్నమైన స్టైల్ తో అందరి దృష్టిని ఆకర్షించే HONOR స్మార్ట్‌ఫోన్లు ఇతర ప్రముఖ బ్రాండ్లకు గట్టి పోటీ ఇస్తున్నాయి. సృజనాత్మక మార్కెటింగ్ నైపుణ్యాలు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో HONOR మార్కెట్ లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకుని, ఉత్తమ బ్రాండ్గా నిలిచింది.

స్మార్ట్ఫోన్లతో పాటు 2020 లో టీవీ, దుస్తులతో సహా అద్భుతమైన ఉత్పత్తులను అందించడానికి సిద్ధంగా ఉన్న HONOR India అందిస్తున్న సరికొత్త TechChic బ్రాండ్ కోసం మనమంతా కొంతకాలం వేచిచూడాల్సిందే.
Published by: Santhosh Kumar S
First published: December 27, 2019, 6:13 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading