HONOR LAPTOP ANOTHER NEW LAPTOP COMING FROM HONOR MAGIC BOOK LAP PRICE FEATURES DETAILS HERE GH VB
Honor Laptop: హానర్ నుంచి రానున్న మరో కొత్త ల్యాప్‌టాప్.. మ్యాజిక్ బుక్ ల్యాపీ ధర, ఫీచర్ల వివరాలు..
ప్రతీకాత్మక చిత్రం
ప్రముఖ మొబైల్ ఫోన్ బ్రాండ్ హానర్... మ్యాజిక్ బుక్ పేరుతో గతంలోనే ల్యాప్‌టాప్ మార్కెట్లో అడుగుపెట్టి సక్సెస్ అయింది. అయితే ఇప్పుడు పోర్టబిలిటీ, పెర్ఫామెన్స్‌ను అప్డేట్ చేస్తూ మరొక మ్యాజిక్ బుక్ ల్యాప్‌టాప్‌ను ఇండియాలో రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించింది.
ప్రముఖ మొబైల్ ఫోన్ బ్రాండ్ హానర్(Honor).. మ్యాజిక్ బుక్(Magic Book) పేరుతో గతంలోనే ల్యాప్‌టాప్ మార్కెట్లో(Market) అడుగుపెట్టి సక్సెస్ అయింది. అయితే ఇప్పుడు పోర్టబిలిటీ, పెర్ఫామెన్స్‌ను అప్డేట్ చేస్తూ మరొక మ్యాజిక్ బుక్ ల్యాప్‌టాప్‌ను(Laptop) ఇండియాలో రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించింది. భారతదేశంలో కొత్త విండోస్ ల్యాప్‌టాప్‌ను లాంచ్ చేయడానికి హానర్ సన్నాహాలు చేస్తోంది. హానర్ సంస్థ తన అప్‌కమింగ్ లేటెస్ట్ మ్యాజిక్ బుక్ల్యాప్టాప్ టీజర్‌ను అమెజాన్‌లో(Amazon) రిలీజ్ చేసింది. ఈ ల్యాప్‌టాప్ ఫీచర్స్, డిజైన్, స్టైల్‌తో పాటు ఇతర కేపబిలిటీస్ గురించి కొన్ని హింట్స్ ఇచ్చింది. కరోనా టైంలో ల్యాప్‌టాప్‌లకు పెరిగిన డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని హానర్.. ల్యాప్‌టాప్ సెగ్మెంట్లోకి అడుగుపెట్టింది.
హానర్ మ్యాజిక్ బుక్ 15 పేరుతో ఫుల్ హెచ్డీ డిస్ప్లే, ఏఎండీ రైజెన్ 3000 సిరీస్ ప్రాసెసర్‌తో విండోస్ ల్యాప్‌టాప్ రిలీజ్ చేసింది. ఇప్పుడు అదే మ్యాజిక్ సిరీస్‌లో మరిన్ని మోడల్స్ అందుబాటులోకి తీసుకురానుంది. ఈ సరికొత్త మ్యాజిక్ బుక్.. డ్యూరబుల్ అల్యూమినియం బాడీతో, 1.38 కిలోల బరువుతో, తేలికపాటి డిజైన్‌తో ఉండబోతోంది.
హానర్ రిలీజ్ చేసిన టీజర్ ప్రకారం ఈ ల్యాప్‌టాప్ యూఎస్బీ 2.0 (USB 2.0) వంటి కనెక్టివిటీ పోర్టులతో పాటు హెడ్డీఎమ్ఐ(HDMI)ఇంటర్ఫేస్ను కూడా కలిగి ఉంది. ఈ ల్యాప్‌టాప్‌లో బ్యాక్ లిట్ కీబోర్డ్‌తో పాటు, యాంటీ గ్లేర్ కోటెడ్ , ఫ్లికర్-ఫ్రీ టెక్నాలజీతో రూపొందించిన ఫుల్ హెచ్డీ డిస్ప్లేతో రానుంది. ఈ హానర్ ల్యాప్‌టాప్‌లో టూ ఇన్ వన్ ఫింగర్ ప్రింట్ స్కానర్ అలాగే పాప్-అప్ కెమెరా మాడ్యూల్ కూడా ఉన్నాయి.
ప్రాసెసర్ విషయానికొస్తే.. ఇది ఇంటెల్ కోర్ ప్రాసెసర్లతో కూడిన వేరియంట్లతో లభించే అవకాశం ఉంది. ప్రీ ఇన్స్టాల్డ్ విండోస్ 11 ఆపరేటింగ్ సిస్టమ్‌ను ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అలాగే ఈ ల్యాప్‌టాప్ 65W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. కేవలం 30 నిమిషాల్లో 59 శాతం బ్యాటరీ ఛార్జ్ చేస్తుంది. లేటెస్ట్ ఫీచర్లతో ప్యాక్ చేసిన హానర్ మ్యాజిక్ బుక్ బేస్ మోడల్ ధర సుమారు రూ 50,000 ఉండొచ్చు. ఇందులో ఉండే ప్రాసెసర్ వేరియంట్లను బట్టి టాప్ మోడల్ ధర రూ. 70, 000 పైనే ఉండొచ్చు.
ప్రస్తుతం మార్కెట్లో ఉన్న హానర్ మ్యాజిక్ బుక్ 15 ధర రూ.42,990 గా ఉంది. ఈ హానర్ బుక్ లో ప్రీ ఇన్స్టాల్డ్ విండోస్ 10 హోమ్, 15.6-అంగుళాల ఫుల్ హెచ్డి (1,920x1,080 పిక్సెల్స్) ఐపిఎస్ డిస్ప్లేతో 87 శాతం స్క్రీన్ టు బాడీ రేషియో, బ్లూ లైట్ ఎఫెక్ట్‌ను తగ్గించడానికి టీవీ రీన్‌ల్యాండ్ సర్టిఫికేషన్ లాంటి ఫీచర్లున్నాయి. ఈ మ్యాజిక్ బుక్ ఏఎండి రైజెన్ 5 3500యూ ప్రాసెసర్‌తో పాటు రేడియన్ వేగా 8 గ్రాఫిక్స్, 8జిబి డిడిఆర్4 డ్యూయల్-ఛానల్ ర్యామ్‌తో పనిచేస్తుంది. స్టోరేజ్ కోసం ఇందులో 256జీబీ ఎస్ఎస్డీ ఉంది.
Published by:Veera Babu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.