ఫోన్ పోయింది... దొరికినవాళ్లు తిరిగిస్తే రూ.4 లక్షల బహుమతి

మే 21 లోగా ఫోన్ తిరిగొస్తే చాలని, ఆ తర్వాత ఫోన్ ఎవరైనా తీసుకొచ్చి ఇచ్చినా పెద్దగా లాభం ఉండదని హానర్ భావిస్తోంది. అందుకే ఆలోపు తిరిగి ఇచ్చినవారికి బహుమతి ప్రకటించింది.

news18-telugu
Updated: April 26, 2019, 10:32 AM IST
ఫోన్ పోయింది... దొరికినవాళ్లు తిరిగిస్తే రూ.4 లక్షల బహుమతి
ఫోన్ పోయింది... దొరికినవాళ్లు తిరిగిస్తే రూ.4 లక్షల బహుమతి (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
ఫోన్ పోతే ఎవరికైనా బాధేస్తుంది. అది రూ.10 వేల ఫోన్ అయినా... రూ.50 వేల ఫోన్ అయినా... పోగొట్టుకున్నవాళ్లకు కొంతకాలం బాధ తప్పదు. ఫోన్ పోయిందని పోలీసులకు కంప్లైంట్ ఇచ్చినా తిరిగొస్తుందన్న గ్యారెంటీ తక్కువ. ఫోన్ దొరికితే అదృష్టం అనుకొని మళ్లీ కొత్త ఫోన్ కొనుక్కుంటారు. కానీ ఓ కంపెనీ మాత్రం... తాము పోగొట్టుకున్న ఫోన్ దొరికినవాళ్లు తిరిగిస్తే రూ.4 లక్షల బహుమతి ఇస్తామని ప్రకటించింది. అవును... ఇది అక్షరాలా నిజం. హానర్ కంపెనీ ప్రకటించిన ఆఫర్ ఇది. రూ.4 లక్షల బహుమతి ఇచ్చేంత ప్రత్యేకత, గొప్పదనం ఆ ఫోన్‌లో ఏముంది అన్న డౌట్ రావొచ్చు. అది ప్రోటోటైప్ ఫోన్. అంటే నమూనా మాత్రమే. అలాంటి ఫోన్లు మార్కెట్లో లేవు. కంపెనీ నమూనా తయారు చేసి పరీక్షిస్తోంది.

Read this: PAN Card: పాన్ కార్డులో తప్పుల్ని సరిచేసుకోండి ఇలా...

తమ కంపెనీకి చెందిన ఉద్యోగి డస్సెల్‌డోర్ఫ్ నుంచి మ్యూనిచ్ వెళ్తున్న ICE 1125 రైలులో ప్రోటోటైప్ ఫోన్ పోగొట్టుకున్నాడని, ఆ ఫోన్ దొరికినవాళ్లు తిరిగిస్తే 5,000 యూరోలు అంటే సుమారు రూ.4 లక్షల బహుమతి ఇస్తామని హానర్ జెర్మనీ ప్రకటించింది. ప్రోటోటైప్ డివైజ్ గ్రే కలర్ కేస్‌తో ఉంటుందని, అది చూసి గుర్తించాలని తెలిపింది. లండన్‌లో మే 21న హానర్ 20 సిరీస్ ఫోన్లను రిలీజ్ చేయనుంది కంపెనీ. ఇప్పుడు పోగొట్టుకున్న ప్రోటోటైప్ ఫోన్ హానర్ 20 సిరీస్‌లోని ఫోన్ కావొచ్చని అంచనా. మే 21 లోగా ఫోన్ తిరిగొస్తే చాలని, ఆ తర్వాత ఫోన్ ఎవరైనా తీసుకొచ్చి ఇచ్చినా పెద్దగా లాభం ఉండదని హానర్ భావిస్తోంది. అందుకే ఆలోపు తిరిగి ఇచ్చినవారికి బహుమతి ప్రకటించింది.

Read this: Aadhaar Card: మీ ఆధార్ కార్డు ఎక్కడెక్కడ వాడారో తెలుసుకోండి

మొబైల్ ఫోన్ తయారీదారులు సాధారణంగా తమ ప్రోటోటైప్ డివైజ్‌లను లాంఛింగ్‌కు ముందు కంపెనీ ఉద్యోగులకు ఇచ్చి పరీక్షిస్తుంటాయి. ఈ డివైజ్‌లకు సంబంధించిన సమాచారం లీక్ కాకుండా జాగ్రత్తలు తీసుకుంటాయి. తమ కొత్త డివైజ్‌కు సంబంధించిన సమాచారం లీక్ అయితే ప్రత్యర్థి కంపెనీలు ఫీచర్స్ విషయంలో అప్రమత్తమౌతాయని కంపెనీలు జాగ్రత్తగా ఉంటాయి.

Photos: రెడ్‌మీ 7 రిలీజ్... స్మార్ట్‌ఫోన్ ఎలా ఉందో చూశారా...
ఇవి కూడా చదవండి:

Jio Apps: మీ స్మార్ట్‌ఫోన్‌లో ఈ జియో యాప్స్ ఉన్నాయా? ఉపయోగాలు తెలుసుకోండి

JIO New Plans: జియో ప్లాన్స్ ధరలు తగ్గాయి... రూ.149 ప్లాన్‌తో 42 జీబీ డేటా

Tata Sky New Packs: డీటీహెచ్ ప్లాన్స్‌ ధరల్ని తగ్గించిన టాటా స్కై... కొత్త తెలుగు ప్యాక్స్ ఇవే
First published: April 26, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading