Home /News /technology /

HONOR BAND 5 VS MI BAND 4 KNOW WHICH IS BEST SMART BAND SS

HONOR Band 5 vs Mi Band 4: ఈ రెండు స్మార్ట్ బ్యాండ్లలో ఏది బెస్ట్? తెలుసుకోండి

HONOR Band 5 vs Mi Band 4: ఈ రెండు స్మార్ట్ బ్యాండ్లలో ఏది బెస్ట్? తెలుసుకోండి

HONOR Band 5 vs Mi Band 4: ఈ రెండు స్మార్ట్ బ్యాండ్లలో ఏది బెస్ట్? తెలుసుకోండి

HONOR Band 5 vs Mi Band 4 | మీరు వర్కౌట్ చేసినప్పుడు, అధిక ఎత్తులో ఉన్నప్పుడు మీ బాడీ రియాక్షన్, అడాప్షన్ గురించి విశ్లేషించవచ్చు. ఈ ఫీచర్ కోసం Mi Band వినియోగదారులు HONOR Band 5 కి మారేందుకు సిద్ధమవుతారు.

  పండుగలతో మీ క్యాలెండర్, స్వీట్లతో మీ డైనింగ్ టేబుల్ పూర్తిగా నిండిడిపోవడంవలన పెరిగిన అదనపు బరువుని కోల్పోవడానికి మీ దినచర్యలో ఫిట్‌నెస్‌కు సమయం కేటాయించడం అవసరం. అంటే మీ ఫిట్నెస్ ఐడల్ ఇన్‌స్టాగ్రామ్‌ను నిరంతరం స్క్రోలింగ్ చేయడం, మీగోడలపై ప్రేరణాత్మక సూత్రాలను అంటించుకోవడం, ముఖ్యంగా మీ పురోగతిని ట్రాక్ చేయడం కోసం ఫిట్‌నెస్ బ్యాండ్ తీసుకోవడం తప్పదు. అన్నింటికంటే ముఖ్యంగా అదనపు పౌండ్లను తగ్గించుకోవడానికి మీరు సిద్ధంగాఉండాలి. ఫిట్‌నెస్ బ్యాండ్‌లు గో టు స్మార్ట్ పరికరంగా మారాయి. ఇది ప్రతీ ఫిట్‌నెస్ నిత్యకృత్యాలను ట్రాక్ చేస్తుంది. ఇటీవల ఇది ఒక మంచి కారణం కోసం కొత్త ట్రెండ్‌గా మారింది. మార్కెట్లో లభిస్తున్న రిస్ట్ బ్యాండ్‌లో తాజాగా చేరిన వాటిలో HONOR Band 5 ఒకటి. దీనిధర, డిజైన్ అందరినీ ఆకట్టుకుంటుంది. ఇదిమార్కెట్లో విడుదలైనప్పటి నుండీ మంచి సమీక్షలను అందుకుంది. కానీ ఆఫరింగ్స్, అప్లికేషన్ల పరంగా ఇది Mi Band 4 ను ఓడిస్తుందా? ఖచ్చితంగా ఓడించగలదు అని మీకు నిరూపించడంకోసం మేము HONOR Band 5, XiaomiMi Band 4 లను పోల్చబోతున్నాము. ఒకసారిచూద్దాం.

  HONOR Band 5 vs Mi Band 4, HONOR Band 5 features, HONOR Band 5 specifications, HONOR Band 5 sale, HONOR Band 5 offers, HONOR Band 5 amazon, HONOR Band 5 filpkart, హానర్ బ్యాండ్ 5 ఫీచర్స్, హానర్ బ్యాండ్ 5 సేల్,

  ఉబెర్-కూల్ డిజైన్


  HONOR Band 5, Mi Band 4 రెండింటిలో 0.95-అంగుళాల 2.5 డి గ్లాస్‌తో AMOLED ఫుల్-కలర్డ్ డిస్‌ప్లే కలదు. HONOR Band 5లోమరింత ప్రకాశవంతమైన డిస్ప్లే ఉండడం వలన చదవడానికి చాలా సులభంగా, సౌకర్యవంతంగా ఉంటుంది. అందువలన HONOR Band 5ను తీవ్రమైన ఎండలో చూసినప్పటికి కూడా మీకు ఇబ్బందిగా అనిపించదు. చివరగా దీని లుక్ అన్నిసందర్భాల్లోధరించవచ్చోలేదో నిర్ణయిస్తుంది. ప్రీమియం రబ్బబ్ బ్యాండ్ వలన HONOR Band 5, Mi Band 4 కంటే మరింత స్టైలిష్‌గా కనిపించడమే కాకుండా చాలా తేలికగా, ధరించడానికి సౌకర్యంగా ఉంటుంది. Mi Band 4లోనాలుగు ప్రీసెట్ వాచెస్ ఉన్నాయి, వీటిని మీ మూడ్‌ని బట్టిమార్చుకోవచ్చు. మీరు మీ ఫోటో గ్యాలరీ నుండి పిక్చర్ను ఎంచుకుని లేదా డౌన్లోడ్‌ చేసుకుని మీవాచ్‌గా సెట్ చేసుకోవచ్చు. HONOR Band 5 వివిధ సందర్భాలకు అనుగుణంగా మార్చుకోగలిగే ఎనిమిది వాచ్ ఫేస్లను అందిస్తుంది. డిస్ప్లే, డిజైన్పరంగా HONOR Band 5 ఖచ్చితంగామంచిఎంపిక అని చెప్పవచ్చు.

  సమర్ధవంతమైన స్విమ్మింగ్


  HONOR Band 5, Mi Band 4 లకు 50 మీటర్లవరకూ నీటి నిరోధకత కలదు. అంటే ఇప్పుడు మీరు మీ బ్యాండ్‌ను ఈతకోసం కూడా తీసుకోవచ్చు. రెండు బ్యాండ్లతో బ్యాక్‌స్ట్రోక్, బట్టర్‌ఫ్లై, బ్రెస్ట్ స్ట్రోక్ లెక్కించవచ్చు. HONOR Band 5 అదనంగా స్విమ్మింగ్ స్పీడ్, దూరం, కేలరీలను కూడా నమోదు చేస్తుంది. మేము గుర్తించిన మరో ఆసక్తికరమైన ఫీచర్ ఏమిటంటే, SWOLF స్కోర్ అంటే ఒక నిర్ణీత దూరంలో నిర్ణీత సమయానికి పొడవును బట్టి మీరు చేసిన మొత్తం స్ట్రోక్లను లెక్కించగా వచ్చిన స్కోర్ను కూడా లెక్కిస్తుంది.

  HONOR Band 5 vs Mi Band 4, HONOR Band 5 features, HONOR Band 5 specifications, HONOR Band 5 sale, HONOR Band 5 offers, HONOR Band 5 amazon, HONOR Band 5 filpkart, హానర్ బ్యాండ్ 5 ఫీచర్స్, హానర్ బ్యాండ్ 5 సేల్,

  క్యాలిక్యులేటెడ్ ఔట్‌డోర్ ఫిట్నెస్


  స్టెప్ ట్రాకింగ్ అనేది చాలామంది ఉపయోగించే ఫిట్‌నెస్ ట్రాకర్. HONOR Band 5లో స్టెప్ ట్రాకింగ్ ఖచ్చితంగా ఉంటుంది. HONOR Band 5 ప్రతీ అడుగుని లెక్కిస్తుంది.
  HONOR Band 5ను ప్రత్యేకంగా నిలిపే అంశం ఏమిటంటే, అవుట్ డోర్ రన్నింగ్, అవుట్ డోర్ వాకింగ్, అవుట్ డోర్ సైక్లింగ్, ఇండోర్ సైక్లింగ్, ప్రీట్రైనింగ్ పూల్ స్విమ్మింగ్, ఇండోరప్ వాకింగ్ లాంటి 10 విభిన్న రకాల ఫిట్నెస్ మోడల్స్‌ను ఖచ్చితంగా ట్రాక్ చేస్తుంది. HONOR Band 5 తమ ట్రాకింగ్ సేవలను క్రమబద్దీకరించినప్పటికీ, Mi Band 4 లోఅవుట్ డోర్ రన్నింగ్, ట్రెడ్ మిల్, పూల్ స్విమ్మింగ్, వాకింగ్, సైక్లింగ్ వంటి 6 ఫిట్‌నెస్ మోడళ్లను మాత్రమే ట్రాక్ చేస్తుంది. HONOR Band 5 లోని ప్రాథమిక సెట్టింగ్స్ను దానిలోనే మార్చవచ్చు, కానీ Mi Band 4లో ఆ అవకాశం లేదు, దానికోసం ప్రత్యేకంగా అప్లికేషన్ అవసరం.

  హృదయానికి ఏది కావాలో అదేకోరుకుంటుంది


  పనిచేసేసమయంలో మీ హృదయ స్పందన రేటుని గమనించడం అంత సులభం కాదు. కానీ ఈ రెండు బ్యాండ్లు మీ హృదయస్పందన రేటుని ప్రతీ క్షణం పర్యవేక్షిస్తాయి. HONORలో అదనంగా గల 3వ జనరేషన్ Huawei ట్రూసీన్ ఇంటెలిజెంట్ హార్ట్ మానిటర్ AI డ్రివెన్ అల్గారిథంను ఉపయోగించి ఖచ్చితమైన రేటింగులను అందిస్తుంది. హృదయ స్పందన రికార్డుల పెరుగుదల లేదా తగ్గుదల గురించి HONOR Band 5 వినియోగదారులను హెచ్చరిస్తుంది. రాత్రి సమయంలో నిరంతరాయమైన పర్యవేక్షణ కోసం ఇన్ఫారెడ్ టెక్నాలజీని ఉపయోగిస్తుంది. జీవనశైలిని మెరుగుపరచడంలో మీకు సహాయ పడడమే కాకుండా, మీ హృదయస్పందన రేటు గురించి విలువైన అవగాహనను అందిస్తుంది.

  HONOR Band 5 vs Mi Band 4, HONOR Band 5 features, HONOR Band 5 specifications, HONOR Band 5 sale, HONOR Band 5 offers, HONOR Band 5 amazon, HONOR Band 5 filpkart, హానర్ బ్యాండ్ 5 ఫీచర్స్, హానర్ బ్యాండ్ 5 సేల్,

  స్లీప్ బెటర్ లివ్ బెటర్


  HONOR Band 5లో గల ఖచ్చితమైన స్లీప్ ట్రాకింగ్ ఫీచర్ మీరు ఎప్పుడు నిద్రపోయారు, స్లీప్ సైకిల్, రాత్రి నిద్రలో మార్పులు, మీరు మేల్కొన్న వివరాలను పరిగణలోకి తీసుకుంటుంది. Band 5, Huawei ‘TruSleep2.0’ ను ఉపయోగించి నిద్రపోయినప్పుడు మీ హృదయస్పందనరేటు, శ్వాసనుపర్యవేక్షిస్తుంది, అంతేకాకుండా 200లకు పైగా గల పర్సనలైజ్డ్ స్లీపింగ్ రికమండేషన్లలో ఆరు రకాల సాధారణ నిద్ర సమస్యలను కూడా గుర్తిస్తుంది. HONOR Band 5తో పోల్చి చూస్తే Mi Band 4లో గల స్లీప్ ట్రాకింగ్ ఫీచర్‌లో ఖచ్చితత్వం తక్కువ.

  యాక్యురేటెడ్ ఆక్సిజన్ డిటెక్షన్


  HONOR Band 5 లో గల ప్రత్యేక లక్షణాలలో Sp02 మానిటర్ ఒకటి. ఇది రక్తప్రసరణలో ఆక్సిజన్‌ను ట్రాక్ చేస్తుంది. తద్వారా మీరు వర్కౌట్ చేసినప్పుడు, అధిక ఎత్తులో ఉన్నప్పుడు మీ బాడీ రియాక్షన్, అడాప్షన్ గురించి విశ్లేషించవచ్చు. ఈ ఫీచర్ కోసం Mi Band వినియోగదారులు HONOR Band 5 కి మారేందుకు సిద్ధమవుతారు.

  మీరు ఇష్టపడే అదనపు లక్షణాలు


  రెండు బ్యాండ్లు మ్యూజిక్, మ్యూజిక్ వాల్యూమ్ కంట్రోల్, యాప్ నోటిఫికేషన్, వ్యూ ఇమేజెస్, డిస్‌ప్లే కాల్స్, స్వాప్ వాచ్, టైమర్, కాల్ లాంటి వాటిని సపోర్ట్ చేస్తాయి. HONOR Band 5 అదనంగా బ్యాండ్ కెమెరా కంట్రోల్ ఫంక్షన్ కూడా అందిస్తుంది. మీరు ఈ బ్యాండ్ ఉపయోగించి మీ ఫోన్ను కూడా కనుగొనవచ్చు. ఇదిచాలాబాగుందికదూ?HONOR ఇంకా Mi లు బ్యాండ్‌తో కనెక్ట్ అయిన వాటి వర్షన్లకు సంబంధించిన హెల్త్ యాప్‌లను అందిస్తున్నాయి. Huawei హెల్త్ యాప్ ఎంఐ హెల్త్ యాప్ కంటే వినియోగదారులకు మరింత అనుకూలంగా ఉంటుంది. రెండు బ్యాండ్లు ఒక అప్లికేషన్ నుంచి మరో అప్లికేషన్‌కు చాలా సున్నితమైన నావిగేషన్‌‌తో అంతరాయం లేకుండా పనిచేస్తాయి.

  HONOR Band 5 vs Mi Band 4, HONOR Band 5 features, HONOR Band 5 specifications, HONOR Band 5 sale, HONOR Band 5 offers, HONOR Band 5 amazon, HONOR Band 5 filpkart, హానర్ బ్యాండ్ 5 ఫీచర్స్, హానర్ బ్యాండ్ 5 సేల్,

  ది పవర్ హౌజ్ ఆఫ్ ది బ్యాండ్


  ఎక్కువ సేపు పనిచేసే ఫిట్‌నెస్ ట్రాకర్లు ఆకర్షణీయమైన ఉత్తమ లక్షణాలలో ఒకటిగా నిలిచాయి. 110 mAh బ్యాటరీతో నడిచే HONOR Band 5 ను ఒక గంట సేపు పూర్తిగా ఛార్జింగ్ చేసినట్లయితే 14 రోజుల వరకు నిరంతరాయంగా పనిచేస్తుంది. అదే 135 mAh బ్యాటరీ గల Mi Band 4ను 2 గంటలు పూర్తిగా ఛార్జింగ్ చేస్తే 20 రోజుల పాటు నడుస్తుంది. అదృష్టవశాత్తూ రెండింటిలోని ఫిట్‌నెస్ ట్రాకర్స్ బ్యాటరీ లైఫ్ అద్భుతంగా పనిచేస్తుంది.

   

  మీరు వినవలసిన ఏకైక ధర


  రెండు బ్యాండ్ల ధరలు చాలా పోటీగా ఉన్నాయి. ఆశ్చర్యపోతున్నారా, అవును ఎందుకంటే ఫీచర్లు అద్భుతమైన యూజర్ ఫ్రెండ్లీ, అలాగే ఎక్స్‌పెన్సీవ్. Mi Band 4 ధర రూ.2,299 కాగా, HONOR Band 5 ధరరూ. 2,599. ఈ పండుగఅమ్మకాలలో HONOR Band 5 కేవలంరూ. 2,399కే మీకు దొరుకుతుందనే వార్తను మీకు చెప్పవలసిన సమయం వచ్చేసింది.

  అంతిమ తీర్పు


  HONOR Band 5, Mi Band 4లు తేలికగా, చూడడానికి స్టైల్‌గా కనిపిస్తాయి. లావుగా, బరువుగా అనిపించే ఫిట్‌నెస్ ట్రాకర్లను ఇష్టపడనివారికి ఇది చాలా అనువుగా ఉంటుంది. ఒకవేళ మేము ఈరెండింటిలో ఒకదానిని ఎంచుకోవలసివస్తే, మేముఖచ్చితంగా HONOR Band 5 ని ఎంచుకుంటాం. ఎందుకంటే దీనిలోని అద్భుతమైన ఫీచర్ల వలన ఆకర్షణీయంగా ఉంటుంది. ఇదిమాత్రమేకాదు, మీరు HONOR Band 5 గనుక కొనుగోలు చేస్తే మీపురోగతిని ట్రాక్ చేయడంలో దాని ప్రభావాన్ని మీరు ఖచ్చితంగా గమనించవచ్చు. ఇది Mi Band 4లో చూడని డేటాను అందిస్తుంది.

  ఇది మీ స్మార్ట్‌ఫోన్‌కు ఖచ్చితంగా స్టైలిష్‌‌గా, తోడుగా ఉంటుంది. రివ్యూల పరంగా చూస్తేMi Band 4 కంటే HONOR Band 5 మంచిది.

  ఇక్కడ కొనుగోలు చేయండి
  Amazon: https://amzn.to/2owKqSR
  Flipkart: https://bit.ly/2VyVUkS

  ఇవి కూడా చదవండి:

  Flipkart offers: ఫ్లిప్‌కార్ట్‌లో ఈ 20 స్మార్ట్‌ఫోన్లపై డిస్కౌంట్ ఆఫర్స్

  Amazon Sale: అమెజాన్‌లో మళ్లీ ఫెస్టివల్ సేల్... ఈ 20 స్మార్ట్‌ఫోన్లపై ఆఫర్స్

  Redmi Note 7 Pro: రెడ్‌మీ నోట్ 7 ప్రో స్మార్ట్‌ఫోన్‌పై భారీ తగ్గింపు... లేటెస్ట్ రేట్స్ ఇవే
  First published:

  Tags: Honor, Huawei, Smartwatch, Technology

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు