Home /News /technology /

HONOR 9X OR SAMSUNG M30S KNOW WHICH SMARTPHONE IS BEST OPTION SS

Honor 9X or Samsung M30s: హానర్ 9ఎక్స్ లేదా సాంసంగ్ ఎం30ఎస్... ఏది మంచి ఫోన్ తెలుసుకోండి

Honor 9X or Samsung M30s: హానర్ 9ఎక్స్ లేదా సాంసంగ్ ఎం30ఎస్... ఏది మంచి ఫోన్ తెలుసుకోండి
(ప్రతీకాత్మక చిత్రం)

Honor 9X or Samsung M30s: హానర్ 9ఎక్స్ లేదా సాంసంగ్ ఎం30ఎస్... ఏది మంచి ఫోన్ తెలుసుకోండి (ప్రతీకాత్మక చిత్రం)

Honor 9X or Samsung M30s | ఈ రెండు ఫోన్‌ల బ్యాటరీ జీవితకాలం కూడా చాలా ఎక్కువ, ఫాస్ట్ ఛార్జింగ్ వల్ల ఫోన్‌ని చాలా తక్కువ సమయంలో ఛార్జ్ చేయవచ్చు, దానిని దీర్ఘకాలం ఉపయోగించుకోవచ్చు. అయితే, Kirin 710 F ప్రాసెసర్ వల్ల, పనితీరు పరంగా Samsung M30s కంటే HONOR 9X మెరుగైనది.

ఇంకా చదవండి ...
  ప్రతి ఒక్కరూ కొత్త సంవత్సరాన్ని సరికొత్త స్మార్ట్‌ఫోన్‌తో ప్రారంభించారు. గత దశాబ్దంలో, మనం ఎన్నో సాంకేతిక అభివృద్ధిని గమనించాం, ఈ దశాబ్దంలో HONOR ఒక టెక్ చిక్ బ్రాండ్‌గా మార్కెట్‌లో తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంది. ఈ కొత్త దశాబ్దంలో సైతం స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో పోటీ విపరీతంగా పెరిగిపోతోంది, అంటే రాబోయేరోజుల్లో యూజర్లు మరిన్ని కొత్త ఫీచర్లు చూడబోతున్నారని దీని అర్థం. పోటీకి సంబంధించి, ఇటీవల లాంఛ్ చేయబడ్డ HONOR 9X ఫోన్ బడ్జెట్ సెగ్మెంట్‌లో Samsung M30కు గట్టి పోటీని ఇస్తోంది, ఎందుకంటే ఈ రెండు ఫోన్లు కూడా అద్భుతమైనవి, చౌకైనవి అని రుజువు చేసుకోబడ్డాయి. అత్యంత ఆకర్షణీయమైన ధరతో అద్భుతమైన ఫీచర్లు అందించడం వల్ల HONOR 9X ఇప్పుడు ప్రజల ఎంపికగా మారింది. అయితే, ప్రతిఒక్కరికి ఒకే ప్రశ్న, Samsung M30 కంటే HONOR 9X మెరుగైనదా?

  డిజైన్ మరియు డిస్‌ప్లే


  HONOR 9Xకు బ్యాక్‌‌సైడ్‌లో డ్యూయల్ 3D కర్వ్‌డ్ ప్యానెల్ఉంది, దీని వల్ల దీనికి గ్లాసీ ఫినిష్ ఉంది, ఫోన్‌కు ప్రీమియం లుక్‌ ఇస్తుంది. ఫోన్స్ బ్యాక్ ప్యానెల్‌పై X- ఆకారపు డిజైన్ చెక్కబడి ఉంటుంది, ఇది లుక్‌ని మెరుగుపరుస్తుంది. మరోవైపు, Samsung M30 డిజైన్ దాదాపుగా Samsung Galaxy M10 మరియు M20 తరహాలోనే ఉంటుంది. Samsung M30 6.4-అంగుళాల FHD+ ఇన్‌ఫినిటీ-U సూపర్ అమోల్డ్ డిస్‌ప్లేతో పోలిస్తే HONOR 9X 6.59 స్క్రీన్ సైజుతో పూర్తి HD డిస్‌ప్లే‌తో వస్తుంది. దీనితోపాటుగా, HONOR 9X 91% స్క్రీన్ నిష్పత్తిని అందిస్తుంది, అదే Samsung M30లో మీరు 91.4% స్క్రీన్ నిష్పత్తిని పొందుతారు. టైప్-C ఛార్జింగ్‌తో రెండు ఫోన్‌ల్లోనూ ఫింగర్‌ఫ్రింట్ అన్‌లాక్ ఫీచర్ అందించబడుతుంది. క్లుప్తంగా చెప్పాలంటే, డిజైన్ మరియు డిస్‌ప్లే పరంగా HONOR 9X ఎంతో మెరుగైనది.

  కెమెరా


  నేడు, ఫోన్‌ని కొనుగోలు చేసేటప్పుడు కెమెరాకు అధిక ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. 48MP మెయిన్ కెమెరా,8MP సూపర్‌వైడ్ లైన్సులతో 120 డిగ్రీ వీక్షణ మరియు 2MP డెప్త్ కెమెరా ఇలా ట్రిపుల్ కెమెరా సెటప్‌తో HONOR 9X లభిస్తుంది. ఫ్రంట్ కెమెరా గురించి మాట్లాడినట్లయితే, దీనికి 16 MP పాప్ అప్ సెల్ఫీ కెమెరా ఉంది, ఇది సాఫ్ట్ లైట్, బటర్‌ఫ్లై లైట్, స్కేటెడ్ లైట్ వంటి 8 విభిన్న మోడ్‌లకు మద్దతు ఇస్తుంది. ఈ ధర శ్రేణిలో కేవలం HONOR 9X మాత్రమే మీకు పాప్-అప్ కెమెరాని అందిస్తుంది, ఇది ఇంటెలిజెంట్ ఫాల్ డిటెక్షన్, డౌన్‌వర్డ్ ప్రజర్ పొటెక్షన్ మరియు డస్ట్ మరియు స్ల్పాష్ ప్రొటెక్షన్ వంటి ఫీచర్లను కలిగి ఉంది. ఇదే సమయంలో, Samsung M30లో 48MP + 8MP + 5MP ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది, దీనితో మీరు క్రిస్ప్‌గా ఉండే ఫోటోలను క్లిక్ చేయవచ్చు, అయితే దీనిలో పాప్ అప్ సెల్ఫీ ఫీచర్ ఉండదు. దీనిలో 16MP డ్యూడ్రాప్ ఫ్రంట్ కెమెరా ఉంది. కెమెరా విషయానికి వస్తే, పాప్ అప్ సెల్ఫీ ఫీచర్ ఉండటం వల్ల Samsung M30ని HONOR 9X బీట్ చేస్తుంది.

  పనితీరు


  రెండు స్మార్ట్‌ఫోన్‌లు Android 9.0 Osతో వస్తాయి, అయితే HONOR 9X మాత్రం బెస్ట్ Kirin 710 F ఆక్టా కోర్ ప్రాసెసర్‌పై పనిచేస్తుంది, ఇది ఫోన్ మరింత స్మూత్‌గా పనిచేయడానికి దోహదపడుతుంది. మరోవైపు, Samsung M30sలో Exynos 9611 ప్రాసెసర్ ఉంది. ఈ విషయంలో, HONOR 9Xకే ఆధిక్యత లభిస్తుంది, ఎందుకంటే Kirin 710 F ఆక్టా కోర్ ప్రాసెసర్ Samsung M30s కంటే వేగంగా మల్టీ టాస్కింగ్ చేయగలదు, ఈ ఫోన్‌లో మీరు ఎలాంటి అంతరాయం లేకుండా గ్రాఫిక్స్ ఎక్కువగా గేమ్‌లను ఆడవచ్చు. ఈ రెండు మోడల్స్‌ 128 GB అంతర్గత స్టోరేజీ వేరియెంట్‌లు 4/6 GB RAMతో వస్తాయి. ఈ రెండు ఫోన్‌ల బ్యాటరీ జీవితకాలం కూడా చాలా ఎక్కువ, ఫాస్ట్ ఛార్జింగ్ వల్ల ఫోన్‌ని చాలా తక్కువ సమయంలో ఛార్జ్ చేయవచ్చు, దానిని దీర్ఘకాలం ఉపయోగించుకోవచ్చు. అయితే, Kirin 710 F ప్రాసెసర్ వల్ల, పనితీరు పరంగా Samsung M30s కంటే HONOR 9X మెరుగైనది.

  ధర


  పైన పేర్కొన్న సమాచారానికి సంబంధించి, ఫీచర్లు పరంగా Samsung M30s కంటే HONOR 9X ఎంతో మెరుగైనది. అందువల్ల, ఈ రెండు ఫోన్‌ల ఖరీదును మనం ఇప్పుడు చూద్దాం. HONOR 9X 4GB-128GB ధర. రూ.13,999, అయితే జనవరి 19 నుంచి జనవరి 22 వరకు రన్ అయ్యే ఫస్ట్ డే ఆఫర్‌లో ఇది రూ. 1,000 డిస్కౌంట్‌తో కేవలం రూ. 12,999లకు లభ్యమవుతోంది. అదనంగా, ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డు మరియు కొటక్ బ్యాంక్ డెబిట్ మరియు క్రెడిట్ కార్డు ద్వారా ఈ మోడల్ కొనుగోలు చేసినప్పుడు 10% డిస్కౌంట్ ఇవ్వబడుతుంది. అలానే, మీరు ఆఫర్ సమయంలో కొనుగోలు చేసినట్లయితే, మీకు రూ. 2,200 జియో రీఛార్జ్ వోచర్‌ని కూడా పొందుతారు, మీరు దీనిని రూ. 50 రీఛార్జ్ వలే 44 రీఛార్జ్‌లు చేసుకోవచ్చు. అదే సమయంలో 6GB + 128GB స్టోరేజీ వేరియెంట్ యొక్క ధర రూ. 16,999, అదనంగా బ్యాంక్ ఆఫర్ సాయంతో మీరు దీనిని కేవలం రూ.15,299లకు కొనుగోలు చేయవచ్చు. మరో వైపు Samsung M30s యొక్క 4GB-64GB వేరియెంట్ ధర రూ. 13,999 అదేవిధంగా 6GB + 128GB వేరియెంట్ యొక్క ధర రూ. 16,999. ధరల పరంగా, రెండు ఫోన్‌ల ధర ఒక్కటే అయినప్పటికీ మెరుగైన ఫీచర్‌లతో HONOR 9X అదే ధరకు లభిస్తోంది.

  తీర్పు


  ఈ రెండింటిని పోల్చగా, HONOR 9X తక్కువ ధరకు మెరుగైన ఫీచర్లను అందిస్తోంది. అన్నింటిని మించి, ఈ ధర శ్రేణి బ్రాండ్ పాప్ అప్ కెమెరాలను అందిస్తోంది, ఈ ఆఫర్ కారణంగా, తక్కువ ఖర్చుతో గ్రాండ్‌గా ఉండే ఫోన్‌ని పొందవచ్చు. ప్రాసెసర్‌కు సంబంధించి, HONOR Kirin 710, Exynos 9611 కంటే వేగవంతమైనది మరియు మెరుగైనదిగా పరిగణించబడుతుంది. దీనితోపాటుగా, HONOR 9Xలో ఎక్కువ కాలం మన్నే బ్యాటరీ ఉంటుంది.

  ఈ అన్ని ఫీచర్లను మదిలో పెట్టుకొని, ఈ నేపథ్యంలో HONOR 9X ఒక ఆదర్శవంతమైన ఎంపికగా పేర్కొనవచ్చు. ఇంత చౌకైన ధరతో, ప్రతి ఒక్కరూ తమ చేతిలో పాప్ అప్ కెమెరాని ఉంచుకోవాలని కోరుకుంటారు, అందువల్లనే ఈ రెండు మోడల్స్‌లో HONOR 9X పై చేయి సాధించింది.

  (This is a partnered post.)
  Published by:Santhosh Kumar S
  First published:

  Tags: Android, Honor, Smartphone, Smartphones

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు