news18-telugu
Updated: August 6, 2020, 10:01 AM IST
Honor: హానర్ నుంచి రెండు స్మార్ట్‌ఫోన్స్ రిలీజ్... ధర రూ.5,999 నుంచి
తక్కువ బడ్జెట్లో స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునేవారికి గుడ్ న్యూస్. రూ.10,000 లోపు రెండు స్మార్ట్ఫోన్లను ఇటీవల హానర్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఇవాళ్టి నుంచి ఈ ఫోన్లు కొనొచ్చు. హానర్ 9ఎస్ ధర రూ.6,499 కాగా, హానర్ 9ఏ ధర రూ.9,999. ఈ ఫోన్లను ఇంకా తక్కువ ధరకు కొనొచ్చు. ఫస్ట్ సేల్‌లో కొనేవారికి హానర్ 9ఎస్ రూ.5,999 ధరకు, హానర్ 9ఏ రూ.8,999 ధరకు లభిస్తుంది. ఈ స్మార్ట్ఫోన్లలో గూగుల్ ప్లేస్టోర్ ఉండదు. యాప్స్ కోసం హువావే రూపొందించిన యాప్ గ్యాలరీ ఉంటుంది. ఈ రెండు స్మార్ట్ఫోన్లతో పాటు హానర్ మ్యాజిక్ బుక్ 15 లాంఛ్ చేసింది కంపెనీ. ధర రూ.42,990. కానీ రూ.3,000 తగ్గింపుతో రూ.39,990 ధరకే కొనొచ్చు.
హానర్ 9ఎస్ స్పెసిఫికేషన్స్డిస్ప్లే: 5.45 అంగుళాలు
ర్యామ్: 2జీబీ
ఇంటర్నల్ స్టోరేజ్: 32జీబీ
ప్రాసెసర్: మీడియాటెక్ ఎంటీ6762ఆర్
రియర్ కెమెరా: 8 మెగాపిక్సెల్
ఫ్రంట్ కెమెరా: 5 మెగాపిక్సెల్
బ్యాటరీ: 3,020ఎంఏహెచ్ బ్యాటరీ
ఆపరేటింగ్ సిస్టమ్: ఆండ్రాయిడ్ 10 + మ్యాజిక్ యూఐ 3.1.1
సిమ్ సపోర్ట్: డ్యూయెల్ సిమ్
కలర్స్: బ్లాక్, బ్లూ
ధర: రూ.6,499 (ఆఫర్ ధర రూ.5,999)
హానర్ 9ఏ స్పెసిఫికేషన్స్
డిస్ప్లే: 6.3 అంగుళాలు
ర్యామ్: 3జీబీ
ఇంటర్నల్ స్టోరేజ్: 64జీబీ
ప్రాసెసర్: మీడియాటెక్ ఎంటీ6762ఆర్
రియర్ కెమెరా: 13+5+2 మెగాపిక్సెల్
ఫ్రంట్ కెమెరా: 8 మెగాపిక్సెల్
బ్యాటరీ: 5,000ఎంఏహెచ్ బ్యాటరీ
ఆపరేటింగ్ సిస్టమ్: ఆండ్రాయిడ్ 10 + మ్యాజిక్ యూఐ 3.1.1
సిమ్ సపోర్ట్: డ్యూయెల్ సిమ్
కలర్స్: బ్లాక్, బ్లూ
ధర: రూ.9,999 (ఆఫర్ ధర రూ.8,999)
Published by:
Santhosh Kumar S
First published:
August 6, 2020, 9:59 AM IST