హానర్ 8ఎక్స్ రిలీజ్ చేసిన హువావే!

హానర్ 8ఎక్స్ సేల్ అక్టోబర్ 24న ప్రారంభం కానుంది. అమెజాన్‌లో ఎక్స్‌క్లూజీవ్‌గా లభించనుంది. ఫోన్‌తో పాటు హానర్ స్టోర్ యాప్‌ని లాంఛ్ చేసింది హువావే.

news18-telugu
Updated: October 16, 2018, 6:06 PM IST
హానర్ 8ఎక్స్ రిలీజ్ చేసిన హువావే!
హానర్ 8ఎక్స్
  • Share this:
హువావే సబ్‌-బ్రాండ్ హానర్ నుంచి మరో స్మార్ట్‌ఫోన్ ఇండియాలో రిలీజైంది. గతేడాది హానర్ 7ఎక్స్ రిలీజ్ చేసిన హువావే... ఇప్పుడు హానర్ 8ఎక్స్ తీసుకొచ్చింది. ఈ డివైజ్ మొదట చైనాలో లాంఛైంది. ఇప్పుడు ఇండియా మార్కెట్లోకి వచ్చింది. 6.5 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ డిస్‌ప్లే, కిరిన్ 710 ప్రాసెసర్, 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా, 91% స్క్రీన్-టు-బాడీ రేషియో ఈ ఫోన్ ప్రత్యేకతలు. ఫోన్ డిజైన్ హానర్ ప్లే, హానర్ 9ఎన్‌ లాగే ఉంటుంది. హానర్ 8ఎక్స్ సేల్ అక్టోబర్ 24న ప్రారంభం కానుంది. అమెజాన్‌లో ఎక్స్‌క్లూజీవ్‌గా లభించనుంది. ఫోన్‌తో పాటు హానర్ స్టోర్ యాప్‌ని లాంఛ్ చేసింది హువావే.

హానర్ 8ఎక్స్ స్పెసిఫికేషన్స్

డిస్‌ప్లే: 6.5 అంగుళాల ఫుల్‌ హెచ్‌డీ+ డిస్‌ప్లే, 2340×1080 పిక్సెల్స్, 19.5:9 యాస్పెక్ట్ రేషియో
ర్యామ్: 4 జీబీ, 6 జీబీ
ఇంటర్నల్ స్టోరేజ్: 64 జీబీ, 128 జీబీ
ప్రాసెసర్: కిరిన్ 710
రియర్ కెమెరా: 20+2 మెగాపిక్సెల్ఫ్రంట్ కెమెరా: 16 మెగాపిక్సెల్
బ్యాటరీ: 3750 ఎంఏహెచ్
ఆపరేటింగ్ సిస్టమ్: ఆండ్రాయిడ్ 8.1, ఈఎంయూఐ 8.2
కలర్స్: బ్లాక్, బ్లూ, రెడ్
ధర:
4 జీబీ+ 64జీబీ- రూ.14,999
6 జీబీ+ 64జీబీ- రూ.16,999
6 జీబీ+ 128జీబీ- రూ.18,999

ఇవి కూడా చదవండి:

ఆఫ్‌లైన్ స్టోర్లల్లో షావోమీ పోకో ఎఫ్1 సేల్!

త్వరలో ఇండియాలో రెడ్‌మీ నోట్ 6 ప్రో రిలీజ్!

ఇన్‌స్టాగ్రామ్ చూస్తే అసూయా? ఇలా తగ్గించుకోండి!

ఏసుస్ నుంచి మరో రెండు ఫోన్లు!

గూగుల్‌లోనే ఫ్లిప్‌కార్ట్, పేటీఎం, స్నాప్‌డీల్ 'షాపింగ్ ట్యాబ్స్'
Published by: Santhosh Kumar S
First published: October 16, 2018, 1:53 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading