HONOR 20i vs Realme 3 Pro: రూ.12,000 సెగ్మెంట్‌లో రెండు ఫోన్ల మధ్య పోటీ... మీ ఛాయిస్ ఏదీ?

HONOR 20i vs Realme 3 Pro | లైట్ క్యాప్చర్స్, పోర్ట్రెయిట్ మోడ్, బ్యూటిఫికేషన్ వంటి ఇతర కెమెరా లక్షణాలు రెండు ఫోన్లలో కూడా అందుబాటులో కలవు. HONOR 20iలో గల సూపర్ నైట్ మోడ్ తక్కువ కాంతిలో కూడా మంచి చిత్రాలను అందిస్తుంది. ఇంకా సూపర్ వైడ్ యాంగిల్ 120 డిగ్రీల FOV కూడా ఇస్తుంది.

news18-telugu
Updated: October 17, 2019, 6:00 PM IST
HONOR 20i vs Realme 3 Pro: రూ.12,000 సెగ్మెంట్‌లో రెండు ఫోన్ల మధ్య పోటీ... మీ ఛాయిస్ ఏదీ?
HONOR 20i vs Realme 3 Pro: రూ.12,000 సెగ్మెంట్‌లో రెండు ఫోన్ల మధ్య పోటీ... మీ ఛాయిస్ ఏదీ? (image: Honor)
  • Share this:
తీవ్రమైన పోటీ ఉన్న మార్కెట్‌లో పట్టు సాధించడం ఓ సవాల్. మొబైల్ కంపెనీలన్నీ మార్కెటింగ్ వ్యూహాలతో కస్టమర్లను ఆకర్షించడానికి ప్రయత్నిస్తున్నాయి. మొబైల్ కంపెనీలు అతి తక్కువ ధరలకే ఉత్తమమమైన సాంకేతికతను అందిస్తున్నాయి. అంతేకాకుండా ప్రత్యేక లక్షణాలు, ప్రత్యేకమైన ప్యాకింగ్‌తో కూడిన గాడ్జెట్ డిజైన్ మొబైల్ కంపెనీ బ్రాండ్ ఇమేజ్‌ను మరింతగా పెంచుతుంది. 4జీబీ RAM గల HONOR 20i, Realme 3 pro మధ్య గట్టి పోటీ ఉంది. మరి ఈ రెండింటిలో ఏది బెస్ట్. తెలుసుకోండి.

HONOR 20i వర్సెస్ Realme 3 proHONOR, Realme - రెండు బ్రాండ్లు తమ ప్రత్యేక మోడల్స్‌తో, మార్కెటింగ్ వ్యూహాలతో తక్కువ ధరలకే ఎక్కువ ఫీచర్లు అందిస్తూ అధిక సంఖ్యలో కస్టమర్లను పొందాయి. అద్భుతమైన ధర గల అత్యుత్తమ గాడ్జెట్‌ను సొంతం చేసుకోవడానికి వినియోగదారులు పోటీపడుతున్నారు. రెండు కంపెనీలు మొబైల్ మార్కెట్‌లో తమదైన ముద్ర వేయడానికి తీవ్రంగా పోటీపడుతున్నాయి. అయితే రూ.12,000 సెగ్మెంట్‌లో ఈ రెండు ఫోన్లల్లో ఏది బెస్ట్? అన్న ప్రశ్న తలెత్తుతుంది.

డిజైన్ అండ్ డిస్‌ప్లే


డిజైన్, డిస్‌ప్లే పరంగా చూస్తే రెండు ఫోన్లు కూడా వాటర్ డ్రాప్ ఫుల్ హెచ్‌డీ+ డిస్‌ప్లేతో వస్తాయి. HONOR 20i స్మార్ట్‌ఫోన్‌లో 15.77 సెం.మీ (6.21-అంగుళాల) ఫుల్ హెచ్‌డీ+ డిస్‌ప్లే, Realme 3 pro లో 16 సెం.మీ (6.3-అంగుళాలు) గల డిస్‌ప్లే కలదు. అయితే ప్యానల్ నాణ్యత, పరిమాణం దాదాపు రెండింటికీ ఒకేలా ఉంటుంది. 8.3 మి.మీ మందం, 172 గ్రాముల బరువు గల Realme 3 Proతో పోల్చితే HONOR 20i కేవలం 7.95 మి.మీ మందం, 164 గ్రాముల బరువుతో చాలా మృదువుగా, తేలికగా అనిపిస్తుంది. అందమైన వెనుకభాగం, పలు రకాల కలర్ ఆప్షన్స్ గల HONOR 20i పట్టుకుంటే మరింత స్టైల్‌గా, అద్భుతంగా కనిపిస్తుంది. లైట్ ప్యాటర్న్ డ్యూయాలిటీ డిజైన్, స్పీడ్‌వే ప్యాటర్న్‌తో కూడిన Realme 3 Pro ను దానితో పోల్చితే కాస్త తక్కువగా కనిపిస్తుంది. ఇక రంగుల విషయానికి వస్తే HONOR 20i మిడ్‌నైట్ బ్లాక్, ఫాంటమ్ రెడ్, ఫాంటమ్ బ్లూలో అందుబాటులో కలదు. Realme 3 Pro లైటెనింగ్ పర్పుల్, నిట్రో బ్లూ, కార్బన్ గ్రే కలర్స్‌లో లభిస్తుంది.

HONOR 20i vs Realme 3 Pro, HONOR 20i features, HONOR 20i specifications, HONOR 20i specs, HONOR 20i sale, HONOR 20i offers, HONOR 20i amazon, HONOR 20i flipkart, హానర్ 20ఐ వర్సెస్ రియల్‌మీ 3 ప్రో, హానర్ 20ఐ ఫీచర్స్, హానర్ 20ఐ స్పెసిఫికేషన్స్, హానర్ 20ఐ సేల్, హానర్ 20ఐ ఆఫర్స్, హానర్ 20ఐ అమెజాన్, హానర్ 20ఐ ఫ్లిప్‌కార్ట్
image: Honor

హార్డ్‌వేర్

HONOR 20i 2.2GHz ఆక్టా-కోర్ కిరిన్ 710 చిప్‌సెట్‌తో కూడిన GPU టర్బో 2.0తో తయారు చేయబడింది. అయితే Realme 3 pro లో 2.2GHz స్నాప్‌డ్రాగన్ 710 AIE ప్రాసెసర్ ఆడ్రినో 616 GPU తో పనిచేస్తుంది. HONOR 20iలో 4జీబీ ర్యామ్‌ మాత్రమే అందుబాటులో కలదు. కానీ Realme 4+64జీబీ/ 6+64జీబీ/ 6+128జీబీలలో లభిస్తుంది. మొత్తమ్మీద రెండు ఫోన్లు అద్భుతమైన గేమింగ్ అనుభవాన్ని అందిస్తాయి. అలాగే రోజువారీ పనులకు ఆటంకం లేకుండా పనిచేస్తాయి.

కెమెరా


మొబైల్ విషయానికి వస్తే ప్రతీ ఒక్కరు ఖచ్చితంగా పరిశీలించే ముఖ్యమైన భాగాలలో కెమెరా ఒకటి. ప్రతీ ఒక్కరు ఫోటోలలో అందంగా కనిపించాలని కోరుకుంటారు, అందుకోసం ఉత్తమమైన లెన్స్ గల మొబైల్ ఫోన్ ఉండడం ముఖ్యం. కాబట్టి కెమెరాకు సంబంధించి, ట్రిపుల్ కెమెరా సెటప్ గల HONOR 20i, Realme 3 Pro కంటే అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. దీనిలో 24 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ కలవు. అయితే డ్యుయల్ కెమెరా సెటప్ గల Realme లో 16 ఎంపి ప్రైమరీ సెన్సార్, 5 ఎంపి సెకండరీ డెప్త్ సెన్సింగ్ కెమెరా కలవు. ముందు భాగంలో HONOR 20iలో 32 ఎంపి సెల్ఫీ కెమెరా ఉండగా, Realme 3 Pro లో 25 ఎంపి ఫ్రంట్ ఫేసింగ్ సెన్సార్ కలదు. AI-ఎనేబుల్డ్ కెమెరాలతో సహా లైట్ క్యాప్చర్స్, పోర్ట్రెయిట్ మోడ్, బ్యూటిఫికేషన్ వంటి ఇతర కెమెరా లక్షణాలు రెండు ఫోన్లలో కూడా అందుబాటులో కలవు. HONOR 20iలో గల సూపర్ నైట్ మోడ్ తక్కువ కాంతిలో కూడా మంచి చిత్రాలను అందిస్తుంది. ఇంకా సూపర్ వైడ్ యాంగిల్ 120 డిగ్రీల FOV కూడా ఇస్తుంది.

బ్యాటరీ అండ్ ఓఎస్


HONOR 20iలో 3,400mAh బ్యాటరీ, Realme Pro 3లో 4,045mAh కలదు. HONOR EMUI 9.1 కస్టమ్ ఓఎస్ అద్భుతమైన స్మార్ట్‌ఫోన్ అనుభవాన్ని ఎన్నో రెట్లు పెంచుతుంది. ఉదాహరణకు HONOR 20i లోని బ్యాటరీ ఒకరోజు కంటే ఎక్కువసేపు పనిచేస్తుంది కావున 4,045mAh బ్యాటరీ గల Realme 3 Proతో సులభంగా పోటీపడుతుంది. AI ఎన్‌హాన్స్‌డ్ కాల్స్, AI విజన్, AI సీన్ రికగ్నిషన్, TUV రీన్లాండ్ ధృవీకరించిన ఐ కేర్ మోడ్ వంటి ఇతర లక్షణాలు కలవు. రెండు ఫోన్లు ఆధునాతన OS ఆండ్రాయిడ్ 9 పైతో నడుస్తాయి. కానీ UI పరంగా చుస్తే HONOR EMUI Color OSని అధిగమించి, స్క్రోల్ చేసేటప్పుడు చాలా సులువుగా, వేగంగా ఉంటుంది.

HONOR 20i vs Realme 3 Pro, HONOR 20i features, HONOR 20i specifications, HONOR 20i specs, HONOR 20i sale, HONOR 20i offers, HONOR 20i amazon, HONOR 20i flipkart, హానర్ 20ఐ వర్సెస్ రియల్‌మీ 3 ప్రో, హానర్ 20ఐ ఫీచర్స్, హానర్ 20ఐ స్పెసిఫికేషన్స్, హానర్ 20ఐ సేల్, హానర్ 20ఐ ఆఫర్స్, హానర్ 20ఐ అమెజాన్, హానర్ 20ఐ ఫ్లిప్‌కార్ట్
image: Honor

ధర


4జీబీ ర్యామ్ గల రెండు ఫోన్లు Amazon, Flipkart లలో ఆఫర్ సమయంలో కేవలం రూ.11,999 ధరకే లభిస్తున్నాయి. HONOR 20i 128జీబీ మెమొరీ, Realme 3 Pro 64 జీబీ మెమొరీని అందిస్తున్నాయి. HONOR ను 512జీబీ వరకు పెంచుకోవచ్చు, కానీ Realme ని 256జీబీ వరకు మాత్రమే పెంచుకోగలము.

తుది తీర్పు


HONOR 20i, Realme 3 రెండూ స్పెసిఫికేషన్ పరీక్షను అధిగమించాయి. మెరుగైన అత్యాధునిక లక్షణాల వలన HONOR 20i మెరుగైనదానిగా భావిస్తున్నాం. కొన్ని కారణాల వలన Realme 3తో పోల్చితే HONOR 20i ముందుంది. వినియోగదారులు పరిశీలించే మెరుగైన కెమెరా కాన్ఫిగరేషన్లు, ఎక్కువ మెమొరీ, మెరుగైన UI, లుక్స్ పరంగా చుస్తే ఇది మరింత అందంగా, ఆకర్షణీయంగా కనిపిస్తుంది.

ఇక్కడ కొనుగోలు చేయండి

Amazon: https://amzn.to/2VIIF0S
Flipkart: https://bit.ly/2Mken1L

ఇవి కూడా చదవండి:

Telangana Jobs: తెలంగాణ విద్యుత్ సంస్థలో 3025 ఉద్యోగాలు... పూర్తి వివరాలివే

Post Office Jobs: తెలంగాణలో 970, ఏపీలో 2707 జాబ్స్... 10వ తరగతి పాసైతే చాలు

Jobs: కేంద్ర ప్రభుత్వ సంస్థలో 270 జాబ్స్... వివరాలివే

 
Published by: Santhosh Kumar S
First published: October 17, 2019, 6:00 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading