Honor 20i - Jio offer: హానర్ 20ఐ కొంటే జియో నుంచి రూ.2,200 క్యాష్‌బ్యాక్

Honor 20i - Reliance Jio offer | హానర్ 20ఐ కొన్నవారికి రిలయెన్స్ జియో నుంచి రూ.2,200 క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. దాంతో పాటు 125 జీబీ 4జీ డేటా అదనంగా పొందొచ్చు.

news18-telugu
Updated: June 19, 2019, 11:48 AM IST
Honor 20i - Jio offer: హానర్ 20ఐ కొంటే జియో నుంచి రూ.2,200 క్యాష్‌బ్యాక్
Honor 20i - Jio offer: హానర్ 20ఐ కొంటే జియో నుంచి రూ.2,200 క్యాష్‌బ్యాక్ (Image: tech2/Nandini Yadav)
  • Share this:
జూన్ 11న హానర్ కంపెనీ మూడు స్మార్ట్‌ఫోన్లను ఇండియాలో లాంఛ్ చేసింది. హానర్ 20, హానర్ 20ఐ, హానర్ 20 ప్రో మోడల్స్‌ని పరిచయం చేసింది. అయితే హానర్ 20 ప్రో ఎప్పట్నుంచి అందుబాటులో ఉంటుందో కంపెనీ ప్రకటించలేదు. హానర్ 20 సేల్ జూన్ 25న ప్రారంభం కానుంది. ఇక హానర్ 20ఐ సేల్ జూన్ 18న ఫ్లిప్‌కార్ట్‌లో ప్రారంభమైంది. ఈ ఫోన్ 4జీబీ+128జీబీ వేరియంట్ ధర రూ.14,999. హానర్ 20ఐ కొన్నవారికి రిలయెన్స్ జియో నుంచి రూ.2,200 క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. దాంతో పాటు 125 జీబీ 4జీ డేటా అదనంగా పొందొచ్చు. రూ.198, రూ.299 ప్లాన్స్ రీఛార్జ్ చేసుకున్నవారికే ఈ ఆఫర్ వర్తిస్తుంది. ఇక హానర్ నుంచి 'లవ్ ఇట్ ఆర్ రిటర్న్ ఇన్ ఛాలెంజ్' ఆఫర్ ఉంది. హానర్ 20ఐ కొన్న 90 రోజుల్లో ఫోన్ నచ్చకపోతే వెనక్కి ఇచ్చేయొచ్చు. ఫోన్ కోసం చెల్లించిన మొత్తంలో 90 శాతం బయ్‌బ్యాక్ గ్యారెంటీ ఇస్తోంది కంపెనీ. ఇక హానర్ 20ఐ కొనేవారికి రూ.2,500 నుంచి నో కాస్ట్ ఈఎంఐ ఆఫర్ ప్రకటించింది ఫ్లిప్‌కార్ట్.

హానర్ 20ఐ స్పెసిఫికేషన్స్

డిస్‌ప్లే: 6.21 అంగుళాల ఫుల్‌హెచ్‌డీ+ డిస్‌ప్లే, 1080 x 2340 పిక్సెల్స్, 19.5:9 యాస్పెక్ట్ రేషియో
ర్యామ్: 4జీబీ
ఇంటర్నల్ స్టోరేజ్: 128జీబీ
ప్రాసెసర్: కిరిన్ 710ఎఫ్
రియర్ కెమెరా: 24+8+2 మెగాపిక్సెల్ఫ్రంట్ కెమెరా: 32 మెగాపిక్సెల్
బ్యాటరీ: 3,400 ఎంఏహెచ్
ఆపరేటింగ్ సిస్టమ్: ఆండ్రాయిడ్ 9 పై+ఈఎంయూఐ 9.0.1
సిమ్ సపోర్ట్: డ్యూయెల్ సిమ్-నానో
కలర్స్: ఫాంటమ్ బ్లూ, మిడ్‌నైట్ బ్లాక్
ధర: రూ.14,999

Cricket Score: క్రికెట్ స్కోర్ ఎంత? ఈ యాప్స్‌లో చూడండి


ఇవి కూడా చదవండి:

పాత ఫోన్ అమ్మేస్తున్నారా? ఈ 7 జాగ్రత్తలు మర్చిపోవద్దు

Nokia Discount: ఆ రెండు నోకియా స్మార్ట్‌ఫోన్లపై డిస్కౌంట్

Flipkart Sale: ఫ్లిప్‌కార్ట్‌లో మొబైల్ బొనాంజా సేల్... ఈ స్మార్ట్‌ఫోన్లపై భారీ ఆఫర్స్
First published: June 19, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading