ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ హోండా మోటార్ సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా (హెచ్ఎంఎస్ఐ) బుధవారం మార్కెట్లోకి మరో కొత్త బైక్‌ను లాంచ్ చేసింది. 2019లో విడుదలైన హోండా సీబీ300ఆర్ బైక్‌కు మార్పులు చేర్పులు చేసి మరోసారి దీన్ని ఆవిష్కరించింది. ఈ సరికొత్త హోండా CB300R బైక్ రూ. 2.77 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) ధర వద్ద అందుబాటులో ఉంటుంది.
ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ హోండా మోటార్ సైకిల్(Honda Motor Cycle) అండ్ స్కూటర్ ఇండియా (హెచ్ఎంఎస్ఐ) బుధవారం మార్కెట్లోకి మరో కొత్త బైక్‌ను(New Byke) లాంచ్ చేసింది. 2019లో విడుదలైన హోండా సీబీ300ఆర్ బైక్‌కు మార్పులు చేర్పులు చేసి మరోసారి దీన్ని ఆవిష్కరించింది. ఈ సరికొత్త హోండా CB300R బైక్ రూ. 2.77 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) ధర వద్ద అందుబాటులో ఉంటుంది. ఇప్పటికే భారతదేశం(India) అంతటా బుకింగ్స్(Bookings) ప్రారంభమయ్యాయి. హోండా ప్రీమియం బిగ్‌వింగ్(Bigwing), బిగ్‌వింగ్ టాప్‌లైన్ డీలర్షిప్ సెంటర్ల ద్వారా దీన్ని బుక్ (Book) చేసుకోవచ్చు. ఇక, హైఎండ్ ఫీచర్లతో వచ్చిన ఈ బైక్ డెలివరీలు(Byke Delivery) అతి త్వరలోనే ప్రారంభం కానున్నాయి. కాగా, ఈ బైక్ మొత్తం రెండు కలర్ ఆప్షన్లలో (Color Options) లభిస్తుంది.
మ్యాటీ స్టీల్ బ్లాక్, పెరల్ స్పార్టన్ రెడ్ కలర్(Red Colour) ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది. ఈ బైక్ లాంచింగ్‌పై HMSI మేనేజింగ్ డైరెక్టర్, ప్రెసిడెంట్ & సీఈఓ అట్సుషి ఒగాటా మాట్లాడుతూ ‘‘విలక్షణమైన హై ఎండ్ ఫీచర్లు, డైనమిక్ రోడ్ ప్రెజెన్స్‌తో కొత్త CB300R బైక్‌ను ఆవిష్కరించాం. కస్టమర్ల నుంచి మంచి స్పందన వస్తుందని ఆశిస్తున్నాం.’’ అని చెప్పారు.
బీఎస్ 6 ప్రమాణాలతో..
కొత్త హోండా CB300R బైక్ బీఎస్ 6 ప్రమాణాలతో రూపొందింది. ఇంజిన్ విషయానికి వస్తే.. దీనిలో 286 సీసీ 4 సింగిల్ సిలిండర్ వాల్వ్ లిక్విడ్ కూల్డ్ మోటార్‌ను అమర్చారు. పవర్, టార్క్ అవుట్‌పుట్‌లో ఎక్కడా రాజీపడకుండా 30.7 హెచ్‌పీ పవర్, 27.5 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్ 6 స్పీడ్ ట్రాన్స్‌మిషన్‌తో స్లిప్, అసిస్ట్ క్లచ్‌తో జతచేసి ఉంటుంది. సాధారణ క్లచ్ మెకానిజంతో పోలిస్తే మెరుగైన ఫంక్షన్‌ను అందిస్తుంది. సడన్ ఇంజన్ బ్రేకింగ్ వల్ల కలిగే కుదుపులను తగ్గిస్తుంది. తద్వారా బైక్‌పై సౌకర్యవంతంగా ప్రయాణించవచ్చు.
నియో స్పోర్ట్స్ కేఫ్ స్పూర్తితో ఈ బైక్‌ను డిజైన్ చేసింది. ఫ్యూయల్ ట్యాంక్, రేడియేటర్ గ్రిల్ క్రింద ఉన్న ఫ్రౌడ్పై మ్యాట్ బ్లాక్ ఫినిషింగ్, ఎగ్జాస్ట్ పైప్ (సైలెన్సర్)పై గోల్టెన్ ఫినిషింగ్‌ను అందించింది. 17 అంగుళాల వీల్స్‌తో ముందువైపు 41 ఎమ్ఎమ్ యూఎస్డీ ఫోర్క్, వెనుకవైపు 7 దశల మోనోషాక్‌ను అమర్చింది. మరోవైపు, ముందు భాగంలో 296 ఎంఎం డిస్క్, వెనుక భాగంలో 220 ఎంఎం డిస్క్ బ్రేకింగ్ సిస్టమ్‌ను చేర్చింది. బైక్‌లో డ్యూయల్ ఛానల్ ఏబీఎస్ (యాంటీ బ్రేకింగ్ సిస్టమ్)ను కూడా అమర్చింది.
Published by:Veera Babu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.