హోళీ పండుగ వచ్చేసింది. స్నేహితులు, కుటుంబ సభ్యులతో కలిసి హోళీ సెలబ్రేట్ (Holi Celebrations) చేయాలనుకుంటున్నారా? ఫ్రెండ్స్‌కి, బంధువులకు హోళీ విషెస్ చెప్పాలనుకుంటున్నారా? వాట్సప్‌లో కలర్‌ఫుల్ హోళీ స్టిక్కర్స్ (Holi Stickers) డౌన్‌లోడ్ చేసి విషెస్ చెప్పొచ్చు. టెక్నాలజీ పెరిగిపోయిన తర్వాత వర్చువల్‌గా, ఆన్‌లైన్‌లో విషెస్ చెప్పడం సాధారణమైపోయింది. మరి వాట్సప్‌లో కలర్‌ఫుల్ స్టిక్కర్స్ ఎలా డౌన్‌లోడ్ చేయాలి? వాటిని మీ స్నేహితులు, కుటుంబ సభ్యులకు ఎలా షేర్ చేయాలి? తెలుసుకోండి.
మీ స్మార్ట్‌ఫోన్‌లో వాట్సప్ ఓపెన్ చేయండి.
ఛాట్ విండో ఓపెన్ చేయండి.
ఛాట్ బాక్స్ పక్కన ఉన్న ఎమొజీ ఐకాన్ పైన క్లిక్ చేయండి.
కింద కనిపించే ఆప్షన్స్‌లో స్టిక్కర్ ఐకాన్ పైన క్లిక్ చేయండి.
పైన ఇప్పటికే మీరు డౌన్‌లోడ్ చేసిన స్టిక్కర్స్ కనిపిస్తాయి.
చివర్లో ఉంటే + ఐకాన్ పైన క్లిక్ చేయండి.
ALL STICKERS లిస్ట్‌లో వాట్సప్ రూపొందించిన స్టిక్కర్ ప్యాక్స్ ఉంటాయి.
MY STICKERS సెక్షన్‌లో మీరు ఇప్పటికే డౌన్‌లోడ్ చేసిన స్టిక్కర్ ప్యాక్స్ ఉంటాయి.
ALL STICKERS సెక్షన్‌లో కిందకు స్క్రోల్ చేస్తే DISCOVER STICKER APPS పైన క్లిక్ చేయాలి.
గూగుల్ ప్లేస్టోర్ ఓపెన్ అవుతుంది. అందులో పాపులర్ స్టిక్కర్ ప్యాక్స్ కనిపిస్తాయి.
గూగుల్ ప్లే స్టోర్ సెర్చ్ బార్‌లో WASticker Holi 2022, WhatsApp Holi Stickers 2022 అని టైప్ చేయాలి.
హోళీ విషెస్‌కు సంబంధించిన స్టిక్కర్ ప్యాక్స్ కనిపిస్తాయి.
వాటిలో మీకు నచ్చిన స్టిక్కర్ ప్యాక్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
డౌన్‌లోడ్ చేసిన స్టిక్కర్ ప్యాక్స్ మీ స్మార్ట్‌ఫోన్‌లో యాప్స్ లిస్ట్‌లో కనిపిస్తుంది.
స్మార్ట్‌ఫోన్‌లో ఆ స్టిక్కర్ ప్యాక్ యాప్ ఓపెన్ చేయాలి.
అందులో మీకు కావాల్సిన స్టిక్కర్స్‌ని + ఐకాన్ క్లిక్ చేసి వాట్సప్‌లోకి లోడ్ చేయొచ్చు.
స్టిక్కర్స్ యాడ్ చేసిన తర్వాత వాట్సప్ యాప్‌లో స్టిక్కర్స్ సెక్షన్‌లో మీరు డౌన్‌లోడ్ చేసిన స్టిక్కర్ ప్యాక్ చూడొచ్చు.
అందులోంచి మీకు నచ్చిన స్టిక్కర్‌ను షేర్ చేయొచ్చు.
OnePlus Nord CE 2 5G: తొలిసారి భారీ డిస్కౌంట్‌తో వన్‌ప్లస్ నార్డ్ సీఈ 2... ఆఫర్ పొందండి ఇలా
వాట్సప్‌లో గిఫ్ ఫైల్స్ కూడా ఉంటాయి. గిఫ్ సెక్షన్‌లో Holi అని సెర్చ్ చేస్తే హోళీకి సంబంధించిన గిఫ్ ఫైల్స్ కనిపిస్తాయి. వాటిని నేరుగా మీరు కోరుకున్నవారికి పంపొచ్చు. వాట్సప్‌లో కాకుండా గూగుల్‌లో హోళీ విషెస్‌కు సంబంధించిన గిఫ్ ఫైల్స్, ఫోటోస్ డౌన్‌లోడ్ చేయొచ్చు. ఎలా డౌన్‌లోడ్ చేయాలో తెలుసుకోండి.
ముందుగా గూగుల్ సెర్చ్ ఓపెన్ చేయండి.
Holi Wishes 2022 Gif, Happy Holi Gif అని టైప్ చేయండి.
ఆ తర్వాత ఇమేజెస్ సెక్షన్ ఓపెన్ చేయండి.
మీకు నచ్చిన గిఫ్ సెలెక్ట్ చేసి డౌన్‌లోడ్ చేయండి.
మీకు గిఫ్ కాకుండా ఫోటోస్ కావాలనుకుంటే Holi Wishes 2022 images, Happy Holi images టైప్ చేసి సెర్చ్ చేయాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.