హెచ్ఎండీ (HMD) గ్లోబల్ కంపెనీ తన నోకియా బ్రాండ్ (Nokia Brand) కింద తరచుగా బడ్జెట్ మొబైల్ ఫోన్లను రిలీజ్ చేస్తోంది. ఇందులో భాగంగా మంగళవారం ఈ కంపెనీ భారత్ (India) లో కొత్త బడ్జెట్ స్మార్ట్‌ఫోన్( New Smartphone)ను విడుదల చేసింది. నోకియా జీ11 ప్లస్ (Nokia G11 Plus) పేరుతో తీసుకొచ్చిన ఈ బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌లో హై రిఫ్రెష్-రేట్ డిస్ప్లే అందించడం విశేషం. దీనిలో ఇచ్చిన బ్యాటరీ కూడా పెద్దదే. యూనిసాక్ ప్రాసెసర్, స్టాక్ ఆండ్రాయిడ్, డ్యూయల్ కెమెరా సెటప్‌తో విడుదలైన ఈ 4G స్మార్ట్‌ఫోన్ ధర, ఫీచర్లు వంటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
* స్పెసిఫికేషన్లు, ఫీచర్లు ఇవే
నోకియా జీ11 ప్లస్ 90Hz రిఫ్రెష్ రేట్‌తో 6.5-అంగుళాల HD+ డిస్ప్లేతో అందుబాటులోకి వచ్చింది. ఈ ఫోన్ 90 రిఫ్రెష్ రేట్‌తో యూజర్లకు స్మూత్ యూజర్ ఎక్స్పీరియన్స్ ఆఫర్ చేస్తుంది. ఇది Unisoc T606 ప్రాసెసర్ సాయంతో పనిచేస్తుంది. ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టమ్‌పై నడిచే ఈ ఫోన్‌కు రెండు ఆండ్రాయిడ్ OS అప్‌గ్రేడ్స్ పంపిస్తామని కంపెనీ చెప్పింది.
3 ఏళ్ల పాటు మంత్లీ సెక్యూరిటీ అప్డేట్స్ కూడా సెండ్ చేస్తామని హామీ ఇచ్చింది. సింగిల్ ఛార్జ్‌పై మూడు రోజుల పాటు బ్యాటరీ బ్యాకప్ అందించే 5,000mAh నాన్ రిమూవబుల్ బ్యాటరీని జీ11 ప్లస్ స్మార్ట్‌ఫోన్‌లో ఇచ్చినట్లు నోకియా వెబ్సైట్ పేర్కొంది. సూపర్ బ్యాటరీ సేవర్‌తో ఈ బ్యాటరీ లైఫ్‌ని మరింత పెంచుకోవచ్చని తెలిపింది. ఈ మొబైల్ 10W ఛార్జింగ్‌కి సపోర్ట్ చేస్తుంది.
ఈ స్మార్ట్‌ఫోన్‌లో ఫేస్ అన్‌లాక్ సిస్టమ్, 3.5mm ఆడియో జాక్, USB-C పోర్ట్, బ్లూటూత్ v5.0, డ్యూయల్ సిమ్, 4G సపోర్ట్, బ్యాక్‌సైడ్ ఫింగర్‌ప్రింట్ స్కానర్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఇది వాటర్, డస్ట్ తట్టుకోగల IP52 రేటింగ్‌తో వస్తుంది. ఇందులో ఇచ్చిన డెడికేటెడ్ మైక్రో SD కార్డు స్లాట్ ద్వారా 512GB వరకు స్టోరేజ్‌ను ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌తో వచ్చే ఈ ఫోన్లో బ్యాక్‌సైడ్ 50MP ప్రైమరీ కెమెరా, 2MP డెప్త్ కెమెరా ఆఫర్ చేశారు. సెల్ఫీల కోసం 8MP ఫ్రంట్ కెమెరా అందించారు.
ఇది కూడా చదవండి : త్వరలో ఇండియాలో రెడ్మీ నోట్ 12 స్మార్ట్‌ఫోన్ లాంచ్.. అదిరిపోయే ఫీచర్లు...
* కలర్ ఆప్షన్స్, ఇన్‌బాక్స్ ఐటమ్స్
నోకియా జీ11 ప్లస్ స్మార్ట్‌ఫోన్ లేక్ బ్లూ (Lake Blue), చార్కోల్ గ్రే (Charcoal Grey) అనే రెండు కలర్ ఆప్షన్స్‌లో వస్తుంది. దీని బాక్స్‌లో ఛార్జర్, సిమ్ ఎజెక్టర్ పిన్, USB టైప్ C కేబుల్ ఉంటాయి.
* నోకియా జీ11 ప్లస్ ధర, అవైలబిలిటీ
నోకియా జీ11 ప్లస్ 4GB + 64GB సింగిల్ వేరియంట్‌తో లాంఛ్ అయింది. దీని ధరను రూ.12,499గా కంపెనీ నిర్ణయించింది. ఈ రోజు నుంచే నోకియా G11 ప్లస్ ఫోన్‌ను కంపెనీ అధికారిక వెబ్సైట్ (https://www.nokia.com/phones/en_in/nokia-g-11-plus?sku=286748582)తో పాటు ఆన్లైన్, ఆఫ్‌లైన్ రిటైలర్ల ద్వారా కొనుగోలు చేయవచ్చు. కొనుగోలుదారులు MBK500 కోడ్ ఉపయోగించి MobiKwik వాలెట్‌పై 5% క్యాష్‌బ్యాక్ పొందొచ్చు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Nokia, Smart phone, Smart phones, Tech news