Home /News /technology /

HMD GLOBAL UNVEILED 3 NEW NOKIA SMARTPHONES INCUDING 5G MODEL KNOW SPECIFICATIONS SS

Nokia Smartphones: నోకియా నుంచి మూడు స్మార్ట్‌ఫోన్స్ రిలీజ్

Nokia Smartphones: నోకియా నుంచి మూడు స్మార్ట్‌ఫోన్స్ రిలీజ్
(ప్రతీకాత్మక చిత్రం)

Nokia Smartphones: నోకియా నుంచి మూడు స్మార్ట్‌ఫోన్స్ రిలీజ్ (ప్రతీకాత్మక చిత్రం)

Nokia new smartphones | కొత్త ఫోన్ కొనాలనుకుంటున్నారా? అయితే కొన్నిరోజులు ఆగండి. మార్కెట్‌లోకి మరిన్ని కొత్త మోడల్స్ రాబోతున్నాయి. నోకియా ఏకంగా 3 స్మార్ట్‌ఫోన్లను ప్రపంచానికి పరిచయం చేసింది.

    స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లోకి మరో మూడు మోడల్స్‌ని రిలీజ్ చేసింది నోకియా. తొలి 5 జీ స్మార్ట్‌ఫోన్ కూడా విడుదల చేసింది. నోకియా 8.3, నోకియా 5.3, నోకియా 1.3 మోడల్స్‌ని ప్రపంచానికి పరిచయం చేసింది. వీటిలో నోకియా 8.3 మోడల్ 5జీ స్మార్ట్‌ఫోన్. కెమెరా, పర్ఫామెన్స్‌లో ప్రీమియం మిడ్‌రేంజ్ ఫీచర్స్ ఉన్నాయి. పంచ్ హోల్ నాచ్, స్లిమ్ బెజెల్స్‌తో ఆకట్టుకునేలా ఉంది ఈ ఫోన్. నోకియా 8.3 స్మార్ట్‌ఫోన్ 6జీబీ+64జీబీ, 8జీబీ+128జీబీ వేరియంట్లలో రిలీజైంది. ప్రారంభ ధర సుమారు రూ.47,950. ఇక నోకియా 5.3 మిడ్ రేంజ్ స్మార్ట్‌ఫోన్ కాగా నోకియా 1.3 బేసిక్ స్మార్ట్‌ఫోన్. ఈ మూడు ఫోన్లు ఇండియాలో ఎప్పుడు రిలీజ్ అవుతాయన్న స్పష్టత లేదు.


    నోకియా 8.3 స్పెసిఫికేషన్స్
    డిస్‌ప్లే: 6.81 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+
    ర్యామ్: 6జీబీ, 8జీబీ
    ఇంటర్నల్ స్టోరేజ్: 64జీబీ, 128జీబీ
    ప్రాసెసర్: స్నాప్‌డ్రాగన్ 765జీ
    రియర్ కెమెరా: 64+12+2+2 మెగాపిక్సెల్
    ఫ్రంట్ కెమెరా: 24 మెగాపిక్సెల్
    బ్యాటరీ: 4,500 (18వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్)
    ఆపరేటింగ్ సిస్టమ్: ఆండ్రాయిడ్ 10+ ఆండ్రాయిడ్ వన్
    సిమ్ సపోర్ట్: డ్యూయెల్ సిమ్
    ధర:
    6జీబీ+64జీబీ- రూ.47,950
    8జీబీ+128జీబీ- రూ.51,950


    నోకియా 5.3 స్పెసిఫికేషన్స్
    డిస్‌ప్లే: 6.55 అంగుళాల హెచ్‌డీ+
    ర్యామ్: 3జీబీ, 4జీబీ, 6జీబీ
    ఇంటర్నల్ స్టోరేజ్: 64జీబీ, 128జీబీ
    ప్రాసెసర్: స్నాప్‌డ్రాగన్ 665
    రియర్ కెమెరా: 13+5+2+2 మెగాపిక్సెల్
    ఫ్రంట్ కెమెరా: 8 మెగాపిక్సెల్
    బ్యాటరీ: 4,000
    ఆపరేటింగ్ సిస్టమ్: ఆండ్రాయిడ్ 10+ ఆండ్రాయిడ్ వన్
    సిమ్ సపోర్ట్: డ్యూయెల్ సిమ్


    నోకియా 1.3 స్పెసిఫికేషన్స్
    డిస్‌ప్లే: 5.71 అంగుళాల హెచ్‌డీ+
    ర్యామ్: 1జీబీ
    ఇంటర్నల్ స్టోరేజ్: 16జీబీ
    ప్రాసెసర్: స్నాప్‌డ్రాగన్ 215
    రియర్ కెమెరా: 8 మెగాపిక్సెల్
    ఫ్రంట్ కెమెరా: 5 మెగాపిక్సెల్
    బ్యాటరీ: 3,000
    ఆపరేటింగ్ సిస్టమ్: ఆండ్రాయిడ్ 10+ ఆండ్రాయిడ్ వన్
    సిమ్ సపోర్ట్: డ్యూయెల్ సిమ్

    ఇవి కూడా చదవండి:

    Flipkart Big Shopping Days: ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో ఈ రెడ్‌మీ స్మార్ట్‌ఫోన్లపై ఆఫర్స్

    4G Data: రోజూ 2జీబీ డేటా... జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్ ప్లాన్స్ ఇవే

    Xiaomi Mi 10: వామ్మో... 108 మెగాపిక్సెల్ కెమెరాతో స్మార్ట్‌ఫోన్... మార్చి 31న రిలీజ్
    Published by:Santhosh Kumar S
    First published:

    Tags: Nokia, Smartphone, Smartphones

    తదుపరి వార్తలు