HOME »NEWS »TECHNOLOGY »hmd global to launch new nokia smartphone in india at the end of november know expected specifications and price ss

Nokia 2.4: ఈ నెలలోనే నోకియా 2.4 రిలీజ్... ప్రత్యేకతలివే

Nokia 2.4: ఈ నెలలోనే నోకియా 2.4 రిలీజ్... ప్రత్యేకతలివే
Nokia 2.4: ఈ నెలలోనే నోకియా 2.4 రిలీజ్... ప్రత్యేకతలివే (image: Nokia)

Nokia 2.4 | నోకియా నుంచి మరో స్మార్ట్‌ఫోన్ ఇండియాలో రిలీజ్ కానుంది. రూ.10,000 లోపు బడ్జెట్‌లో నోకియా 2.4 స్మార్ట్‌ఫోన్‌ను పరిచయం చేస్తోంది హెచ్ఎండీ గ్లోబల్.

  • Share this:
స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో నోకియా తన మార్క్ మొబైల్స్‌తో గట్టి పోటీ ఇస్తోంది. ఇండియాలో త్వరలో నోకియా 2.4 స్మార్ట్‌ఫోన్ లాంఛ్ చేసే అవకాశం ఉంది. ఇప్పటికే ఇండియాలో నోకియా 2.3 రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. నోకియా 2.3 స్మార్ట్‌ఫోన్‌ను అప్‌గ్రేడ్ వర్షన్ నోకియా 2.4 మోడల్‌ను త్వరలో రిలీజ్ చేయనుంది. నవంబర్‌లోనే ఈ ఫోన్ రిలీజ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అంటే మరో రెండు వారాల్లో నోకియా నుంచి మరో స్మార్ట్‌ఫోన్ ఇండియన్ మార్కెట్‌కు పరిచయం కాబోతోంది. ఈ ఏడాది సెప్టెంబర్‌లోనే నోకియా 2.4 గ్లోబల్ మార్కెట్‌లో రిలీజ్ అయింది. కాబట్టి స్పెసిఫికేషన్స్ అందిరికీ తెలిసినవే. మీడియాటెక్ హీలియో పీ22 ప్రాసెసర్, 4,500 ఎంఏహెచ్ బ్యాటరీ లాంటి ప్రత్యేకతలున్నాయి. 2జీబీ+32జీబీ, 3జీబీ+64జీబీ వేరియంట్లలో ఈ స్మార్ట్‌ఫోన్ రిలీజ్ కానుంది. ఇండియాలో ఈ ఫోన్ ధర రూ.10,000 లోపే ఉంటుందని అంచనా. అదే నిజమైతే ఇప్పటికే మార్కెట్‌లో ఇదే బడ్జెట్‌లో ఉన్న షావోమీ, రియల్‌మీ, సాంసంగ్ స్మార్ట్‌ఫోన్లకు గట్టి పోటీ తప్పదు.

Nokia: నోకియా నుంచి రెండు 4జీ ఫీచర్ ఫోన్లు రిలీజ్... ధర ఎంతంటే



iPhone: కొత్త ఫోన్ కొనాలా? రూ.10,000 లోపే ఐఫోన్ సొంతం చేసుకోండి... ఇంకొన్ని గంటలే ఆఫర్


నోకియా 2.4 స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్స్ వివరంగా చూస్తే 6.5 అంగుళాల హెచ్‌డీ+, 720x1,600 పిక్సెల్స్ డిస్‌ప్లే ఉంటుంది. ర్యామ్ 2జీబీ, 3జీబీ కాగా, ఇంటర్నల్ స్టోరేజ్ 32జీబీ, 64జీబీ ఉంటుంది. మీడియాటెక్ హీలియో పీ22 ప్రాసెసర్‌తో నోకియా 2.4 పనిచేస్తుంది. వెనుకవైపు 13 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్, 2మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్‌తో డ్యూయెల్ కెమెరా సెటప్ ఉంటుంది.  ముందువైపు 5 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంటుంది. బ్యాటరీ కెపాసిటీ 4,500 ఎంఏహెచ్. ఆండ్రాయిడ్ 10 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. ఇది ఆండ్రాయిడ్ వన్ స్మార్ట్‌ఫోన్. ఇందులో గూగుల్ యాప్స్ తప్ప ఇతర బోల్ట్ వేర్, డిఫాల్ట్ యాప్స్ ఉండవు. నోకియా 2.4 స్మార్ట్‌ఫోన్‌లో డ్యూయెల్ సిమ్ సెటప్ ఉంటుంది. నోకియా 2.4 స్మార్ట్‌ఫోన్ చార్‌కోల్, డస్క్, జార్డ్ కలర్స్‌లో రిలీజ్ కానుంది.
Published by:Santhosh Kumar S
First published:November 14, 2020, 18:33 pm

टॉप स्टोरीज