స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో పట్టుబిగించాలని చూస్తున్న హెచ్ఎండీ గ్లోబల్... అదిరిపోయే ఫీచర్లతో సరికొత్త నోకియా స్మార్ట్‌ఫోన్‌ను రిలీజ్ చేసింది. కైరోలో నోకియా 2.3 మోడల్ రిలీజైంది. నోకియా 2.2 అప్‌గ్రేడెడ్ వర్షన్ ఇది. బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్‌గా పరిచయం చేసింది నోకియా. బ్యాటరీ రెండు రోజులు వస్తుందని చెబుతోంది. 6.2 అంగుళాల హెచ్‌డీ+ డిస్‌ప్లే, 4,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 13 మెగాపిక్సెల్ డ్యూయెల్ రియర్ కెమెరా లాంటి ప్రత్యేకతలున్నాయి. ఈ ఫోన్ ఇండియాలో ఎప్పుడు లాంఛ్ అవుతుందన్న స్పష్టత లేదు. కానీ... త్వరలో ఇండియాకు ఈ ఫోన్ వచ్చే అవకాశాలున్నాయి. ఇండియాలో ప్రారంభ ధర రూ.5,999 నుంచి ఉండొచ్చని అంచనా. అదే జరిగితే ఇండియాలో షావోమీ, రియల్‌మీ, సాంసంగ్, ఒప్పో, వివో లాంటి కంపెనీలకు నోకియా 2.3 స్మార్ట్‌ఫోన్ నుంచి గట్టి పోటీ తప్పదు.
Discover our latest addition Nokia 2.3 and step up to more 🙌. Crafted with modern day essentials that take your experiences into a whole new level. 👉https://t.co/LAHRQws3zO#Nokia2 #StepUpToMore pic.twitter.com/J1OzANqIh7
— Nokia Mobile (@NokiaMobile) December 5, 2019
నోకియా 2.3 స్పెసిఫికేషన్స్
డిస్‌ప్లే: 6.2 అంగుళాల హెచ్‌డీ+
ర్యామ్: 2 జీబీ
ఇంటర్నల్ స్టోరేజ్: 32 జీబీ
ప్రాసెసర్: మీడియాటెక్ హీలియో ఏ22
రియర్ కెమెరా: 13+2 మెగాపిక్సెల్
ఫ్రంట్ కెమెరా: 5 మెగాపిక్సెల్
బ్యాటరీ: 4,000 ఎంఏహెచ్ బ్యాటరీ
ఆపరేటింగ్ సిస్టమ్: ఆండ్రాయిడ్ 9 పై
సిమ్ సపోర్ట్: డ్యుయెల్ సిమ్
కలర్స్: చార్‌కోల్, సియాన్ గ్రీన్, సాండ్
ధర: సుమారు రూ.5,999
ఇవి కూడా చదవండి:
Jio New Plans: రిలయెన్స్ జియో నుంచి 11 బెస్ట్ ప్లాన్స్... బెనిఫిట్స్ ఇవే
BSNL: బీఎస్ఎన్ఎల్ బంపర్ ఆఫర్... 500 జీబీ డేటాతో బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్
Vivo S1: వివో ఎస్1 ధర తగ్గింది... లేటెస్ట్ రేట్స్, స్పెసిఫికేషన్స్ ఇవే
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Android, Nokia, Smartphone, Smartphones