HMD GLOBAL RELEASED NEW ANDROID ONE NOKIA SMARTPHONE IN INDIA KNOW PRICE AND SPECIFICATIONS SS
Nokia 7.2: ట్రిపుల్ కెమెరాలతో నోకియా 7.2 రిలీజ్... జియో నుంచి రూ.7,200 బెనిఫిట్స్
Nokia 7.2: ట్రిపుల్ కెమెరాలతో నోకియా 7.2 రిలీజ్... జియో నుంచి రూ.7,200 బెనిఫిట్స్
(Image: Tech2)
Nokia 7.2 Android Smartphone | Nokia.com వెబ్సైట్లో కొంటే రూ.2,000 గిఫ్ట్ కార్డ్ లభిస్తుంది. ఫ్లిప్‌కార్ట్‌లో కొంటే ఎక్స్ఛేంజ్పై అదనంగా రూ.2,000 తగ్గింపు లభిస్తుంది. ఈ అవకాశం అక్టోబర్ 31 వరకే.
ఇండియన్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి మరో కొత్త మోడల్ రిలీజ్ చేసింది హెచ్ఎండీ గ్లోబల్. నోకియా 7.2 స్మార్ట్‌ఫోన్ ఇండియాలో అధికారికంగా లాంఛైంది. ఇటీవల జరిగిన ఐఎఫ్ఏ 2019 ఈవెంట్లో నోకియా 6.2 మోడల్‌తో పాటు నోకియా 7.2 స్మార్ట్‌ఫోన్‌ను ఆవిష్కరించింది హెచ్ఎండీ గ్లోబల్. 4 జీబీ + 64 జీబీ, 6 జీబీ + 64 జీబీ వేరియంట్లలో ఈ ఫోన్‌ను రిలీజ్ చేసింది. ఇది ఆండ్రాయిడ్ వన్ స్మార్ట్‌ఫోన్. 4 జీబీ + 64 జీబీ ధర రూ.18,599. హైఎండ్ వేరియంట్ 6 జీబీ + 64 జీబీ ధర రూ.19,599. సెప్టెంబర్ 23 నుంచి ఫ్లిప్‌కార్ట్‌తో పాటు నోకియా అధికారిక వెబ్సైట్లో ఈ ఫోన్ కొనొచ్చు. రీటైల్ ఔట్‌లెట్స్‌లో కూడా నోకియా 7.2 సేల్ ఉంటుంది. రీటైల్ ఔట్లెట్లో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ క్రెడిట్, డెబిట్ కార్డులతో ఈఎంఐ ద్వారా నోకియా 7.2 కొంటే 10 శాతం క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. Nokia.com వెబ్సైట్లో కొంటే రూ.2,000 గిఫ్ట్ కార్డ్ లభిస్తుంది. ఫ్లిప్‌కార్ట్‌లో కొంటే ఎక్స్ఛేంజ్పై అదనంగా రూ.2,000 తగ్గింపు లభిస్తుంది. ఈ అవకాశం అక్టోబర్ 31 వరకే. ఇక సెప్టెంబర్ 29 నుంచి అక్టోబర్ 4 వరకు జరిగే బిగ్ బిలియన్ డేస్ ఫెస్టివల్ సేల్‌లో 10 శాతం డిస్కౌంట్ లభిస్తుంది. రిలయెన్స్ జియో సబ్స్క్రైబర్లు రూ.198, రూ.299 ప్లాన్స్ రీఛార్జ్ చేస్తే రూ.7,200 విలువైన బెనిఫిట్స్ లభిస్తాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.