Nokia 7.1 Smart Phone : IPL సీజన్‌లో నోకియా మొబైల్స్‌పై భారీ తగ్గింపు.. కానీ ఈ మ్యాచ్ టైమ్‌లోనే..

Nokia 7.1 Smart Phone | నోకియా 7.1 స్మార్ట్ ఫోన్ ధర రూ. 2వేలు తగ్గింది. వినియోగదారులను ఆకర్షించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

news18-telugu
Updated: April 14, 2019, 4:58 PM IST
Nokia 7.1 Smart Phone : IPL సీజన్‌లో నోకియా మొబైల్స్‌పై భారీ తగ్గింపు.. కానీ ఈ మ్యాచ్ టైమ్‌లోనే..
ప్రతీకాత్మక చిత్రం
news18-telugu
Updated: April 14, 2019, 4:58 PM IST
హెచ్‌ఎండీ గ్లోబల్ తన నోకియా 1, 2.1 ఆండ్రాయిడ్ గో ఎడిషన్, నోకియా 6.1 ప్లస్ 6జీబీ ర్యామ్ వేరియెంట్‌లపై భారత్‌లో ధర తగ్గించింది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు నోకియా 7.1 ఫోన్ ధర ఇప్పుడు రూ.17,999 అయింది. అయితే పలు ఆఫ్‌లైన్ స్టోర్స్‌లో ఈ ఫోన్‌పై మరింత డిస్కౌంట్‌ను అందిస్తున్నారు. అందువల్ల ఈ ఫోన్‌ను రూ.16,999 ధరకే వినియోగదారులు కొనుగోలు చేయవచ్చు.
హెచ్‌ఎండీ గ్లోబల్ తన వెబ్‌సైట్‌లో కేకేఆర్ మ్యాచ్ డేస్ పేరిట ఓ ప్రత్యేక సేల్ కూడా నిర్వహిస్తోంది. ఇందులో నోకియా 8.1, 7.1, 6.1 ప్లస్, 5.1 ప్లస్, నోకియా 81104జీ ఫోన్లపై 15శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్ అందిస్తుంది. అయితే ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ మ్యాచ్‌లు ఆడేటప్పుడు ఈ డిస్కౌంట్ లభిస్తుంది.
ప్రతీ మొబైల్ సంస్థ వినియోగదారులకు చేరువ కావాలనే ఆఫర్స్ ప్రకటిస్తాయి. ఈ నేపథ్యంలోనే.. నోకియా ఈ నిర్ణయం తీసుకుంది. ప్రజెంట్ ఐపీఎల్ ఫీవర్ నడుస్తున్న తరుణంలో ప్రత్యేక ఆఫర్స్ ప్రకటించింది.

First published: April 14, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...