Nokia 9 PureView: ఐదు కెమెరాల నోకియా ఫోన్... జూన్ 6న రిలీజ్

Nokia 9 PureView | ఒక స్మార్ట్‌ఫోన్‌లో రియర్‌లో 5 కెమెరాలు ఉండటం సాధారణ విషయం కాదు. ఎందుకంటే గతంలో ఒకట్రెండు కెమెరాలతో ఫోన్‌లు రావడమే గొప్ప. ఇటీవల ట్రిపుల్ కెమెరా ఫోన్లు చూస్తున్నాం. ఇప్పుడు ఐదు కెమెరాలతో ఫోన్ తీసుకొచ్చి ఇతర బ్రాండ్లకు సవాల్ విసురుతోంది నోకియా.

news18-telugu
Updated: May 30, 2019, 6:17 PM IST
Nokia 9 PureView: ఐదు కెమెరాల నోకియా ఫోన్... జూన్ 6న రిలీజ్
Nokia 9 PureView: ఐదు కెమెరాల నోకియా ఫోన్... జూన్ 6న రిలీజ్
news18-telugu
Updated: May 30, 2019, 6:17 PM IST
ఒకటి, రెండు, మూడు కాదు... ఏకంగా ఐదు కెమెరాలతో ఫోన్ తయారు చేసి ప్రపంచాన్ని ఆకర్షించింది నోకియా. అదే నోకియా 9 ప్యూర్‌వ్యూ. చాలాకాలంగా ఈ ఫోన్ గురించి టీజర్లు వస్తున్నాయి. దీంతో ఈ ఫోన్ ఎలా ఉంటుందో చూడాలన్న ఆసక్తి అందరిలో నెలకొంది. మొత్తానికి నోకియా 9 ప్యూర్‌వ్యూ ఇండియాలో రిలీజ్ చేసేందుకు ముహూర్తం ఖరారైంది. జూన్ 6న జరిగే ఈవెంట్‌లో నోకియా 1 ప్లస్ స్మార్ట్‌ఫోన్‌తో పాటు నోకియా 9 ప్యూర్‌వ్యూ కూడా రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తోంది హెచ్ఎండీ గ్లోబల్. మొదట మొబైల్ వాల్డ్ కాంగ్రెస్‌లో 5 కెమెరాలో నోకియా ఫోన్ కనిపించింది. ఆ తర్వాత పెంటా కెమెరా ఫోన్‌ను గ్లోబల్‌గా లాంఛ్ చేసింది. ఇండియాలో రిలీజ్‌ కోసం చాలాకాలంగా ఎదురుచూస్తుండగా ఇప్పుడు గుడ్ న్యూస్ చెప్పింది హెచ్ఎండీ గ్లోబల్.

ఒక స్మార్ట్‌ఫోన్‌లో రియర్‌లో 5 కెమెరాలు ఉండటం సాధారణ విషయం కాదు. ఎందుకంటే గతంలో ఒకట్రెండు కెమెరాలతో ఫోన్‌లు రావడమే గొప్ప. ఇటీవల ట్రిపుల్ కెమెరా ఫోన్లు చూస్తున్నాం. ఇప్పుడు ఐదు కెమెరాలతో ఫోన్ తీసుకొచ్చి ఇతర బ్రాండ్లకు సవాల్ విసురుతోంది నోకియా. స్మార్ట్‌ఫోన్ వెనుకవైపు మొత్తం ఏడు రింగ్స్ ఉంటాయి. రెండు రింగ్స్‌లో 12 మెగాపిక్సెల్ RGB సెన్సార్లు, మూడు 12 మెగాపిక్సెల్ మోనోక్రోమ్ సెన్సార్లు ఉంటాయి. ఆరో రింగ్‌లో డ్యూయెల్ టోన్ ఎల్ఈడీ ఫ్లాష్ యూనిట్, ఏడో రింగ్‌లో డ్యూయల్ సెన్సార్ ఉంటాయి.

నోకియా 9 ప్యూర్ వ్యూ స్పెసిఫికేషన్స్

డిస్‌ప్లే: 6 అంగుళాల 2కే అమొలెడ్


ర్యామ్: 6 జీబీ ర్యామ్
ఇంటర్నల్ స్టోరేజ్: 128 జీబీ
ప్రాసెసర్: స్నాప్‌డ్రాగన్ 845 ప్రాసెసర్
రియర్ కెమెరా: రెండు 12 మెగాపిక్సెల్ RGB సెన్సార్లు, మూడు 12 మెగాపిక్సెల్ మోనోక్రోమ్ సెన్సార్లు
ఫ్రంట్ కెమెరా: 8 మెగాపిక్సెల్
బ్యాటరీ: 4,150 ఎంఏహెచ్
ఆపరేటింగ్ సిస్టమ్: ఆండ్రాయిడ్ 9 పై
ధర: 699 డాలర్లు (సుమారు రూ.50,000)

Redmi K20 Pro: షావోమీ నుంచి కొత్త ఫోన్స్... రెడ్‌మీ కే20, కే 20 ప్రో


ఇవి కూడా చదవండి:

PAN Card: మీ పాన్ కార్డ్ యాక్టీవ్‌గా ఉందా? చెక్ చేయండి ఇలా

Business Loan: ష్యూరిటీ లేకుండా రూ.10 లక్షల లోన్... పొందండి ఇలా

Flipkart Sale: ఫ్లిప్‌కార్ట్‌లో మరోసారి 'ఫ్లిప్‌స్టార్ట్ సేల్'... ఆఫర్లు ఇవే
First published: May 30, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...