Home /News /technology /

HMD GLOBAL LAUNCHES NOKIA 8210 4G FEATURE PHONE IN INDIA PRICED AT RS 3999 SS

Nokia Phone: నోకియా నుంచి కొత్త ఫోన్... ధర 3,999 మాత్రమే... ఫీచర్స్ ఇవే

Nokia Phone: నోకియా నుంచి కొత్త ఫోన్... ధర 3,999 మాత్రమే... ఫీచర్స్ ఇవే
(image: Nokia India)

Nokia Phone: నోకియా నుంచి కొత్త ఫోన్... ధర 3,999 మాత్రమే... ఫీచర్స్ ఇవే (image: Nokia India)

Nokia Phone | నోకియా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్. నోకియా నుంచి కొత్త ఫోన్ ఇండియాలో రిలీజైంది. ధర 3,999 మాత్రమే. సరికొత్త డిజైన్, ఫీచర్స్‌తో ఈ మొబైల్‌ను రిలీజ్ చేసింది హెచ్ఎండీ గ్లోబల్.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad | Visakhapatnam
ఇండియాలో ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్ హవా కొనసాగుతున్నా ఇప్పటికీ ఫీచర్ ఫోన్ (Feature Phone) కొనేవారు ఉన్నారు. ఒకప్పుడు ఫీచర్ మొబైల్ మార్కెట్‌లో తిరుగులేని ఆధిపత్యాన్ని చూపించిన నోకియా నుంచి మరో ఫీచర్ ఫోన్ వచ్చేసింది. నోకియా 8210 4జీ (Nokia 8210 4G) మోడల్ ఇండియాలో లాంఛ్ అయింది. క్యాండీ బార్ ఫార్మాట్‌లో ఈ కొత్త ఫోన్‌ను తీసుకొచ్చింది హెచ్ఎండీ గ్లోబల్. ఈ ఫోన్ ధర రూ.3,999. కేవలం ఒకే వేరియంట్‌లో రిలీజైంది. రెడ్, డార్క్ బ్లూ కలర్స్‌లో కొనొచ్చు. అమెజాన్ ఇండియా, నోకియా ఇండియా అధికారిక స్టోర్లలో కొనొచ్చు. ఇప్పటికే ఇతర బ్రాండ్ల నుంచి ఫీచర్ ఫోన్లు ఉన్నాయి. వీటికి నోకియా 8210 4జీ గట్టి పోటీ ఇవ్వనుంది.

నోకియా 8210 4జీ ఫీచర్స్


నోకియా 8210 4జీ ఫీచర్స్ చూస్తే ఇందులో డ్యూయెల్ సిమ్ స్లాట్స్ ఉంటాయి. రెండు సిమ్ కార్డులు ఉపయోగించుకోవచ్చు. ఇందులో యూనిసోక్ టీ107 ప్రాసెసర్‌ ఉంది. S30+​ ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. 48ఎంబీ ర్యామ్, 128ఎంబీ ఇంటర్నల్ స్టోరేజ్ సపోర్ట్ లభిస్తుంది. మెమొరీ కార్డుతో 32జీబీ వరకు స్టోరేజ్ పెంచుకోవచ్చు. నోకియా 8210 4జీ ఫోన్‌లో 3.8 అంగుళాల QVGA డిస్‌ప్లే ఉంది. వెనుకవైపు 0.3మెగాపిక్సెల్ కెమెరా ఉంది.

Price Cut: ఈ స్మార్ట్‌ఫోన్ ధర భారీగా తగ్గింది... 90Hz డిస్‌ప్లే, 48MP కెమెరా, 5000mAh బ్యాటరీ


నోకియా 8210 4జీ ఫీచర్ ఫోన్‌లో ఎఫ్ఎం స్ట్రీమింగ్, ఎంపీ3 మీడియా ప్లేయర్ సపోర్ట్ లభిస్తుంది. 3.5ఎంఎం ఆడియో జాక్ కూడా ఉంది. బ్లూటూత్ 5.0 కనెక్టివిటీ సపోర్ట్ లభిస్తుంది. ఈ ఫోన్‌లో 1,450ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. 27 రోజుల స్టాండ్‌బై టైమ్ లభిస్తుందని కంపెనీ చెబుతోంది. ఇతర ఫీచర్స్ చూస్తే టార్చ్, గేమ్‌లాఫ్ట్ నుంచి స్నేక్, టెట్రిస్, బ్లాక్‌జాక్, యారో మాస్టర్, ఎయిర్ స్ట్రైక్, నింజాఅప్ లాంటి గేమ్స్, నోకియా నుంచి రేసింగ్ అటాక్ - మల్టీప్లేయర్, డూడుల్ జంప్, క్రాసీ రోడ్, ఇంగ్లీష్ విత్ ఆక్స్‌ఫర్డ్ లాంటి గేమ్స్ కూడా ఉంటాయి.

Exchange Offer: ఈ స్మార్ట్‌ఫోన్‌పై రూ.13,250 వరకు ఎక్స్‌ఛేంజ్ డిస్కౌంట్... అమొలెడ్ డిస్‌ప్లే, 50MP కెమెరా, 5,000ఎంఏహెచ్ బ్యాటరీ



ఇక నోకియా నుంచి చీపెస్ట్ స్మార్ట్‌ఫోన్ విషయానికి వస్తే నోకియా సీ01 ప్లస్ మార్కెట్లో అందుబాటులో ఉంది. ధర రూ.6,299. ఆండ్రాయిడ్​ 11 గో ఎడిషన్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. 2జీబీ ర్యామ్, 16జీబీ స్టోరేజ్ వేరియంట్‌లో లభిస్తుంది. ఇందులో 5.45 అంగుళాల హెచ్​డీ ప్లస్​ డిస్​ప్లే, యునిసోక్ SC9863a ప్రాసెసర్, 128జీబీ వరకు స్టోరేజ్ పెంచుకునే ఆప్షన్, 5మెగాపిక్సెల్ రియర్ కెమెరా, 2మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా, 3,000ఎంఏహెచ్ బ్యాటరీ లాంటి ప్రత్యేకతలున్నాయి.
Published by:Santhosh Kumar S
First published:

Tags: Mobile News, Mobiles, Nokia, Smartphone

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు