హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Nokia 2660 Flip: నోకియా నుంచి మరో క్లాసిక్ ఫోన్ వచ్చేసింది... పాత జ్ఞాపకాలను గుర్తు చేసే మొబైల్

Nokia 2660 Flip: నోకియా నుంచి మరో క్లాసిక్ ఫోన్ వచ్చేసింది... పాత జ్ఞాపకాలను గుర్తు చేసే మొబైల్

Nokia 2660 Flip: నోకియా నుంచి మరో క్లాసిక్ ఫోన్ వచ్చేసింది... పాత జ్ఞాపకాలను గుర్తు చేసే మొబైల్
(image: Nokia India)

Nokia 2660 Flip: నోకియా నుంచి మరో క్లాసిక్ ఫోన్ వచ్చేసింది... పాత జ్ఞాపకాలను గుర్తు చేసే మొబైల్ (image: Nokia India)

Nokia 2660 Flip | ఫీచర్ ఫోన్ కొనాలనుకునేవారి కోసం నోకియా నుంచి మరో క్లాసిక్ మొబైల్ వచ్చేసింది. రూ.5,000 లోపు బడ్జెట్‌లో (Mobile Under Rs 5000) నోకియా 2660 ఫ్లిప్ ఫోన్ రిలీజ్ చేసింది.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad | Visakhapatnam

హెచ్ఎండీ గ్లోబల్ నుంచి మరో క్లాసిక్ ఫోన్ ఇండియాలో రిలీజైంది. పాత జ్ఞాపకాలను గుర్తు చేస్తూ ఫ్లిప్ మొబైల్‌ను లాంఛ్ చేసింది హెచ్ఎండీ గ్లోబల్. నోకియా 2600 ఫ్లిప్ (Nokia 2660 Flip) మోడల్‌ను ఇండియాలో పరిచయం చేసింది. నోకియా ఒరిజినల్ సిరీస్‌లో లాంఛ్ అయిన రెండో మొబైల్ ఇది. ఒకప్పుడు ఫీచర్ ఫోన్ (Feature Phone) మార్కెట్‌లో నోకియా తిరుగులేని ఆధిపత్యాన్ని చూపించిన సంగతి తెలిసిందే. స్మార్ట్‌ఫోన్లు పాపులర్ అయినప్పటి నుంచి నోకియా హవా తగ్గింది. కానీ నోకియా ఫీచర్ ఫోన్లకు ఇప్పటికీ ఫ్యాన్స్ ఉన్నారు. ఇప్పటికీ యూజర్లు గతంలో తాము ఉపయోగించిన నోకియా ఫోన్లను గుర్తు చేసుకుంటూ ఉంటారు. వారికి పాత జ్ఞాపకాలను గుర్తు చేస్తూ నోకియా 2600 ఫ్లిప్ ఇండియాలో లాంఛ్ కావడం విశేషం.

నోకియా 2600 ఫ్లిప్ ఫోన్ ఫీచర్స్


నోకియా 2600 ఫ్లిప్ ఫోన్ ధర రూ.4,699. ఈ ఫోన్ S30+ ప్లాట్‌ఫామ్‌తో పనిచేస్తుంది. ఇందులో 2.8 అంగుళాల QVGA ప్రైమరీ స్క్రీన్ ఉంటే, 1.77 అంగుళాల QQVGA సెకండరీ స్క్రీన్ కూడా ఉండటం విశేషం. ఎల్ఈడీ ఫ్లాష్ లైట్‌తో 0.3 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. ఈ ఫోన్ Unisoc T107 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది.

Vivo Y35: 16GB ర్యామ్, 128GB స్టోరేజ్, 50MP కెమెరా, 44W ఫాస్ట్ ఛార్జింగ్... ఈ మొబైల్ ధర రూ.20,000 లోపే

నోకియా 2600 ఫ్లిప్ ఫోన్‌లో 48ఎంబీ ర్యామ్ + 128ఎంబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఉంది. మైక్రోఎస్‌డీ కార్డుతో 32జీబీ వరకు స్టోరేజ్ పెంచుకోవచ్చు. ఇందులో 1450ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. 6.3 గంటల టాక్‌టైమ్ లేదా 20.1 గంటల స్టాండ్‌బై టైమ్ లభిస్తుందని కంపెనీ చెబుతోంది. ఇందులో ఎమర్జెన్సీ బటన్ కూడా ఉంది. 5 కాంటాక్ట్స్ యాడ్ చేయొచ్చు.

నోకియా 2600 ఫ్లిప్ ఫోన్‌లో మైక్రో యూఎస్‌బీ సపోర్ట్, 3.5ఎంఎం ఆడియో పోర్ట్, 4జీ, బ్లూటూత్ 4.2, వైర్‌లెస్ ఎఫ్ఎం రేడియో లాంటి కనెక్టివిటీ ఆప్షన్స్ ఉన్నాయి. ఎంపీ3 ప్లేయర్‌తో పాటు స్నేక్ గేమ్ సహా 8 గేమ్స్ ప్రీ-ఇన్‌స్టాల్డ్‌గా వస్తాయి. బ్లాక్, రెడ్, బ్లూ కలర్స్‌లో కొనొచ్చు.

Xiaomi Smart TV: కొత్త ప్రాసెసర్, 24వాట్ స్పీకర్స్, అదిరిపోయే ఫీచర్స్‌తో షావోమీ స్మార్ట్ టీవీ... కాసేపట్లో సేల్

ఇక నోకియా ఇటీవల నోకియా 8210 4జీ మోడల్‌ను కూడా ఇండియాలో లాంఛ్ చేసిన సంగతి తెలిసిందే. ధర రూ.3,999. క్యాండీ బార్ ఫార్మాట్‌లో ఈ ఫోన్ రిలీజైంది. ఇందులో డ్యూయెల్ సిమ్ స్లాట్స్, యూనిసోక్ టీ107 ప్రాసెసర్‌, S30+​ ఆపరేటింగ్ సిస్టమ్, 48ఎంబీ ర్యామ్, 128ఎంబీ ఇంటర్నల్ స్టోరేజ్, 3.8 అంగుళాల QVGA డిస్‌ప్లే, 0.3మెగాపిక్సెల్ కెమెరా, 1,450ఎంఏహెచ్ బ్యాటరీ, బ్లూటూత్ 5.0 కనెక్టివిటీ సపోర్ట్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి.

First published:

Tags: Mobile News, Nokia, Smartphone