HMD GLOBAL LAUNCHED NOKIA 210 IN MOBILE WORLD CONGRESS MWC 2019 KNOW PRICE SPECIFICATIONS SS
Nokia 210: నోకియా నుంచి కొత్త ఫోన్... ధర రూ.2,500 మాత్రమే
Nokia 210: నోకియా నుంచి కొత్త ఫోన్... ధర రూ.2,500 మాత్రమే
Nokia 210 | నోకియా 210 ఫోన్ S30+ ఆపరేటింగ్ సిస్టమ్తో పనిచేస్తుంది. ఇంటర్నెట్ కోసం ప్రీ-ఇన్స్టాల్డ్ ఒపెరా మినీ బ్రౌజర్, బిల్ట్ ఇన్ యాప్ స్టోర్లో గేమ్స్, యాప్స్, మూవీస్ యాప్స్ ఉంటాయి.
ఒకప్పుడు మొబైల్ మార్కెట్లో సంచలనాలు సృష్టించిన నోకియా ఇప్పుడు కొత్త కొత్త ఫోన్లతో పూర్వవైభవం కోసం ప్రయత్నిస్తోంది. అందులో భాగంగా తన మార్క్ ఫీచర్ ఫోన్ ఒకటి మార్కెట్లోకి తీసుకురానుంది. నోకియా 9 ప్యూర్ వ్యూ, నోకియా 4.2, నోకియా 3.2, నోకియా 1 ప్లస్ ఫోన్లతో పాటు నోకియా 210 ఫీచర్ ఫోన్ను బార్సీలోనాలో జరుగుతున్న మొబైల్ వాల్డ్ కాంగ్రెస్ 2019లో ఆవిష్కరించింది హెచ్ఎండీ గ్లోబల్. S30+ ఆపరేటింగ్ సిస్టమ్తో పనిచేసే ఈ ఫోన్లో ఇంటర్నెట్ కోసం ప్రీ-ఇన్స్టాల్డ్ ఒపెరా మినీ బ్రౌజర్ ఉంటుంది. బిల్ట్ ఇన్ యాప్ స్టోర్లో గేమ్స్, యాప్స్, మూవీస్ యాప్స్ ఉంటాయి. నోకియా 210 ఫీచర్ ఫోన్. ధర 35 డాలర్లు. అంటే ఇండియన్ కరెన్సీలో చూస్తే సుమారు రూ.2,500 మాత్రమే.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.