HMD GLOBAL BRINGS ANDROID 12 UPDATE TO THREE NOKIA SMARTPHONES KNOW ALL DETAILS HERE GH VB
Android 12 Update: నోకియా మొబైల్ యూజర్లకు గుడ్ న్యూస్.. ఆ ఫోన్లకు ఆండ్రాయిడ్ 12 అప్డేట్ రిలీజ్..
ప్రతీకాత్మక చిత్రం
ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ హెచ్ఎండీ గ్లోబల్ (HMD Global) తన నోకియా స్మార్ట్ఫోన్ల యూజర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. ఈ కంపెనీ ఈ వారంలోనే మూడు నోకియా స్మార్ట్ఫోన్లకు ఆండ్రాయిడ్ 12 అప్డేట్ను విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది.
గత ఏడాది అక్టోబర్ నెలలో ఆండ్రాయిడ్ 12 (Android 12) రిలీజ్(Release) అయ్యింది. ఈ ఓఎస్ (OS) విడుదలై ఆరు నెలలు గడుస్తోంది. ఈ సమయంలో చాలా సపోర్టెడ్ మొబైల్స్‌కు ఆండ్రాయిడ్(Android) 12 అప్డేట్ అందుబాటులోకి వచ్చింది. మరోవైపు గూగుల్ ఆండ్రాయిడ్ 13ని కూడా ప్రకటించేసింది. అయినా కూడా ఇప్పటికీ ఆండ్రాయిడ్ 12 అప్డేట్ను పొందని ఫోన్లు చాలానే ఉన్నాయి. వాటిలో నోకియా (Nokia) ఎంట్రీ లెవల్ ఫోన్లు కూడా ఉన్నాయి. ఈ ఫోన్ల యూజర్లు(Users) ఆండ్రాయిడ్ 12 అప్డేట్ కోసం ఎన్నో రోజులుగా వేచి చూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ హెచ్ఎండీ గ్లోబల్ (HMD Global) తన నోకియా స్మార్ట్ఫోన్ల యూజర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. ఈ కంపెనీ(Company) ఈ వారంలోనే మూడు నోకియా స్మార్ట్ఫోన్లకు ఆండ్రాయిడ్ 12 అప్డేట్ను విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. నోకియా స్మార్ట్ఫోన్లకు (Nokia Smartphones) ఆండ్రాయిడ్ 12 రిలీజ్ చేస్తామని కంపెనీ గతంలోనే హామీ ఇచ్చింది. ఎట్టకేలకు ఆ హామీని నెరవేరుస్తోంది. ఆ నోకియా ఫోన్లు ఏవో ఇప్పుడు తెలుసుకుందాం.
సాధారణంగా, పాత ఫోన్ మోడల్స్‌కు అప్డేట్లు త్వరగా అందవు. మొదట కొత్త ఫోన్లకు అప్డేట్లు వస్తే.. చివరకు పాత ఫోన్లకు అప్డేట్లు అందుతాయి. నోకియా జీ10 (Nokia G10), నోకియా జీ20 (Nokia G20), నోకియా 2.4 (Nokia 2.4) ఫోన్లను కూడా పాతవిగా పరిగణించి వీటికి చాలా ఆలస్యంగా ఆండ్రాయిడ్ 12 రోల్ అవుట్ చేస్తున్నారు. ఈ మూడు స్మార్ట్ఫోన్లు బడ్జెట్, మిడిల్-రేంజ్ కేటగిరీలోకి వస్తాయి. ఆండ్రాయిడ్ 12 అప్డేట్ ఓవర్ ది ఎయిర్ (OTA) ద్వారా మాత్రమే అందుబాటులోకి వస్తుంది. ఈ కారణంగా ఫోన్లో మాన్యువల్‌గా ఫ్లాష్ చేయగల రోమ్ (ROM) కాపీలను పొందడం కుదరదు.
నోకియా G10, G20, Nokia 2.4 స్మార్ట్ఫోన్ల కోసం ఆండ్రాయిడ్ 12 అప్డేట్
సాధారణంగా నోకియా తన ఫోన్లలో స్టాక్ ఆండ్రాయిడ్ వెర్షన్‌ను అందిస్తుంది. అయితే ఆండ్రాయిడ్ 12 అప్డేట్ను పొందుతున్న మూడు స్మార్ట్ఫోన్లలో నోకియా 2.4 అత్యంత పాతది. హెచ్ఎండీ గ్లోబల్ నోకియా 2.4ని ఆండ్రాయిడ్ 10తో లాంచ్ చేసింది. ఇప్పుడు ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 12కి అప్‌గ్రేడ్ అవుతుంది. ఈ ఫోన్ మీడియాటెక్ పీ22 చిప్సెట్తో పనిచేస్తుంది. నోకియా 2.4 ఆండ్రాయిడ్ రెండు అప్డేట్లను పొందుతుందని, ఆండ్రాయిడ్ 12 ఈ ఫోన్‌కు చివరి వెర్షన్ అని కంపెనీ తెలిపింది. రెండు అప్డేట్ల ద్వారా బోల్డ్ టెక్స్ట్, గ్రేస్కేల్తో రిఫ్రెష్ డిజైన్ వంటి ఫీచర్లను కంపెనీ అందిస్తోంది.
నోకియా 2.4కి ఆండ్రాయిడ్ 12 ఐఓఎస్ తోపాటు ఏప్రిల్ 2022 సెక్యూరిటీ ప్యాచ్‌ను కూడా కంపెనీ అందిస్తుంది. నోకియా జీ10, జీ20 స్మార్ట్ఫోన్ల విషయానికొస్తే, ఇవి రెండూ ఆండ్రాయిడ్ 11తో లాంచ్ అయ్యాయి. ఇవి 4జీబీ ర్యామ్‌తో, మీడియాటెక్ హీలియో G35 ప్రాసెసర్ సహాయంతో పనిచేస్తాయి. హెచ్ఎండీ గ్లోబల్ నోకియా జీ20కి ఆండ్రాయిడ్ 12 అప్డేట్తో పాటు మే 2022 సెక్యూరిటీ ప్యాచ్‌ను రిలీజ్ చేస్తుంది. జీ10 ఫోన్‌కు ఏప్రిల్ 2022 సెక్యూరిటీ ప్యాచ్‌ను ఆఫర్ చేస్తుంది.
Published by:Veera Babu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.