హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Data Privacy: వెబ్‌సైట్‌ల నుంచి మీ డేటాను ప్రైవేట్‌గా ఉంచే టిప్స్.. ఈ సింపుల్ ప్రాసెస్ ఫాలో అవ్వండి..

Data Privacy: వెబ్‌సైట్‌ల నుంచి మీ డేటాను ప్రైవేట్‌గా ఉంచే టిప్స్.. ఈ సింపుల్ ప్రాసెస్ ఫాలో అవ్వండి..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Data Privacy: ఈ రోజుల్లో ప్రతి యాప్స్‌, వెబ్‌సైట్ యూజర్ల బ్రౌజింగ్ యాక్టివిటీలను ట్రాక్ (Track) చేస్తున్నాయి. లొకేషన్ కూడా వాటికి తెలిసిపోతుంది. అయితే ఏదైనా హాని చేయడానికి ఇవి మీ డేటా సేకరించవు కానీ మీ ఆన్‌లైన్ లైఫ్‌ను ప్రైవేట్‌గా ఉంచుకోవడం మంచిది. మరి అది ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

ఇంకా చదవండి ...
  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

ఇంటర్నెట్‌లో స్టోర్ అయ్యే డేటాకు, ఆన్‌లైన్ యాక్టివిటీలకు ప్రైవసీ (Privacy) ఉంటుందనేది ఒక అపోహ మాత్రమేనని చెప్పవచ్చు. గూగుల్ (Google), ఫేస్‌బుక్ (Face Book) తదితర టెక్ దిగ్గజాలు కూడా యూజర్ల పర్సనల్ డేటా (Personal Data)ను కలెక్ట్ చేస్తున్నాయి. ఇక 2022లో ఎండ్-యూజర్ లైసెన్స్ అగ్రిమెంట్ వల్ల ప్రైవసీ అనేది ఒక భ్రమలా మారిపోయింది. ఈ రోజుల్లో ప్రతి యాప్స్‌, వెబ్‌సైట్ యూజర్ల బ్రౌజింగ్ యాక్టివిటీలను ట్రాక్ (Track) చేస్తున్నాయి. లొకేషన్ కూడా వాటికి తెలిసిపోతుంది. అయితే ఏదైనా హాని చేయడానికి ఇవి మీ డేటా సేకరించవు కానీ మీ ఆన్‌లైన్ లైఫ్‌ను ప్రైవేట్‌గా ఉంచుకోవడం మంచిది. మరి అది ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

* ట్రాకింగ్ బ్లాకర్స్‌

విపరీతమైన యాడ్స్‌, స్పామ్ పాప్-అప్స్‌ ఒక్కోసారి చికాకు పుట్టిస్తాయి. ఈ సమస్యకు ట్రాకింగ్ బ్లాకర్‌తో చెక్ పెట్టవచ్చు. ట్రాకింగ్ బ్లాకర్స్‌ అనేవి వెబ్‌సైట్లు అన్‌-అఫిషియల్ కుక్కీలను ఇన్‌స్టాల్ చేయకుండా, మీ బ్రౌజింగ్‌ను ట్రాక్ చేయకుండా ఆపుతాయి. ట్రాకింగ్ బ్లాకర్లు చాలా బ్రౌజర్‌లకు ప్లగ్-ఇన్‌లుగా అందుబాటులో ఉన్నాయి. ఇక ఇంటర్నెట్‌లో కనిపించిన దానల్లా యాక్సెప్ట్ చేయకుండా.. క్లిక్ చేసి అనుమతులు ఇవ్వకుండా జాగ్రత్తపడాలి. లేదంటే ఇబ్బందులు పడక తప్పదు.

* VPN

ఇంటర్నెట్ యూజర్లకు తమ IP అడ్రస్ దాచేసి, బ్రౌజింగ్ డేటాను ఎన్‌క్రిప్ట్ చేయడానికి వర్చువల్ ప్రైవేట్ నెట్‌వర్క్ (VPN) బాగా హెల్ప్ అవుతుంది. ప్లేస్టోర్‌లో చాలా VPN యాప్స్ ఉచితంగానే లభిస్తున్నాయి. ఇంటర్నెట్‌కి కనెక్ట్ చేయడానికి పబ్లిక్ నెట్‌వర్క్‌ని ఉపయోగిస్తున్నప్పుడు కూడా VPN మిమ్మల్ని రక్షిస్తుంది. ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లు మీ డేటాను కలెక్ట్ చేసి దానిని వ్యక్తిగత లాభం కోసం అడ్వటైజర్స్‌కి అమ్ముకోవచ్చు. ఇలాంటి వాటి బారిన పడకుండా యూజర్లు VPNని వాడటం మంచిది.

* బ్రౌజర్ ట్వీక్స్

వెబ్‌సైట్లు కుక్కీస్‌ కలెక్ట్ చేయడానికి మీరు అనుమతిస్తే మీ ఆన్‌లైన్ యాక్టివిటీని అడ్వటైజర్స్‌ ట్రాక్ చేసే అవకాశముంటుంది. అందుకే కుక్కీస్‌ యాక్సెప్ట్ చేయకూడదు. ఆల్రెడీ ఉన్న కుక్కీలను డిలీట్ చేయడానికి, మీ బ్రౌజర్ హిస్టరీని టోటల్‌గా క్లియర్ చేస్తే సరిపోతుంది.

ఇది కూడా చదవండి : జీమెయిల్ ఎక్కడ లాగిన్ చేసినా సింపుల్‌గా ఇలా లాగౌట్ చేయండి

అలానే భవిష్యత్తు కోసం థర్డ్-పార్ట్ కుక్కీలను బ్లాక్ చేయాలి. సాధారణంగా ఈ ఆండ్రాయిడ్ యూజర్ లో ఎక్కువమంది క్రోమ్‌ బ్రౌజర్‌ వాడుతున్నారు. వీరందరూ తమ క్రోమ్‌ బ్రౌజర్‌లోని సెట్టింగ్స్‌ > ప్రైవసీ & సెక్యూరిటీ > కుక్కీస్‌ అండ్ అథర్ సైట్ డేటా ఆప్షన్‌కి వెళ్లాలి. ఆపై బ్రౌజింగ్ ట్రాఫిక్‌ను ఆన్ లేదా ఆఫ్ చేయడానికి “డూ నాట్ ట్రాక్” రిక్వెస్ట్‌ను పంపించాల్సి ఉంటుంది. వెబ్‌సైట్స్‌ నుంచి మీ డేటా ప్రైవేట్‌గా ఉంచుకునేందుకు 'డూ నాట్ ట్రాక్' ఆప్షన్ ఆన్ చేయాల్సి ఉంటుంది.

Published by:Sridhar Reddy
First published:

Tags: Cyber safety, Personal Data, Safety, Tech news

ఉత్తమ కథలు