హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

WhatsApp: ఆండ్రాయిడ్, ఐఫోన్‌లలో వాట్సాప్ వాయిస్ స్టేటస్ ఇలా సెండ్ చేయండి!

WhatsApp: ఆండ్రాయిడ్, ఐఫోన్‌లలో వాట్సాప్ వాయిస్ స్టేటస్ ఇలా సెండ్ చేయండి!

WhatsApp: ఆండ్రాయిడ్, ఐఫోన్‌లలో వాట్సాప్ వాయిస్ స్టేటస్ ఇలా సెండ్ చేయండి!

WhatsApp: ఆండ్రాయిడ్, ఐఫోన్‌లలో వాట్సాప్ వాయిస్ స్టేటస్ ఇలా సెండ్ చేయండి!

WhatsApp: వాట్సాప్ యూజర్లు ఇప్పుడు వాయిస్‌ను రికార్డ్ చేసి దాన్ని స్టేటస్ మెసేజ్‌గా షేర్ చేయవచ్చు. మరి వాయిస్ రికార్డింగ్స్‌ను స్టేటస్‌లో ఎలా షేర్ చేయాలో స్టెప్-బై-స్టెప్ ప్రాసెస్ తెలుసుకుందాం.

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ (WhatsApp) టెక్స్ట్ మెసేజ్‌ల నుంచి వీడియో కాల్స్ చేసుకునేంతవరకు ఎన్నో ఫీచర్లను అందిస్తోంది. టెక్స్ట్, ఫొటో లేదా వీడియోలను క్షణాల్లోనే కాంటాక్ట్స్‌లో ఉన్న వారందరికీ షేర్ చేసే అద్భుత ఫీచర్ అయిన "స్టేటస్ (Status)"ను కూడా గతంలోనే పరిచయం చేసింది. అయితే ఈ స్టేటస్‌ ద్వారా మొన్నటిదాకా వాయిస్ రికార్డింగ్స్ అప్‌లోడ్ చేయడం కుదరలేదు. కాగా ఇప్పుడు ఆ ఫెసిలిటీ (Voice Status)ని కూడా వాట్సాప్ ఆండ్రాయిడ్, iOS యూజర్లకు అందుబాటులోకి తెచ్చింది. ఈ ఫీచర్‌తో యూజర్లు వాయిస్‌ను రికార్డ్ చేసి దాన్ని స్టేటస్ మెసేజ్‌గా షేర్ చేయవచ్చు. మరి వాయిస్ రికార్డింగ్స్‌ను స్టేటస్‌లో ఎలా షేర్ చేయాలో స్టెప్-బై-స్టెప్ ప్రాసెస్ తెలుసుకుందాం.

* ఐఫోన్‌ యూజర్లు వాట్సాప్‌లో వాయిస్ స్టేటస్‌ను ఎలా షేర్ చేయాలి

- ముందు యూజర్లు ఐఫోన్‌లో వాట్సాప్ యాప్ ఓపెన్ చేయాలి.

- స్క్రీన్ కింద ఉన్న “స్టేటస్” ట్యాబ్‌పై నొక్కాలి.

- స్క్రీన్ టాప్ రైట్ కార్నర్‌లో ఉన్న “+” ఐకాన్‌పై క్లిక్ చేయాలి.

- ఇప్పుడు వాయిస్ స్టేటస్ మెసేజ్‌ను రికార్డ్ చేయడానికి మైక్రోఫోన్ ఐకాన్‌పై నొక్కాలి.

- మైక్రోఫోన్ బటన్‌ను నొక్కి పట్టుకుని, మీ వాయిస్ మెసేజ్‌ను రికార్డ్ చేయాలి. గరిష్ఠంగా 30 సెకన్ల వరకు ఆడియోను రికార్డ్ చేయవచ్చు. వాయిస్ రికార్డ్ చేసిన తర్వాత సెండ్ బటన్‌పై నొక్కితే సరిపోతుంది.

ఇది కూడా చదవండి : ఇక రిజల్ట్స్‌లో నో కన్ఫ్యూజన్.. వాట్సాప్ నయా అప్‌డేట్ అదిరింది..

* ఆండ్రాయిడ్‌ వాట్సాప్‌లో వాయిస్ స్టేటస్‌ను ఎలా షేర్ చేయాలి

- యూజర్లు ఆండ్రాయిడ్ ఫోన్‌లో WhatsApp ఓపెన్ చేయాలి. తరువాత చాట్ ట్యాబ్ పక్కనే ఉన్న “స్టేటస్” ట్యాబ్‌పై క్లిక్ చేయాలి. అనంతరం స్క్రీన్ కింద రైట్ కార్నర్‌లో ఉన్న 'పెన్సిల్' ఐకాన్‌పై క్లిక్ చేయాలి.

- ఇప్పుడు వాయిస్ స్టేటస్ మెసేజ్‌ను రికార్డ్ చేయడానికి మైక్రోఫోన్ ఐకాన్‌పై నొక్కాలి. మైక్రోఫోన్ బటన్‌ను నొక్కి పట్టుకుని, మీ వాయిస్ మెసేజ్‌ను రికార్డ్ చేయాలి. గరిష్ఠంగా 30 సెకన్ల వరకు ఆడియోను రికార్డ్ చేయవచ్చు.

- వాయిస్ స్టేటస్ మెసేజ్‌ని రికార్డ్ చేసిన తర్వాత, “ప్లే” బటన్‌ను నొక్కి, దాన్ని ప్రివ్యూ చేయవచ్చు. వాయిస్ స్టేటస్ మెసేజ్‌లో తప్పులు లేవనుకుంటే దాన్ని మీ కాంటాక్ట్‌లతో షేర్ చేయడానికి “సెండ్” బటన్‌పై నొక్కాలి. అంతే, మీ వాయిస్ మెసేజ్ స్టేటస్ లో షేర్ అవుతుంది.

- టాప్ లెఫ్ట్ కార్నర్‌లో ఉన్న కలర్స్‌ పాలెట్ ఐకాన్‌పై క్లిక్ చేయడం ద్వారా యూజర్లు వారి స్టేటస్ రికార్డింగ్‌ల బ్యాక్‌గ్రౌండ్ రంగును ఎంచుకోవచ్చు. వినియోగదారులు ప్రతి స్టేటస్‌లో ఒక వాయిస్ రికార్డింగ్ మాత్రమే అప్‌లోడ్ చేయడం కుదురుతుంది. ఇక యూజర్లు వాయిస్ స్టేటస్ మెసేజ్‌ని షేర్ చేయాలనుకుంటున్న కాంటాక్ట్స్‌ను కూడా ఎంపిక చేసుకోవచ్చు.

First published:

Tags: New feature, Tech news, Whatsapp

ఉత్తమ కథలు