Home /News /technology /

HERES HOW TO SET WHATSAPP PAY UPI FOR SENDING OR RECEIVING MONEY ON THE MESSAGING APP TAKE A LOOK GH SRD

WhatsApp Payments: వాట్సాప్ ద్వారా డబ్బు ఎలా పంపాలి? పూర్తి వివరాలు తెలుసుకోండి..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

WhatsApp Payments: పోటీ మెసేజింగ్ యాప్‌ల కంటే ఎప్పుడూ ఒక మెట్టు పైనే ఉండే వాట్సాప్‌ (WhatsApp).. ఇప్పటికే పేమెంట్ (WhatsApp Payments) సేవలను ప్రారంభించిన విషయం తెలిసిందే. అయితే ఈ సేవలపై ఎంతో మందికి చాలా అనుమానాలు ఉన్నాయ్.

పోటీ మెసేజింగ్ యాప్‌ల కంటే ఎప్పుడూ ఒక మెట్టు పైనే ఉండే వాట్సాప్‌ (WhatsApp).. ఇప్పటికే పేమెంట్ (WhatsApp Payments) సేవలను ప్రారంభించిన విషయం తెలిసిందే. వివిధ UPI పేమెంట్స్ యాప్స్ అవసరం లేకుండా నేరుగా మనీ ట్రాన్స్‌ఫర్ చేసుకునే వెసులుబాటును వాట్సాప్ కల్పించింది. యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్ (UPI) ఆధారిత చెల్లింపు సేవలను ప్రారంభించడానికి.. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI)తో వాట్సాప్ ఒప్పందం కుదుర్చుకుంది. గత ఏడాది నవంబర్‌లో ఈ ఒప్పదం గురించి వాట్సాప్ ప్రకటించింది. భారత్‌లోని 160 బ్యాంకుల సపోర్ట్‌తో పేమెంట్స్ సేవలు ప్రారంభమయ్యాయి. ఈ పేమెంట్ సేవల యూజర్ బేస్‌ను పెంచుకునేందుకు సంస్థ ప్రణాళికలు వేస్తోంది. ఈ నేపథ్యంలో వాట్సాప్ పేమెంట్ సేవలను ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం.

* వాట్సాప్ పే UPIని ఎలా సెట్ చేయాలి?
ఆండ్రాయిడ్ యూజర్లు స్మార్ట్‌ఫోన్‌లో వాట్సాప్‌ ఓపెన్ చేసి.. యాప్ పైభాగంలో కుడివైపు ఉన్న మూడు చుక్కలపై క్లిక్ చేయాలి. iOS యూజర్లు కింద ఉండే ‘సెట్టింగ్స్’ పై క్లిక్ చేయాలి.ఇందులో పేమెంట్స్ ఆప్షన్‌పై క్లిక్ చేసి, 'యాడ్ పేమెంట్ మెథడ్‌' ఆప్షన్‌ను ఎంచుకోవాలి. తర్వాత పాట్సాప్ పేమెంట్ పాలసీలను అంగీకరించాలనే నోటిఫికేషన్ కనిపిస్తుంది. దీన్ని యాక్సెప్ట్ చేసి ‘యాక్సెప్ట్ అండ్ కంటిన్యూ’ ఆప్షన్‌ను ఎంచుకోవాలి.

అనంతరం మీ బ్యాంక్‌ను జాబితా నుంచి ఎంచుకోవాలి. ఒకవేళ ఒకే బ్యాంకులో రెండు అకౌంట్లు ఉంటే.. UPI సేవలను యాక్టివేట్ చేయాలనుకుంటున్న అకౌంట్‌ను ఎంచుకోవాలి. అయితే బ్యాంక్ అకౌంట్‌కు, వాట్సాప్‌కు ఒకే నంబర్ లింక్ చేసి ఉండాలి. ఒక SMS ద్వారా బ్యాంక్ అకౌంట్, నంబర్‌ను ధ్రువీకరిస్తుంది. ఆ తర్వాత పేమెంట్స్ సర్వీస్ కోం కొత్త UPI PINని సృష్టించాలి. దీని ద్వారా వాట్సాప్ పేమెంట్ సేవలను ఎప్పుడైనా ఉపయోగించుకోవచ్చు.

* UPI ద్వారా డబ్బు ఎలా పంపాలి
వాట్సాప్ ద్వారా డబ్బు పంపడానికి 'పేమెంట్' ఆప్షన్‌ను ఎంచుకోవాలి. అక్కడ మీరు డబ్బు పంపాలనుకుంటున్న కాంటాక్ట్‌ను ఎంచుకోవాలి. ఒకవేళ వారు వాట్సాప్ పేమెంట్‌ సేవలను ఉపయోగించకపోతే.. రిసీవర్ వాట్సాప్ పే QR కోడ్ లేదా UPI అడ్రస్‌ ద్వారా కూడా డబ్బు పంపవచ్చు.

ఇది కూడా చదవండి : Rohit Sharma on Pakistan : పాకిస్థాన్ లో చిల్ అవుతున్న రోహిత్ శర్మ .. అసలు మ్యాటర్ ఇదేనా.. !

మీరు పంపాలనుకున్న అమౌంట్‌ ఎంటర్ చేసి, UPI పిన్‌తో ట్రాన్సాక్షన్‌ పూర్తిచేయవచ్చు. డబ్బు రిసీవ్ చేసుకునే వారు ప్రత్యేకంగా ఎలాంటి స్టెప్స్ ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. వారు వాట్సాప్ పేమెంట్స్‌ ఉపయోగించకపోయినా వారి బ్యాంకు అకౌంట్‌కు డబ్బు క్రెడిట్ అవుతుంది.
Published by:Sridhar Reddy
First published:

Tags: Money, Payments, Technology, UPI, Whatsapp

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు