Home /News /technology /

HERES HOW SAMSUNG GALAXY S22 BUYERS CAN GET GALAXY WATCH4 AT RS 2999 GH VB

Samsung Smart Phone: శామ్​సంగ్ నుంచి ఆ ఫోన్ కొనుగోలు చేస్తున్నారా..? అయితే ఈ ఆఫర్ మీకోసమే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

దక్షణ కొరియా మొబైల్​ దిగ్గజం శామ్​సంగ్​ తాజాగా తన తాజా​ గెలాక్సీ S22 సిరీస్‌ను లాంచ్​ చేసింది. ఈ సిరీస్​ నుంచి గెలాక్సీ S22, గెలాక్సీ S22 ప్లస్, గెలాక్సీ S22 అల్ట్రా ఫోన్లు విడుదలయ్యాయి. ఈ మూడు ఫోన్లు వచ్చే నెల ప్రారంభంలో భారత మార్కెట్​లో విక్రయానికి వస్తాయి.

ఇంకా చదవండి ...
దక్షణ కొరియా మొబైల్​ దిగ్గజం శామ్​సంగ్​ తాజాగా తన తాజా​ గెలాక్సీ(Galaxy) S22 సిరీస్‌ను లాంచ్​ చేసింది. ఈ సిరీస్​ నుంచి గెలాక్సీ S22, గెలాక్సీ S22 ప్లస్, గెలాక్సీ S22 అల్ట్రా ఫోన్లు విడుదలయ్యాయి. ఈ మూడు ఫోన్లు వచ్చే నెల ప్రారంభంలో భారత మార్కెట్​లో విక్రయానికి వస్తాయి. వీటి ధర రూ. 72,999 నుంచి ప్రారంభమవుతుంది. ఇక, గెలాక్సీ S22 సిరీస్ కొనుగోలుదారులకు శామ్​సంగ్(Samsung)​ సంస్థ అదిరిపోయే ఆఫర్​ ప్రకటించింది. ఈ స్మార్ట్​ఫోన్ సిరీస్​ కొనుగోలు చేసే వారు గెలాక్సీ వాచ్ 4, గెలాక్సీ బడ్స్​‌లపై భారీ డిస్కౌంట్​ (Discount) పొందవచ్చు. ఈ ఆఫర్​ వివరాలను పరిశీలిద్దాం.

శామ్​సంగ్ గెలాక్సీ S22 సిరీస్ ధర

వెనిలా శామ్​సంగ్​ గెలాక్సీ S22 బేస్ 8GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్ రూ. 72,999 ధర వద్ద లభిస్తుంది. ఇక, 8GB RAM + 256GB స్టోరేజ్ వేరియంట్​ రూ.76,999 ధర వద్ద అందుబాటులో ఉంటుంది. మరోవైపు, గెలాక్సీ S22 ప్లస్​ 8GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్​ రూ. 84,999, 8GB RAM + 256GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 88,999 వద్ద లభిస్తాయి. శామ్​సంగ్​ గెలాక్సీ S22 అల్ట్రా 12GB RAM + 256GB స్టోరేజ్ వేరియంట్ రూ. 1,09,999 వద్ద, 12GB RAM + 512GB స్టోరేజ్ వేరియంట్​ రూ. 1,18,999 ధర వద్ద అందుబాటులో ఉంటాయి.

శామ్​సంగ్​ గెలాక్సీ S22 సిరీస్ డీల్స్​, ఆఫర్లు

శామ్​సంగ్​ గెలాక్సీ S22 సిరీస్ ప్రీ-బుకింగ్స్​ భారతదేశంలో ఇప్పటికే ప్రారంభమయ్యాయి. ఈ స్మార్ట్‌ఫోన్‌ను ముందస్తుగా కొనుగోలు చేసేవారికి శామ్​సంగ్​ భారీ డిస్కౌంట్​ను అందిస్తోంది. గెలాక్సీ S22 అల్ట్రాని ప్రీ-బుకింగ్ చేసే కస్టమర్లు రూ. 26999 విలువైన గెలాక్సీ వాచ్​4ని కేవలం రూ. 2999కే కొనుగోలు చేయవచ్చు. మరోవైపు, రూ. 11,999 విలువైన గెలాక్సీ బడ్స్​2ని రూ.999 వద్ద కొనుగోలు చేయవచ్చు. ఇక, మీ పాత శామ్​సంగ్​ గెలాక్సీ S సిరీస్ లేదా​ గెలాక్సీ నోట్​ ఎక్స్​ఛేంజ్ ద్వారా రూ. 8,000 అప్‌గ్రేడ్ బోనస్‌ను కూడా పొందవచ్చు. శామ్​సంగ్​ మినహా ఇతర డివైజ్​లను ఎక్స్​ఛేంజ్​ చేస్తే రూ. 5,000 అప్‌గ్రేడ్ బోనస్‌ లభిస్తుంది.

Online Degree Courses: ఆన్‌లైన్‌ డిగ్రీ కోర్సులను యూజీసీ సిద్ధం.. దేశవ్యాప్తంగా 900 కళాశాలల్లో అందుబాటులోకి..!


శామ్​సంగ్​ గెలాక్సీ S22 అల్ట్రా స్పెసిఫికేషన్లు

శామ్సంగ్ గెలాక్సీ S22 అల్ట్రా 6.8- అంగుళాల ఎడ్జ్ QHD+ డైనమిక్ AMOLED 2X డిస్‌ప్లేతో వస్తుంది. ఇది ఆక్టా-కోర్ స్నాప్‌డ్రాగన్ 8 Gen 1 చిప్​సెట్​ ప్రాసెసర్​ ద్వారా పనిచేస్తుంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్12- ఆధారిత One UI 4.1 ఇంటర్‌ఫేస్‌తో నడుస్తుంది. ఈ ఫోన్ 8GB RAM, 12GB RAMతో పాటు 128GB, 256GB, 1TB స్టోరేజ్ ఆప్షన్​ గల వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. కెమెరాల విషయానికి వస్తే.. దీనిలోని క్వాడ్​కెమెరా సెటప్​లో 12MP అల్ట్రా-వైడ్, 108 MP వైడ్,10MP టెలిఫోటో, 10MP టెలిఫోటో కెమెరాలను అందించింది. ఈ డివైజ్​ AI సూపర్ రిజల్యూషన్ టెక్నాలజీతో కూడిన10x ఆప్టికల్ జూమ్, 10x డిజిటల్ జూమ్‌తో సహా 100X స్పేస్ జూమ్‌కు మద్దతు ఇస్తుంది.

శామ్​సంగ్​ గెలాక్సీ S22, గెలాక్సీ S22 ప్లస్​ స్పెసిఫికేషన్లు

శామ్సంగ్ గెలాక్సీ S22 ప్లస్​, S22 రెండూ ఒకే విధమైన స్పెసిఫికేషన్లను కలిగి ఉంటాయి. అయితే, వీటి డిస్‌ప్లే, కెమెరా, బ్యాటరీ స్పెసిఫికేషన్లలో కొన్ని తేడాలున్నాయి. గెలాక్సీ S22+ 6.6 -అంగుళాల FHD+ డైనమిక్ AMOLED 2X డిస్ప్లేతో వస్తుంది. మరోవైపు, గెలాక్సీ S22 6.1 -అంగుళాల FHD+ డిస్​ప్లేతో వస్తుంది. శామ్​సంగ్ గెలాక్సీ S22, గెలాక్సీ S22+ రెండూ క్వాల్​కామ్​ స్నాప్​డ్రాగన్​ 8 Gen 1 ప్రాసెసర్‌తో పనిచేస్తాయి. ఈ రెండు పరికరాలు ట్రిపుల్ కెమెరాలతో వస్తాయి. దీని వెనుక భాగంలో 12MP అల్ట్రా-వైడ్, 50 MP వైడ్ డ్యూయల్ పిక్సెల్, 10MP టెలిఫోటో కెమెరాలను అందించింది. ఇక, ముందు భాగంలో 10MP సెల్ఫీ కెమెరాను చేర్చింది.
Published by:Veera Babu
First published:

Tags: 5G Smartphone, Mobile News, Mobiles, Samsung, Samsung Galaxy, Smart phones, Smartphone

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు