హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Android: ఆండ్రాయిడ్ ఫోన్‌లో ఆటో పవర్ ఆన్, ఆఫ్ ఫీచర్‌ను ఎలా యూజ్ చేయాలి..? ప్రాసెస్, టిప్స్ తెలుసుకోండి..

Android: ఆండ్రాయిడ్ ఫోన్‌లో ఆటో పవర్ ఆన్, ఆఫ్ ఫీచర్‌ను ఎలా యూజ్ చేయాలి..? ప్రాసెస్, టిప్స్ తెలుసుకోండి..

Android: ఆండ్రాయిడ్ ఫోన్‌లో ఆటో పవర్ ఆన్, ఆఫ్ ఫీచర్‌ను ఎలా యూజ్ చేయాలి..? ప్రాసెస్, టిప్స్ తెలుసుకోండి..

Android: ఆండ్రాయిడ్ ఫోన్‌లో ఆటో పవర్ ఆన్, ఆఫ్ ఫీచర్‌ను ఎలా యూజ్ చేయాలి..? ప్రాసెస్, టిప్స్ తెలుసుకోండి..

Android: ఆటోమేటిక్ ఆఫ్/ఆన్ ఫీచర్‌ సెట్ చేస్తే, డివైజ్‌ను మాన్యువల్‌గా బూట్ చేయాల్సిన పని తప్పుతుంది. యూజర్ల ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ నిర్ణీత సమయంలో ఆటోమెటిక్‌గా ఆన్, ఆఫ్ అవుతుంది. ఈ ఫీచర్‌ను ఎలా యాక్సెస్ చేయాలో చూద్దాం.

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

ఇప్పుడు మార్కెట్‌లోకి వచ్చే వివిధ రకాల స్మార్ట్‌ఫోన్లు అడ్వాన్స్‌డ్ ఫీచర్ల (Advanced Features)తో వస్తున్నాయి. ఆండ్రాయిడ్ (Android) ఫోన్లలో వర్క్ లైఫ్, పర్సనల్ లైఫ్‌ను బ్యాలెన్స్‌ చేసుకునేందుకు ఉపయోగపడే స్పెసిఫికేషన్లు చాలా ఉంటున్నాయి. వీటిలో ఆటో పవర్ ఆన్, ఆఫ్ ఫీచర్ ఒకటి. ప్రొఫెషనల్ వర్క్ లైఫ్‌లో షెడ్యూల్ ప్రకారం నిర్వహించే రెగ్యులర్ మీటింగ్స్‌కు హాజరవ్వాల్సిన సందర్భంలో, పర్సనల్ లైఫ్‌లో యోగా, మెడిటేషన్, ఇతర టైమింగ్స్‌ ఫాలో అవుతున్నప్పుడు ఫోన్‌ను చాలామంది స్విచ్ ఆఫ్ చేస్తుంటారు. అయితే అలా కాకుండా యూజర్లు తమ షెడ్యూల్ ప్రకారం ఆటోమెటిక్‌గా ఫోన్‌ ఆఫ్ అయ్యి, తర్వాత ఆన్ అయ్యేలా ఆటో పవర్ ఆన్/ఆఫ్ (Auto power on/off) ఫీచర్ ఉపయోగపడుతుంది. దీన్ని ఆండ్రాయిడ్ ఫోన్‌లో ఎలా సెట్ చేసుకోవాలో చూద్దాం.

ఆటోమేటిక్ ఆఫ్/ఆన్ ఫీచర్‌ సెట్ చేస్తే, డివైజ్‌ను మాన్యువల్‌గా బూట్ చేయాల్సిన పని తప్పుతుంది. యూజర్ల ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ నిర్ణీత సమయంలో ఆటోమెటిక్‌గా ఆన్, ఆఫ్ అవుతుంది. ఈ ఫీచర్‌ను ఆన్ చేయడానికి ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లో సెట్టింగ్స్ ఓపెన్ చేయండి. ఆప్షన్స్ నుంచి ‘సిస్టమ్ సెట్టింగ్స్’ సెలక్ట్ చేయండి.

ఇప్పుడు డిస్‌ప్లే అయ్యే రిజల్ట్స్ నుంచి షెడ్యూల్ పవర్ ఆన్, ఆఫ్ (Schedule power on/off button) ఆప్షన్‌పై క్లిక్ చేసి.. ఇక్కడ మీరు ఏ టైమ్‌కు మీ ఫోన్ ఆటోమెటిక్‌గా ఆఫ్ అవ్వాలనుకుంటున్నారు, మళ్లీ ఎప్పుడు ఫోన్ ఆన్ కావాలనుకుంటున్నారనే టైమింగ్స్ ఎంటర్ చేయండి. చివరకు పవర్ ఆన్, పవర్ ఆఫ్ టోగుల్స్ రెండూ ఆన్‌ చేస్తే.. ఈ ఫీచర్ ఆన్‌ అవుతుంది.

* ఫీచర్ ఉపయోగాలు

మీరు బిజీగా ఉన్న టైమ్‌లో ఫోన్‌ కాల్స్, మెసేజ్‌లతో డిస్ట్రబ్ అవ్వకుండా ఈ ఫీచర్‌ను యూజ్ చేసుకోవచ్చు. డైలీ మీటింగ్స్‌ అటెండ్ అయ్యేవారు ఫోన్‌ వల్ల దృష్టి మరల్చకుండా కాపాడుకోవచ్చు. అలాగే స్లీపింగ్ అవర్స్, మెడిటేషన్, యోగా చేసే సమయంలో ఈ ఫీచర్ ఎంతో ఉపయోగపడుతుంది.

* పాస్‌వర్డ్ షేరింగ్

మరోవైపు, ఆండ్రాయిడ్ ఫోన్లలో కొత్త ఫీచర్ కస్టమర్ల దృష్టిని ఆకర్షిస్తోంది. పాస్‌వర్డ్‌ లేకుండానే మీ వైఫైని షేర్ చేసే ఒక హిడెన్ ఫీచర్ ఇది. లేటెస్ట్ ఆండ్రాయిడ్‌ ఫోన్లను పాస్‌వర్డ్‌ లేకుండా Wi-Fi నెట్‌వర్క్‌లకు కనెక్ట్ చేసే చిన్న యుటిలిటీతో వస్తున్నాయి. ఇందుకోసం యూజర్లు QR కోడ్‌ను స్కాన్ చేస్తే చాలు. మీ వైఫై పాస్‌వర్డ్‌ను ఫ్రెండ్స్, ఫ్యామిలీకి షేర్ చేయాలనుకున్నప్పుడు, మీ పాస్‌వర్డ్ గుర్తు రాకపోతే.. ఆండ్రాయిడ్ డివైజ్ వైఫై సెట్టింగ్స్ నుంచి క్యూఆర్ కోడ్‌ను ఇతరుల డివైజ్‌లో స్కాన్ చేస్తే చాలు. ఈ ఫీచర్‌తో మీ Wi-Fi పాస్‌వర్డ్‌ను ఇతర ఆండ్రాయిడ్ డివైజ్‌లకు కూడా పంపవచ్చు. అయితే తాజా ఆండ్రాయిడ్ వెర్షన్‌లోనే ఈ ఫీచర్ పనిచేస్తుంది.

Published by:Sridhar Reddy
First published:

Tags: Android, Smartphones, Tech news

ఉత్తమ కథలు