భారత్‌లో స్మార్ట్‌ఫోన్ల (Smartphones)కు మంచి డిమాండ్ ఉంది. అన్ని కంపెనీలు వివిధ సెగ్మెంట్లలో సరికొత్త మోడల్స్ రిలీజ్ చేస్తున్నాయి. ఈ నెలలో బెస్ట్ ఫీచర్స్‌తో లభించే టాప్ బ్రాండ్ స్మార్ట్‌ఫోన్‌ను కొనాలనుకుంటే.. రూ.25 వేలలోపు మంచి మోడల్స్ ఇవే.. వీటిపై ఓ లుక్కేయండి.
* మోటోరోలా ఎడ్జ్ 30
ఆండ్రాయిడ్ సాఫ్ట్‌వేర్ ఎక్స్‌పీరియన్స్ ఇష్టపడే వారికి ఇది బెస్ట్ ఛాయిస్. ఇందులో 144Hz రిఫ్రెష్ రేటుతో 6.5 అంగుళాల AMOLED డిస్‌ప్లే ఉంటుంది. స్మూత్ స్క్రోలింగ్‌తో బెస్ట్ గేమింగ్ ఎక్స్ పీరియన్స్ అందిస్తుంది. స్నాప్‌డ్రాగన్ 778G+ చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. 33W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే 4,020mAh బ్యాటరీ, రియర్ ట్రిపుల్ కెమెరా(50 MP+50 MP+2 MP) సెటప్, 32 MP ప్రంట్ కెమెరా, USB టైప్-C 2.0, బ్లూటూత్ 5.2 వంటి ఫీచర్స్ కూడా ఉన్నాయి. ఈ స్మార్ట్ ఫోన్‌ను అమెజాన్‌లో రూ.24,499కు సొంతం చేసుకోవచ్చు.
* OnePlus Nord CE 2
వన్‌ప్లస్ నార్డ్ CE 2 ఫోన్ 90Hz రిఫ్రెష్ రేటుతో 6.43 అంగుళాల Fluid AMOLED డిస్‌ప్లేతో లభిస్తుంది. ఇమ్మర్సివ్ వీడియో వాచింగ్ ఎక్స్ పీరియన్స్ కోసం HDR 10+ వీడియో ప్లేబ్యాక్‌కు సపోర్ట్ ఇస్తుంది. మీడియా టెక్ టైమెన్షిటీ 900 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. 4,500mAh బ్యాటరీ, రియర్ ట్రిపుల్ కెమెరా(64 MP + 8MP + 2MP) సెటప్, 16MP ఫ్రంట్ కెమెరా, బ్లూటూత్ 5.2 వంటి ఫీచర్స్ ఈ స్మార్ట్‌ఫోన్ ప్రత్యేకత. ఈ మోడల్‌ను రూ.17,241కు కొనుగోలు చేయవచ్చు.
* రియల్‌మీ 10 ప్రో
రియల్‌మీ 10 ప్రో 5జీ స్మార్ట్‌ఫోన్ బేస్ వేరియంట్(6GB+128GB)ను అమెజాన్‌లో రూ.20,420కు సొంతం చేసుకోవచ్చు. ఈ ఫోన్‌లో 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.72 అంగుళాల IPS LCD డిస్‌ప్లే ఉంటుంది. స్నాప్‌డ్రాగన్ 695 SoC ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఇందులో రియర్ డ్యుయల్ కెమెరా(108 MP+2 MP) సెటప్ ఉంటుంది. 33W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే 5,000mAh బ్యాటరీ ఉంది. ఇది ఆండ్రాయిడ్ 13ఓఎస్‌పై రన్ అవుతుంది. ఈ ఫోన్‌లోని మరో హైలైట్.. 108MP శామ్‌సంగ్ HM6 ప్రైమరీ కెమెరా. వెలుతురు తక్కువగా ఉన్న సమయంలోనూ ఇది అద్భుతమైన ఫోటోలు, వీడియోలను రికార్డ్ చేయగలదు.
ఇది కూడా చదవండి : కోకాకోలా థీమ్‌తో రియల్‌మీ 10 ప్రో.. ఫీచర్స్, ధర వివరాలివే!
* Poco X5 Pro
120Hz రీఫ్రెష్ రేట్, IP53 రేటింగ్‌తో HDR 10+ డిస్‌ప్లేతో ఈ స్మార్ట్‌ఫోన్ లభిస్తుంది. ఇది స్నాప్‌డ్రాగన్ 778G ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఈ హ్యాండ్‌సెట్‌లో రియర్ ట్రిపుల్ కెమెరా(108 MP + 8 MP + 2 MP) సెటప్ ఉంటుంది. సెల్ఫీల కోసం ఫోన్ ముందు భాగంలో 16 MP కెమెరాను అమర్చారు. 67W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేసే 5,000mAh బ్యాటరీ ఉంటుంది. పోకో X5 ప్రో ధర రూ. 22,999 కాగా, ఐసీఐసీఐ బ్యాంక్ కార్డ్ ద్వారా రూ. 20,999 డిస్కౌంట్ ధరకు సొంతం చేసుకోవచ్చు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Motorola, POCO, Smartphone, Smartphones, Tech news