హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Gmail Tricks: జీమెయిల్‌లో ప్రమోషనల్ ఈమెయిల్స్‌ ఒకేసారి డిలీట్ చేయాలా..? ఈ స్టెప్స్ ఫాలో అవ్వండి..

Gmail Tricks: జీమెయిల్‌లో ప్రమోషనల్ ఈమెయిల్స్‌ ఒకేసారి డిలీట్ చేయాలా..? ఈ స్టెప్స్ ఫాలో అవ్వండి..

Gmail Tricks: జీమెయిల్‌లో ప్రమోషనల్ ఈమెయిల్స్‌ ఒకేసారి డిలీట్ చేయాలా..? ఈ స్టెప్స్ ఫాలో అవ్వండి..

Gmail Tricks: జీమెయిల్‌లో ప్రమోషనల్ ఈమెయిల్స్‌ ఒకేసారి డిలీట్ చేయాలా..? ఈ స్టెప్స్ ఫాలో అవ్వండి..

Gmail Tricks: మెయిల్ ఇన్‌బాక్స్ నుంచి ప్రమోషనల్ ఈమెయిల్స్‌ను గుర్తించి ఒకేసారి డిలీట్ చేయడం తెలియక చాలామంది నానా ఇక్కట్లు పడుతున్నారు. అయితే ఒక సింపుల్ ట్రిక్ యూజ్‌ చేస్తే మీరు చాలా సులభంగా ప్రమోషనల్ ఈమెయిల్స్‌ను డిలీట్ చేసుకోవచ్చు.

ఇంకా చదవండి ...
  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

ఈ రోజుల్లో ప్రమోషనల్ టెక్స్ట్ మెసేజ్‌లు లేదా ప్రమోషనల్ ఈమెయిల్స్‌ (Promotinal Emails) పెద్ద ఎత్తున వస్తూ యూజర్లను తెగ ఇబ్బంది పెట్టేస్తున్నాయి. సమయం గడుస్తున్న కొద్దీ ఇవి జీమెయిల్ (Gmail) ఇన్‌బాక్స్‌లో పేరుకుపోతూ ఇంపార్టెంట్ ఈమెయిల్స్‌ను గుర్తించడాన్ని కష్టతరం చేస్తున్నాయి. వీటిని డిలీట్ (Delete) చేయడం కూడా పెద్ద తలనొప్పిగా మారిపోయింది. ప్రమోషనల్ ఈమెయిల్స్‌ను గుర్తించి ఒకేసారి డిలీట్ చేయడం తెలియక చాలామంది నానా ఇక్కట్లు పడుతున్నారు. అయితే ఒక సింపుల్ ట్రిక్ యూజ్‌ చేస్తే మీరు చాలా సులభంగా ప్రమోషనల్ ఈమెయిల్స్‌ను డిలీట్ చేసుకోవచ్చు. అదే సమయంలో ఎలాంటి ఇంపార్టెంట్ ఈమెయిల్ డిలీట్ కాకుండా జాగ్రత్తపడొచ్చు. మరి ఆ ట్రిక్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

* ఆండ్రాయిడ్ యూజర్లు ఫాలో అవ్వాల్సిన స్టెప్స్

స్టెప్ 1: ఆండ్రాయిడ్ యూజర్లు ప్రమోషనల్ ఈమెయిల్స్‌ను Gmail యాప్‌ ఓపెన్ చేయాలి.

స్టెప్ 2: జీమెయిల్ యాప్‌ను ఓపెన్ చేశాక లెఫ్ట్ సైడ్‌లో ఉన్న హామ్‌బర్గర్ ఐకాన్‌పై క్లిక్ చేయాలి. ఈ మెనూలో మీ ఇన్‌బాక్స్‌లో ఉన్న రకరకాల ఈ-మెయిల్స్ కేటగిరీల లిస్ట్ కనిపిస్తుంది.

స్టెప్ 3: ఈ లిస్ట్‌లో "ప్రమోషన్లు (Promotions)"పై క్లిక్ చేయాలి.

స్టెప్ 4: ఏదైనా ఒక ఈ-మెయిల్‌పై లాంగ్ ట్యాప్ చేస్తే అది సెలెక్ట్ అవుతుంది. దాంతో పాటు మిగతా ప్రమోషనల్ ఈమెయిల్స్‌ను త్వరత్వరగా సెలెక్ట్ చేసుకొని ఒకేసారి డిలీట్ చేసుకోవచ్చు.

* డెస్క్‌టాప్‌లో ఇలా

బల్క్ ప్రమోషనల్ ఈమెయిల్స్‌ను ఒకేసారి డిలీట్ చేసే ట్రిక్‌ను డెస్క్‌టాప్‌లో ప్రయత్నించవచ్చు. అదెలాగో స్టెప్ బై స్టెప్ ఇప్పుడు చూద్దాం.

స్టెప్ 1: మొదటగా డెస్క్‌టాప్‌లో మీ Gmail అకౌంట్‌కు లాగిన్ అవ్వాలి.

స్టెప్ 2: సెర్చ్ బార్‌లో అన్‌సబ్‌స్క్రైబ్ (Unsubscribe) అని టైప్ చేసి ఎంటర్ నొక్కాలి. అప్పుడు మీకు అన్‌సబ్‌స్క్రైబ్ బటన్‌తో ఉన్న అన్ని ఈమెయిల్స్‌తో ఒక లిస్టు కనిపిస్తుంది

- ఇప్పుడు, అన్ని ఈమెయిల్‌లను సెలెక్ట్ చేసుకోవడానికి పైన కనిపించే ఒక బాక్స్‌లో టిక్ చేయాలి.

- ఆపై డిలీట్ బటన్‌పై క్లిక్ చేయాలి. ఏదైనా ఈమెయిల్స్ ఉపయోగకరమైనవిగా భావిస్తే వాటిని డీ-సెలెక్ట్ చేయవచ్చు.

ఇది కూడా చదవండి : డ్రైవింగ్ లైసెన్స్ మీ మొబైల్‌లో ఇలా డౌన్‌లోడ్ చేయండి

* భవిష్యత్తులో వీటిని ఆపేదెలా

సాధారణంగా బ్లాగులు లేదా వెబ్‌సైట్లను ఓపెన్ చేసినప్పుడు లాగిన్ అవ్వాలని లేదా న్యూస్ లెటర్‌కు సబ్‌స్క్రైబ్ కావాలని కోరతాయి. ఈ విజ్ఞప్తులకు అంగీకరిస్తే ఆ బ్లాగ్‌లు, వెబ్‌సైట్లు మీకు ఈమెయిల్స్ పంపించడం స్టార్ట్ చేస్తాయి. ప్రతి ప్రమోషనల్ ఈమెయిల్ చివరిలో ఈమెయిల్ ఫూటర్‌లో ‘అన్‌సబ్‌స్క్రైబ్’ అనే పేరుతో ఒక బటన్‌ కనిపిస్తుంది. ఈ బటన్‌పై క్లిక్ చేయడం ద్వారా ఇకపై వాటి నుంచి ఈమెయిల్స్ అనేవి మీ Gmail ఇన్‌బాక్స్‌ను స్పామ్ చేయవు.

అయితే మనం సబ్‌స్క్రైబ్ చేసుకున్నా, లేకపోయినా చాలా కంపెనీల, వెబ్‌సైట్ల నుంచి తరచుగా మెయిల్స్ వస్తూ ఇన్‌బాక్స్‌ను నింపేస్తాయి. వీటన్నిటినీ ఒకేసారి అన్‌సబ్‌స్క్రైబ్ చేయడం కుదురుతుంది. ఇందుకు మీరు జీమెయిల్ యాప్‌ ఓపెన్ చేసి ఏదైనా ఒక స్పామ్ ఈమెయిల్‌పై లాంగ్ ప్రెస్ చేయాలి. ఆ తర్వాత అన్ని అన్వాంటెడ్ ఈమెయిల్స్‌పై క్లిక్ చేసి.. పైన కనిపిస్తున్న త్రీ డాట్ ఐకాన్‌పై నొక్కాలి. అప్పుడు రిపోర్టు స్పామ్‌పై నొక్కితే 'రిపోర్టు స్పామ్‌ & అన్‌సబ్‌స్క్రైబ్' అని కనిపిస్తుంది. ఆ ఆప్షన్‌పై ట్యాప్ చేయడం ద్వారా చాలా కంపెనీలు మీ జీమెయిల్‌కి మెయిల్స్ పంపించడాన్ని ఆపేయవచ్చు.

First published:

Tags: GMAIL, Google, Tech news, Technology

ఉత్తమ కథలు