ప్రపంచంలో స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌కు భారత్ కీలకంగా ఉంది. భారత కస్టమర్లను ఆకర్షించడానికి మొబైల్ కంపెనీలు అద్భుతమైన ఫీచర్స్‌తో స్మార్ట్‌ఫోన్లను లాంచ్ చేస్తున్నాయి. మార్చిలో టాప్ బ్రాండ్స్ మిడ్, ఫ్లాగ్ షిప్ సెగ్మెంట్‌లో స్మార్ట్‌ఫోన్లను లాంచ్ చేయనున్నాయి. వాటి ధరలు, స్పెసిఫికేషన్స్ పరిశీలిద్దాం.
* Oppo Find N2 Flip
చైనీస్ కంపెనీ ఒప్పొ ఇటీవల ఫోల్డబుల్ సెగ్మెంట్‌పై ఫోకస్ చేసింది. అందులో భాగంగా Find N2 Flip పేరుతో సరికొత్త ఫోల్డబుల్ ఫోన్‌ను మార్చి 13న భారత మార్కెట్‌లో లాంచ్ చేయనుంది. ఇందులో అద్భుతమైన ఫీచర్స్ ఉన్నాయి. స్క్రీన్ ముడుచుకున్నప్పుడు హింగ్ ప్రాంతం దగ్గర గ్యాప్ అసలు ఉండదు. అంతేకాకుండా దీని ఫోల్డబుల్ స్క్రీన్‌పై క్రీజ్(మడత) కనిపించదు. ఉపయోగిస్తున్న సమయంలో కస్టమర్‌కు క్రీజ్ ఉందన్న ఫీలింగ్ అసలు ఉండదు. ఈ ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ ధర ఐఫోన్లతో సమానంగా ఉండే అవకాశం ఉంది.
* iQOO Z7 5G
ఐకూ Z7 5G ఫోన్ ఈ నెలలోనే మార్కెట్లోకి రానుంది. ఇందులో 120Hz రిఫ్రెష్ రేటుతో 6.5 అంగుళాల LCD డిస్‌ప్లే ఉండే అవకాశం ఉంది. ఈ హ్యాండ్‌సెట్‌లో మీడియాటెక్ డైమెన్సిటీ 920 చిప్‌సెట్ ఉపయోగించినట్లు సమాచారం. 5000 mAh బ్యాటరీ, యూఎస్‌బీ టైప్-సీ పోర్ట్, డ్యుయల్ కెమెరా(64 MP + 8 MP) సెటప్, 16 MP సెల్ఫీ కెమెరా వంటి ఫీచర్స్ ఈ ఫోన్ ప్రత్యేకతలుగా ఉండవచ్చు. ఈ 5జీ స్మార్ట్‌ఫోన్ రూ.31,990 ధరతో మార్చి 21న లాంచ్ కావచ్చు.
ఇది కూడా చదవండి : శామ్‌సంగ్ గెలాక్సీ M14 5G స్మార్ట్‌ఫోన్ లాంచ్.. తక్కువ ధరలో సూపర్ ఫీచర్లు!
* Oppo Find X6
ఈ స్మార్ట్‌ఫోన్ మార్చి చివరి నాటికి భారత్‌లో లాంచ్ కావచ్చు. ఇది ఫ్లాగ్‌షిప్ సెగ్మెంట్‌లో రానుంది. దీని ధర సుమారు రూ.69,990 ఉండవచ్చు.120 Hz రిఫ్రెష్ రేట్‌తో 6.73 అంగుళాల AMOLED డిప్‌ప్లే, ట్రిపుల్ కెమెరా సెటప్ (50 MP + 13 MP + 50 MP), 4700 mAh బ్యాటరీ, యూఎస్‌బీ టైప్-C ఫోర్ట్ వంటి ఫీచర్స్ ఈ స్మార్ట్‌ఫోన్ ప్రత్యేకతలుగా ఉండే అవకాశం ఉంది.
* OnePlus Nord 3
వన్‌ప్లస్ కంపెనీ ఇటీవల చైనాలో Ace 2V పేరుతో ఓ స్మార్ట్‌ఫోన్‌ను తీసుకొచ్చింది. అయితే ఈ డివైజ్‌ను OnePlus Nord 3 పేరుతో భారత్‌లో ఈ నెలలో లాంచ్ చేసే అవకాశం ఉంది. 80W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేసే 5000mAh బ్యాటరీ, ట్రిపుల్ కెమెరా సెటప్(50 MP + 8 MP + 2 MP), 120 Hz రిఫ్రెష్ రేట్‌తో 6.5 అంగుళాల Fluid AMOLED డిస్‌ప్లే వంటి ఫీచర్స్ ఇందులో ఉండవచ్చు. దీని ధర రూ. దాదాపు 70,000 ఉండే అవకాశం ఉంది.
* Moto X40
మోటో X40 స్మార్ట్‌ఫోన్‌లో 165 Hz రిఫ్రెష్ రేటుతో 6.67 అంగుళాల OLED డిస్‌ప్లే ఉండవచ్చు. ఇందులో క్వాల్‌కమ్ స్నాప్‌డ్రాగన్ 8 Gen 2 ప్రాసెసర్ ఉపయోగించినట్లు సమాచారం. ఈ హ్యాండ్‌సెట్‌లో ట్రిపుల్ కెమెరా(50 MP + 50 MP + 12 MP) సెటప్, 60 MP ఫ్రంట్ కెమెరా, 4600 mAh బ్యాటరీ వంటి స్పెసిఫికేషన్స్ ఉంటాయి. ఈ స్మార్ట్‌ఫోన్ మార్చి 20న లాంచ్ కానుంది. దీని ధర దాదాపు రూ.40,000 ఉండవచ్చు.
Tags: IQoo, Moto, Oppo, Smartphones, Tech news