హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Documents: గూగుల్ డ్రైవ్‌తో డాక్యుమెంట్స్ స్కాన్ & సేవ్ చేయడం ఎలా..? ఈ ప్రాసెస్ ఫాలో అవ్వండి...

Documents: గూగుల్ డ్రైవ్‌తో డాక్యుమెంట్స్ స్కాన్ & సేవ్ చేయడం ఎలా..? ఈ ప్రాసెస్ ఫాలో అవ్వండి...

Google Drive

Google Drive

Documents: ఆండ్రాయిడ్ యూజర్లు గూగుల్ డ్రైవ్ యాప్ ఉపయోగించి చాలా సేఫ్‌గా డాక్యుమెంట్స్ డిజిటలైజ్ చేసుకోవచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం.

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

ప్రతిదీ డిజిటలైజ్‌ అవుతున్న ఈ రోజుల్లో ప్రజలు అన్నిటినీ డిజిటల్‌ (Digital)గా భద్ర పరుచుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు. అయితే డిజిటలైజేషన్ వైపు ఎంత వేగంగా అడుగులు పడుతున్నాయో సైబర్ అటాక్స్‌ కూడా అంతే ఎక్కువగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా చైనీస్ కంపెనీ యాప్స్ కారణంగా డాక్యుమెంట్స్ (Documents) డిజిటలైజ్ చేయడానికి ప్రజలు వెనుకడుగు వేస్తున్నారు. నిజానికి డాక్యుమెంట్స్‌ స్కాన్ చేసి డిజిటల్ రూపంలో సేవ్ చేసే క్యామ్‌స్కానర్ (CamScanner) వంటి పాపులర్ చైనీస్ యాప్స్‌ (Chinese Apps)ను భారత ప్రభుత్వం బ్యాన్ చేసింది. దాంతో చాలామంది తమ డాక్యుమెంట్స్‌ డిజిటల్ రూపంలో ఎలా సేవ్ చేసుకోవాలో తెలియక ఇబ్బందులు పడుతున్నారు.


నిజానికి చైనా యాప్స్ లేకపోయినా ఆండ్రాయిడ్, ఐఓఎస్ యూజర్లకు మరిన్ని ఆప్షన్స్ అందుబాటులో ఉన్నాయి. వాటిలో ఆండ్రాయిడ్ యూజర్లకు గూగుల్ డ్రైవ్ (Google Drive) బెస్ట్‌గా నిలుస్తోంది. ఆండ్రాయిడ్ యూజర్లు గూగుల్ డ్రైవ్ యాప్ ఉపయోగించి చాలా సేఫ్‌గా డాక్యుమెంట్స్ డిజిటలైజ్ చేసుకోవచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం.* గూగుల్ డ్రైవ్‌తో డాక్యుమెంట్స్ స్కాన్ చేయడం ఎలా


స్టెప్ 1: ముందుగా మీ ఆండ్రాయిడ్ ఫోన్‌లో 'Google Drive' యాప్‌ని ఓపెన్ చేయాలి.


స్టెప్ 2: యాప్ హోమ్‌పేజీలో బాటమ్ రైట్ కార్నర్‌లో కనిపించే "+" ఐకాన్‌పై క్లిక్ చేయాలి.


స్టెప్ 3: తర్వాత స్కాన్ (Scan) ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. కెమెరాకి యాక్సెస్ ఇవ్వకపోతే యాక్సెస్ ఇవ్వాలి.


స్టెప్ 4: మీరు మీ డాక్యుమెంట్ పేపర్‌ను ఫొటో తీయగానే, దానిపై కనిపించే చెక్‌బాక్స్‌పై నొక్కాలి.


స్టెప్ 5: క్రాప్ టూల్ (Crop tool) యూజ్ చేసి మీ డాక్యుమెంట్ పేజీల అంచులను సరిగ్గా అడ్జస్ట్ చేసుకోవాలి. ఒకవేళ సరిగా ఫొటో రాకపోతే 'Retry' ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని మళ్లీ ఫొటో కూడా తీసుకోవచ్చు.


స్టెప్ 6: సేవ్ బటన్‌పై నొక్కే ముందు మీరు మీ డాక్యుమెంట్‌ ప్రీవ్యూ చూడవచ్చు.


స్టెప్ 7: ఆపై 'సేవ్ (Save)' బటన్‌పై నొక్కాలి.


స్టెప్ 8: ఫైల్ పేరు, గూగుల్ అకౌంట్, లొకేషన్ వంటివి సెలెక్ట్ చేసుకున్న తర్వాత.. సేవ్ బటన్‌పై మళ్లీ క్లిక్ చేయాలి.


ఇది కూడా చదవండి : వాట్సాప్‌ అదిరిపోయే ఫీచర్.. గ్రూప్ చాట్స్‌లోనే కనిపించనున్న ప్రొఫైల్ ఫొటోలు...


సేవ్ ఆప్షన్‌పై క్లిక్ చేసిన తర్వాత, మీ ఫైల్ పీడీఎఫ్ (PDF) ఫార్మాట్‌లో గూగుల్ డ్రైవ్‌లో సేవ్ అవుతుంది. డాక్యుమెంట్‌లోని అన్ని పేజీలను కూడా స్కాన్ చేయడానికి ఒక పేజీ ఫొటో తీసిన తర్వాత "+" ఐకాన్‌పై నొక్కాలి. అలా అన్ని పేజెస్ చాలా ఈజీగా స్కాన్ చేసుకుని ఒక పీడీఎఫ్ ఫైల్‌గా క్రియేట్ చేసుకోవచ్చు. మీరు ఈ ఫైల్‌ను షేర్ చేయవచ్చు లేదా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అయితే ఐఫోన్ యూజర్లు గూగుల్ డ్రైవ్ ఉపయోగించి డాక్యుమెంట్స్ స్కాన్ చేయలేరు. ఆండ్రాయిడ్ యూజర్లు మాత్రం తమ ఫోన్‌తోనే వచ్చే గూగుల్ డ్రైవ్‌లో రసీదులు, లేఖలు, బిల్లింగ్ స్టేట్‌మెంట్ల వంటి డాక్యుమెంట్స్ స్కాన్ చేసి PDFలుగా సేవ్ చేయవచ్చు.

First published:

Tags: Google, Google Drive, Tech news

ఉత్తమ కథలు