Home /News /technology /

HERE IS THE PROCESS TO DOWNLOAD WHATS APP DESKTOP APP WHICH IS AVAILABLE ON WINDOWS STORE FULL DETAILS HERE PRN GH

What’s App Desktop: అందుబాటులోకి వాట్సాప్‌ డెస్క్‌ టాప్ బీటా యాప్.. ఎలా డౌన్‌ లోడ్ చేసుకోవాలంటే..!

ప్రతీకాత్మకచిత్రం

ప్రతీకాత్మకచిత్రం

సేవల విస్తరణ దిశగా ఆలోచిస్తున్న వాట్సాప్ (What’s App) మరో కొత్త వెబ్- పీసీ వెర్షన్ వాట్సాప్ యాప్‌ను (What’s App Web PC Version) అభివృద్ధి చేసింది. విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్‌లతో (Windows Operating System) పనిచేసే PCలలో ఉపయోగించడానికి వాట్సాప్ సొంతంగా డెస్క్‌ టాప్ యాప్‌ను రూపొందించింది.

ఇంకా చదవండి ...
సేవల విస్తరణ దిశగా ఆలోచిస్తున్న వాట్సాప్ (What’s App) మరో కొత్త వెబ్- పీసీ వెర్షన్ వాట్సాప్ యాప్‌ను (What’s App Web PC Version) అభివృద్ధి చేసింది. విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్‌లతో (Windows Operating System) పనిచేసే PCలలో ఉపయోగించడానికి వాట్సాప్ సొంతంగా డెస్క్‌ టాప్ యాప్‌ను రూపొందించింది. ఈ యాప్ ప్రస్తుతం డౌన్‌లోడ్ చేసుకోవడానికి అందుబాటులోకి వచ్చింది. బీటా వెర్షన్‌లో అందుబాటులోకి వచ్చిన డెస్క్‌టాప్ యాప్‌ను మైక్రోసాఫ్ట్ విండోస్ యాప్ స్టోర్ (Microsoft Windows App Store) నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. విండోస్ వినియోగదారులు తమ డెస్క్‌టాప్‌లు, ల్యాప్‌టాప్‌లలో ఈ యాప్‌ను వినియోగించుకోవచ్చు. వాట్సాప్‌ వెబ్‌కు ప్రత్యామ్నాయంగా దీన్ని వినియోగించుకోవచ్చు.

ఈ డెడికేటెడ్ విండో యాప్‌తో వినియోగదారులు ఇకపై వాట్సాప్‌ వెబ్‌ను ఓపెన్ చేసి వాడుకోవడానికి గూగుల్ క్రోమ్ (Google Chrome), మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ (Microsoft Edge), ఫైర్‌ఫాక్స్ (Firefox) లేదా ఇతర బ్రౌజర్‌లపై ఆధారపడాల్సిన అవసరం లేదు. ఈ యాప్‌ను రన్ చేయడానికి x64 ఆర్కిటెక్చర్ బేస్డ్ CPU, Windows 10 వెర్షన్ 14316.0 లేదా అంతకంటే ఎక్కువ వెర్షన్‌ సిస్టమ్ సపోర్ట్ ఉండాలి.

ఇది చదవండి: వాట్సాప్ లో అదిరిపోయే కొత్త ఫీచర్... ఎలా పనిచేస్తుందంటే..!




విండోస్ డివైజ్‌లకు వాట్సాప్‌ను ఎలా డౌన్‌లోడ్ చేయాలి..?

విండోస్ స్టోర్‌లోకి వెళ్లాలి..?
యూజర్లు ముందు మైక్రోసాఫ్ట్ విండోస్ స్టోర్‌ (Microsoft Windows Store) లోకి వెళ్లాలి. సిస్టమ్‌లో స్టార్ట్ మెనుని ఓపెన్ చేసి 'స్టోర్' అని టైప్ చేయడం ద్వారా మైక్రోసాఫ్ట్ విండోస్ స్టోర్‌ను తెరవవచ్చు. అయితే ఈ సెర్చ్ రిజల్ట్స్‌లో మొదటిది విండోస్ స్టోర్ యాప్ అయి ఉండాలి.

వాట్సాప్ డెస్క్‌ టాప్ కోసం సెర్చ్ చేయాలి
విండోస్ స్టోర్‌లోని టాప్ సెర్చ్ బార్‌లో వాట్సాప్ డెస్క్‌టాప్ కోసం సెర్చ్ చేయండి. అనంతరం సెర్చ్ రిజల్ట్స్‌లో యాప్ కనిపిస్తుంది. ఈ వాట్సాప్ డెస్క్‌టాప్ యాప్‌ను డౌన్‌లోడ్ చేయడానికి ‘గెట్’ బటన్‌పై క్లిక్ చేయండి.

యాప్‌ ను సెటప్ చేసి, ఉపయోగించండి
ఫోన్‌లో వాట్సాప్‌ను ఇన్‌స్టాల్ చేసి, వివరాలతో రిజిస్టర్ చేసినట్లే డెస్క్‌టాప్ యాప్‌లో మీ వివరాలను నమోదు చేయాలి. తద్వారా డెస్క్‌టాప్ యాప్‌ను సెటప్ చేయవచ్చు. అనంతరం ఈ వెబ్ యాప్‌ను వాట్సాప్ వెబ్ మాదిరిగానే వినియోగించుకోవచ్చు.

ఇది చదవండి: మీ స్మార్ట్‌ఫోన్ హ్యాంగ్ అవుతోందా? ఈ సెట్టింగ్స్ మార్చి చూడండి


వాట్సాప్‌ డెస్క్‌టాప్ యాప్‌ను ఇన్‌ స్టాల్ చేసే ముందు యూజర్లు కొన్ని విషయాలు గుర్తుంచుకోవాలి. యాప్ ఇంకా బీటా టెస్టింగ్ దశలోనే ఉంది. కాబట్టి ప్రారంభ దశలో కొన్ని సమస్యలు, బగ్‌లను ఎదుర్కొనే అవకాశం ఉంది. Windows 11లో వాట్సాప్ డెస్క్‌ టాప్ క్రాష్ అవుతుందని యాప్ రివ్యూల ద్వారా తెలుస్తోంది. చాలా మంది వినియోగదారులు ఈ సమస్యను ఎత్తిచూపారు. దీంతో వాట్సాప్‌ను సరిగా వినియోగించేందుకు ప్రస్తుతం వాట్సాప్ వెబ్‌ను ఉపయోగించడం మంచిది. ఇప్పుడు వాట్సాప్ వెబ్ వెర్షన్‌లో సైతం కొత్త ఫీచర్లు ఉన్నందున.. ప్రస్తుతం వాట్సాప్ డెస్క్‌టాప్ బీటా యాప్‌ కంటే వాట్సాప్ వెబ్ వాడకమే మంచిదని టెక్ నిపుణులు సలహా ఇస్తున్నారు.

ఇది చదవండి: జీమెయిల్‌లో లాగిన్ చేస్తున్నారా? ఇక ఈ రూల్ తప్పనిసరి


ప్రస్తుతానికి వాట్సాప్ డెస్క్‌ టాప్‌ ను కూడా స్మార్ట్‌ ఫోన్‌ సాయంతోనే ఉపయోగించాల్సి ఉంటుంది. కాబట్టి ఫోన్ లేకుండా PCలో వాట్సాప్‌ను ఉపయోగించాలనుకుంటే.. మల్టీ డివైజ్ లింకింగ్ ద్వారా వెబ్ యాప్‌ను యూజ్ చేసుకోవడం మంచి ఆప్షన్.
Published by:Purna Chandra
First published:

Tags: Technology, Whatsapp

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు