Home /News /technology /

HERE IS THE LIST OF TOP TEN SMARTPHONES WITH WIRELESS CHARGER NS

Smartphones with wireless charger: వైర్‌లెస్ ఛార్జింగ్ స్మార్ట్‌ఫోన్ కొనాలనుకుంటున్నారా? అయితే.. ఈ పది ఫోన్లపై ఓ లుక్కేయండి

వైర్‌లెస్ ఛార్జింగ్ స్మార్ట్‌ఫోన్ కొనాలనుకుంటున్నారా? అయితే.. ఈ పది ఫోన్లపై ఓ లుక్కేయండి

వైర్‌లెస్ ఛార్జింగ్ స్మార్ట్‌ఫోన్ కొనాలనుకుంటున్నారా? అయితే.. ఈ పది ఫోన్లపై ఓ లుక్కేయండి

నేడు అనేక వైర్‌లెస్ ఛార్జింగ్ స్మార్ట్‌ఫోన్‌లు (wireless charging smartphones) మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ఈ నేపథ్యంలో పది బెస్ట్ వైర్ లెస్ ఛార్జింగ్ సపోర్ట్ స్మార్ట్ ఫోన్ల (Smartphones) జాబితా మీ కోసం..

    నేడు స్మార్ట్ ఫోన్ల (Smartphones) హవా కొనసాగుతోంది. చేతిలో స్మార్ట్ ఫోన్లు కనిపించని వారే కరువైన పరిస్థితి నెలకొంది. అయితే.. స్మార్ట్ ఫోన్ తయారీదారులు కొత్త కొత్త ఫీచర్లను అందుబాటులోకి తెస్తున్నారు. భారీ బ్యాటరీ, ఫాస్ట్ ఛార్జింగ్ (Fast Charging) సపోర్ట్ వంటి ఫీచర్లు కూడా ఈ నేపథ్యంలోనే అందుబాటులోకి వచ్చాయి. ఇప్పుడు వైర్‌లెస్ ఛార్జింగ్ ఫోన్లు (wireless charging phones) కూడా అందుబాటులోకి వచ్చాయి. ఈ విభాగంలో ఉత్తమ స్మార్ట్‌ఫోన్‌ల జాబితా మీ కోసం..

    ఐఫోన్ 13 ప్రో మాక్స్ (iPhone 13 Pro Max):
    ఈ Apple స్మార్ట్‌ఫోన్ వైర్‌లెస్ మరియు ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ రెండింటినీ సపోర్ట్ చేస్తుంది. దీని అంతర్నిర్మిత Li-ion బ్యాటరీ MagSafe వైర్‌లెస్ ఛార్జింగ్ టెక్నాలజీకి సపోర్ట్ చేస్తుంది. ఇది 128GB, 256GB, 512GB, 1TB స్టోరేజ్ వేరియంట్లలో లభిస్తుంది. ఇంకా 12MP + 12MP + 12MP కెమెరా, 12MP ఫ్రంట్ కెమెరాతో అందుబాటులో ఉంది.
    New Car: కొత్త కారు కొనాలనుకుంటున్నారా? అయితే.. వీటన్నింటినీ ఓ సారి తప్పక చెక్ చేయండి..

    Samsung Galaxy S21 Plus 5G:
    ఈ ఫోన్ అధునాతన వైర్‌లెస్ ఛార్జింగ్‌తో వస్తుంది. ఇది Samsung ఫాస్ట్ వైర్‌లెస్ ఛార్జింగ్ 2.0 ఫీచర్‌కు మద్దతు ఇస్తుంది. ఇది 128GB, 256GB స్టోరేజ్/ 8GB RAM తో వస్తుంది. 12GB + 64MP + 12MP ట్రిపుల్ ప్రైమరీ కెమెరా, 10MP ఫ్రంట్ కెమెరా మరియు నాన్-రిమూవబుల్ Li-ion 4800 mAh బ్యాటరీ ఈ ఫోన్ సొంతం.
    Sim Card Rules: ఒకటి కన్నా ఎక్కువ సిమ్ కార్డులు వాడేవారికి కేంద్రం షాక్.. నూతన మార్గదర్శకాలివే..

    Xiaomi 11 Ultra:
    ఫోన్ 67W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ మరియు వైర్‌లెస్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీకి సపోర్ట్ చేస్తుంది. ఇందులో 5000 mAh బ్యాటరీ ఉంది. ఇది 10W వైర్‌లెస్ రివర్స్ ఛార్జింగ్‌కు కూడా మద్దతు ఇస్తుంది. ఇది 256GB స్టోరేజ్/ 12GB RAM, 50MP + 48MP + 48MP కెమెరా, 20MP ఫ్రంట్ కెమెరాకు సపోర్ట్ చేస్తుంది.

    iPhone 12 Pro Max:
    ఈ ఫోన్ 3,687 mAh బ్యాటరీతో వస్తుంది. ఫాస్ట్ ఛార్జింగ్ మరియు వైర్‌లెస్ ఛార్జింగ్‌కు కూడా సపోర్ట్ చేస్తుంది. 128GB, 256GB, 512GB స్టోరేజ్ / 6GB RAM అలాగే 6.7 అంగుళాల 1284 X 2778 పిక్సెల్ డిస్‌ప్లే ఈ ఫోన్లో ఉంటాయి.

    Samsung Galaxy S21 Ultra 5G
    ఈ స్మార్ట్ ఫోన్ కూడా వైర్‌లెస్ పవర్‌షేర్ ఫీచర్‌కు సపోర్ట్ చేస్తుంది. ఇది 5,000 mAh బ్యాటరీతో పాటు Samsung యొక్క లైట్నింగ్ ఫాస్ట్ వైర్‌లెస్ ఛార్జింగ్ 2.0తో వైర్‌లెస్ ఛార్జర్ స్టాండ్‌తో వస్తుంది. ఇది 256GB, 512GB నిల్వ / 12GB, 16GB RAM మరియు 108MP + 10MP + 10MP + 12MP క్వాడ్ ప్రైమరీ కెమెరా మరియు 40MP ఫ్రంట్ కెమెరాతో వస్తుంది.

    Samsung Galaxy S20 FE
    ఈ ఫోన్ 25W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ మరియు 4500 mAh బ్యాటరీని పొందుతుంది. కానీ దాని రిటైల్ ప్యాకేజీలో 15W ఛార్జర్‌తో వస్తుంది. ఇది వైర్‌లెస్ ఛార్జింగ్ మరియు వైర్‌లెస్ పవర్‌షేర్ ఫీచర్‌కు మద్దతు ఇస్తుంది. ఇది 128GB, 256GB స్టోరేజ్ / 8GB RAMతో వస్తుంది. 12MP + 8MP + 12MP ట్రిపుల్ లెన్స్ కెమెరా, 32MP ఫ్రంట్ కెమెరాతో ఈ ఫోన్ వస్తుంది.

    iPhone 12
    ఈ ఫోన్ MagSafe టెక్నాలజీతో వస్తుంది. ఇది వైర్‌లెస్ ఛార్జింగ్ కోసం 2,815 mAh బ్యాటరీని కలిగి ఉంది. ఫోన్ 64GB, 128GB, 256GB స్టోరేజ్ / 4GB RAM అలాగే 6.1 అంగుళాల 1170 x 2532 పిక్సెల్ డిస్‌ప్లేతో వస్తుంది.

    Xiaomi Mi 10 5G
    ఈ స్మార్ట్‌ఫోన్ 30W వైర్‌లెస్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. ఇది 4,500 mAh బ్యాటరీని కలిగి ఉంది. ఇది 128GB / 8GB RAM మరియు 108GB + 13MP + 2MP + 2MP క్వాడ్ లెన్స్ కెమెరా, 20MP ఫ్రంట్ కెమెరాను కలిగి ఉంది.

    LG Velvet
    ఈ ఫోన్ నాన్-రిమూవబుల్ Li-Ion 4300 mAh బ్యాటరీతో వస్తుంది. ఇది ఫాస్ట్ మరియు వైర్‌లెస్ ఛార్జింగ్ రెండింటినీ సపోర్ట్ చేస్తుంది. ఫోన్ 128GB / 6GB RAM మరియు 48MP + 8MP + 5MP ట్రిపుల్ లెన్స్ కెమెరా, 16MP ఫ్రంట్ కెమెరాతో వస్తుంది.

    Motorola Edge+:
    ఈ స్మార్ట్‌ఫోన్ 15W క్విక్ ఛార్జింగ్, NFC, వైర్‌లెస్ ఛార్జింగ్, వాటర్ రెసిస్టెన్స్, వైర్‌లెస్ రివర్స్‌ ఫీచర్లతో వస్తుంది. ఈ ఫోన్లో 256GB / 12GB RAM మరియు 108 MP + 16 MP + 8 MP ట్రిపుల్ లెన్స్ కెమెరా, 25 MP ఫ్రంట్ కెమెరా ఉన్నాయి.
    Published by:Nikhil Kumar S
    First published:

    Tags: 5G Smartphone, Charging, Iphone, Samsung, Smartphone, Xiomi

    తదుపరి వార్తలు