Home /News /technology /

Best Smartphones for Women: మహిళల కోసం టాప్ 10 ఉత్తమ స్మార్ట్‌ఫోన్‌లు ఇవే.. ఓ లుక్కేయండి

Best Smartphones for Women: మహిళల కోసం టాప్ 10 ఉత్తమ స్మార్ట్‌ఫోన్‌లు ఇవే.. ఓ లుక్కేయండి

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

స్మార్ట్‌ఫోన్‌లను కొనుగోలు చేసే విషయంలో మహిళలు, పురుషులకు ప్రత్యేక ఆసక్తులు ఉంటాయి. ఆకర్షణీయమైన రంగులు మరియు మంచి కెమెరాలతో కూడిన ఫోన్‌లను కొనుగోలు చేయడానికి మహిళలు త్వరగా ఆసక్తి చూపుతారు.

    స్మార్ట్‌ఫోన్‌(Smartphone) ను కొనుగోలు చేసేటప్పుడు, చాలా మంది పురుషులు ప్రాసెసర్, స్క్రీన్, ర్యామ్ మరియు కెమెరా వంటి స్పెసిఫికేషన్లను పరిశీలిస్తారు. అయితే స్మార్ట్ ఫోన్ ఎంపికలో పురుషులు, మహిళలకు భిన్నాభిప్రాయాలు ఉంటాయి. మహిళలు ఆకర్షణీయమైన రంగులు మరియు మంచి కెమెరాలతో కూడిన ఫోన్‌(Smartphone) లను కొనడానికి ఎక్కువగా ఆసక్తి చూపుతారు. మహిళల చేతిలో బాగుండే.. వారికి నచ్చే 10 ఉత్తమ స్మార్ట్‌ఫోన్‌ల (Best Smartphone) సమాచారం..

    1) Apple iPhone 13 Pro: ఈ ఫోన్ 6.10-అంగుళాల డిస్‌ప్లే, A15 బయోనిక్ ప్రాసెసర్, iOS 15తో వస్తుంది. ఈ ఫోన్ కెమెరా చాలా బాగుంటుంది. మహిళల చేతిలో ఈ ఫోన్ మరింత ఆకర్షినీయంగా కనిపిస్తుంది
    2) Samsung Galaxy Z Flip3 5G: ఈ ఫోన్‌లో 6.7-అంగుళాల FHD డైనమిక్ AMOLED 2X ఇన్ఫినిటీ ఫ్లెక్స్ డిస్‌ప్లే ప్లే ఉంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్ ను కలిగి ఉంటుంది. ఇది స్నాప్‌డ్రాగన్ 888 ప్రాసెసర్, 8 GB RAM మరియు 256 GB వరకు స్టోరేజ్ సామర్థ్యంతో వస్తుంది. ఫోన్ బ్యాటరీ మరియు కెమెరా కూడా బాగుంటుంది.
    3) Oppo Renault 6 5G: ఈ ఫోన్‌లో 5G టెక్నాలజీని కూడా సపోర్ట్ చేస్తుంది. అదేవిధంగా డెన్సిటీ 900Soc ప్రాసెసర్ ఉంటుంది. ఫోన్ 4G వేరియంట్‌లలో కూడా అందుబాటులో ఉంది.
    Moto Tab G70: మోటొరోలా నుంచి సరికొత్త టాబ్లెట్.. భారత్‌లో త్వరలో లాంచ్ కానున్న మోటో ట్యాబ్ G70

    4) OnePlus Nord: ఈ ఫోన్ FHD + రిజల్యూషన్ మరియు 90 Hz రిఫ్రెష్ రేట్, 5G సపోర్ట్, స్నాప్‌డ్రాగన్ 750G చిప్‌సెట్, 48MP ట్రిపుల్ కెమెరా, 4500 mAh బ్యాటరీతో పాటు 6.43-అంగుళాల ఫ్లూయిడ్ AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంటుంది.
    5) Xiaomi Mi11 Lite: ఈ స్మార్ట్‌ఫోన్‌లో 120 Hz రిఫ్రెష్ రేట్, HDR 10+ మరియు MEMC టెక్నాలజీతో 6.81 అంగుళాల E4 AMOLED కర్వ్డ్ డిస్‌ప్లే ఉంది. అలాగే 1.1-అంగుళాల సెకండరీ AMOLED డిస్‌ప్లే, స్నాప్‌డ్రాగన్ 888 SOC, VC లిక్విడ్ కూలింగ్ టెక్నాలజీ, 50MP ప్రైమరీ Samsung కెమెరా సెన్సార్, మరో రెండు సెన్సార్లు మరియు 67W వైర్డ్ మరియు వైర్‌లెస్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5000mAh బ్యాటరీ ఈ ఫోన్ సొంతం.
    6) Samsung Galaxy M32 5G: ఈ ఫోన్ HD + రిజల్యూషన్ మరియు 6.5 అంగుళాల ఇన్ఫినిటీ-V డిస్ప్లేతో వస్తుంది. మీడియాటెక్ డైమెన్షన్ 720 SOC, 4GB / 6GB RAM మరియు 64GB / 128GB స్టోరేజ్, UI 3.1, 48MP క్వాడ్-కెమెరా సిస్టమ్, 13MP సెల్ఫీ కెమెరా మరియు 5000mAh కూడా అందించబడింది.
    Flipkart Black Friday Sale: ఫ్లిప్‌కార్ట్‌లో బ్లాక్ ఫ్రైడే సేల్... ఈ 10 రియల్‌మీ స్మార్ట్‌ఫోన్లపై భారీ తగ్గింపు

    7) Oppo F19S:   Oppo మోడల్ FHD + రిజల్యూషన్, 6GB RAM, Android 11 మరియు ప్రొప్రైటరీ ఫాస్ట్ ఛార్జింగ్, 5000mAh బ్యాటరీ, 6.43-అంగుళాల డిస్ప్లే, 48MP ట్రిపుల్ కెమెరా సెటప్ మరియు 16MP సెల్ఫీ కెమెరా సెన్సార్‌తో వస్తుంది.
    8) OnePlus 9: స్మార్ట్‌ఫోన్ 120 Hz రిఫ్రెష్ రేట్‌తో ఫ్లూయిడ్ AMOLED డిస్‌ప్లేతో వస్తుంది, స్నాప్‌డ్రాగన్ 888 SoC, 4500mAh బ్యాటరీతో 48 MP Sony IMX 789 సెన్సార్ మరియు 16 MP కెమెరా.
    Redmi Note 11 4G: రెడ్​మీ నోట్​ 11 4జీ స్మార్ట్‌ఫోన్ లాంచ్.. కేవలం రూ. 12 వేల లోపే 50 ఎంపీ కెమెరా, అదిరిపోయే ఫీచర్లు

    9) Redmi Note 10 Pro Max: ఈ మోడల్ 108 MP Samsung HM2 కెమెరా సెన్సార్‌తో వస్తుంది. మహిళలకు ఈ ఫోన్ బాగుంటుంది.
    10) Samsung Galaxy M52 5G: ఈ ఫోన్‌లో FHD + రిజల్యూషన్‌తో 6.70-అంగుళాల డిస్‌ప్లే, 1.8 GHz ఆక్టా-కోర్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 778G ప్రాసెసర్, 5000 mAh బ్యాటరీ, 64MP ప్రధాన సెన్సార్ మరియు 32MP సెల్ఫీ సెన్సార్ ఉన్నాయి.
    Published by:Nikhil Kumar S
    First published:

    Tags: Smartphone, Smartphones

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు