Home /News /technology /

HERE IS THE LIST OF BEST SELLING 5G SMARTPHONES UNDER RS 20000 TO BUY IN INDIA NS GH

Best 5G Smartphones: బెస్ట్ 5G ఫోన్ కొనాలనుకుంటున్నారా? మార్కెట్లో రూ.20 వేలలో లభిస్తున్నవి ఇవే.. ఓ లుక్కేయండి

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ప్రస్తుతం ఇండియాలో 5G ఫోన్ల (5G Smartphones) హవా నడుస్తోంది. 5G సామర్థ్యంతో అన్ని ఫోన్ తయారీ కంపెనీలు మిడ్-రేంజ్ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేశాయి. మీరు రూ.20 వేలలో బెస్ట్ 5G ఫోన్ కోసం చూస్తుంటే.. ఈ టాప్ ఫోన్లను సెలక్ట్ చేసుకోవచ్చు. ఈ లిస్ట్‌ పరిశీలిద్దాం.

ఇంకా చదవండి ...
ప్రస్తుతం ఇండియాలో 5G ఫోన్ల (5G Smartphones) హవా నడుస్తోంది. 5G సామర్థ్యంతో అన్ని ఫోన్ తయారీ కంపెనీలు మిడ్-రేంజ్ స్మార్ట్‌ఫోన్‌ను (Smartphone) లాంచ్ చేశాయి. మీరు రూ.20 వేలలో బెస్ట్ 5G ఫోన్ కోసం చూస్తుంటే.. ఈ టాప్ ఫోన్లను సెలక్ట్ చేసుకోవచ్చు. ఈ లిస్ట్‌ పరిశీలిద్దాం.

Vivo T1
ఈ ఫోన్ ధర రూ. 15,990. ఈ డివైజ్ 6.58-అంగుళాల (2408 × 1080 పిక్సెల్ల్స్) పూర్తి HD+ 120Hz LCD స్క్రీన్‌తో వస్తుంది. ఆక్టా కోర్ స్నాప్‌డ్రాగన్ 695 8nm చిప్‌తో పనిచేస్తుంది. 128GB UFS 2.2 స్టోరేజ్‌తో 4GB / 6GB / 8GB LPDDR4x RAM దీని సొంతం. ఇతర ఫీచర్లలో ఫన్ టచ్ OS 12.0తో ఆండ్రాయిడ్ 11, 50MP + 2MP + 2MP రియర్ కెమెరా సెటప్, 16MP ఫ్రంట్ కెమెరా, 5,000 mAh సాధారణ బ్యాటరీ వంటివి ఉన్నాయి.
iPhone Offer: రియల్‌మీ, రెడ్‌మీ, సాంసంగ్ ఫోన్ ధరకే ఐఫోన్... ఫ్లిప్‌కార్ట్‌లో డిస్కౌంట్ ఆఫర్

OnePlus Nord CE 2 Lite 5G
ఈ ఫోన్ ధర రూ. 19,999. ఇది 6.59-అంగుళాల (2412 x 1080 పిక్సెల్స్) ఫుల్ HD+ LCD స్క్రీన్‌తో వస్తుంది. ఆక్టా కోర్ స్నాప్‌డ్రాగన్ 695 8nm చిప్‌తో పనిచేస్తుంది. 128GB (UFS 2.2) స్టోరేజ్, 6GB / 8GB LPDDR4X RAM, ఆక్సిజన్ OS 12.1తో నడిచే ఆండ్రాయిడ్ 12, 64MP + 2MP + 2MP రియర్ కెమెరా సెటప్, 16MP ఫ్రంట్ కెమెరా, 5,000 mAh బ్యాటరీ వంటి ఫీచర్లతో నార్డ్ సీఈ2 లైట్ ఫోన్ రిలీజ్ అయింది.
Motorola Offers: మోటోరోలా స్మార్ట్‌ఫోన్లపై అదిరిపోయే ఆఫర్స్... 120Hz డిస్‌ప్లే, 108MP కెమెరా, మరెన్నో ఫీచర్స్

POCO X4 Pro
పోకో X4 ప్రో స్మార్ట్‌ఫోన్ ధర రూ. 18,999. ఇది 6.67-అంగుళాల FHD+ (1080×2400 పిక్సెల్స్) AMOLED డిస్‌ప్లేతో వస్తుంది. ఆక్టా కోర్ స్నాప్‌డ్రాగన్ 695 8nm మొబైల్ ప్లాట్‌ఫారమ్, 6GB LPDDR4X RAM, 128GB UFS 2.2 ఇంటర్నల్ స్టోరేజ్, 256GB UFS 2.2 ఇంటర్నల్ స్టోరేజ్‌తో 8GB LPDDR4X RAM, ఆండ్రాయిడ్ 11 బేస్డ్ MIUI 13, 108MP + 8MP + 2MP రియర్ కెమెరాలు, 16MP ఫ్రంట్ కెమెరా, 5,000 mAh బ్యాటరీ, ఇతర ఫీచర్లతో ఫోన్ లాంచ్ అయింది.

Xiaomi Redmi Note 11 Pro Plus
ఈ ఫోన్ రూ. 19,999కే లభిస్తోంది. ఇది 6.67-అంగుళాల FHD+ (1080×2400 పిక్సెల్స్) AMOLED డిస్‌ప్లేతో ఆకట్టుకుంటుంది. ఆక్టా కోర్ స్నాప్‌డ్రాగన్ 695 8nm చిప్, 128GB UFS 2.2 ఇంటర్నల్ స్టోరేజ్, 6GB LPDDR4X RAM, ఆండ్రాయిడ్ 11 బేస్డ్ MIUI 13, 108MP + 8MP + 2MP రియర్ కెమెరా సెటప్, 16MP ఫ్రంట్ కెమెరా , 5,000 mAh బ్యాటరీ వంటి స్పెసిఫికేషన్లతో నోట్ 11 ప్రో ప్లస్ ఫోన్ కస్టమర్ల దృష్టిని ఆకర్షిస్తోంది.

iQOO Z6 5G
ఈ స్మార్ట్‌ఫోన్ ధర రూ. 17,999. 6.58-అంగుళాల (2408×1080 పిక్సెల్స్) ఫుల్ HD+ LCD స్క్రీన్, ఆక్టా కోర్ స్నాప్‌డ్రాగన్ 695 8nm మొబైల్ ప్లాట్‌ఫారమ్, 128GB (UFS 2.1) స్టోరేజ్‌తో 4GB / 6GB / 8GB LPDDR4x RAM, ఆండ్రాయిడ్ 12 బేస్డ్ ఫన్‌టచ్ OS 12, 50MP + 2MP + 2MP రియర్ కెమెరాలు, 16MP ఫ్రంట్ కెమెరా, 5,000 mAh బ్యాటరీ.. వంటి ఫీచర్లతో ఈ ఫోన్ యూజర్లకు బెస్ట్ ఎక్స్‌పీరియన్స్ అందిస్తోంది.

Realme 9 Pro
రియల్‌మీ 9 ప్రో స్మార్ట్‌ఫోన్ ధర రూ. 17,999. ఇది 6.6-అంగుళాల (2400×1080 పిక్సెల్స్) ఫుల్ HD+ LCD స్క్రీన్‌తో వస్తుంది. ఆక్టా కోర్ స్నాప్‌డ్రాగన్ 695 8nm చిప్ ఇందులో ఉంటుంది. 128GB (UFS 2.2) స్టోరేజ్‌తో 6GB / 8GB LPDDR4x RAM, 64MP + 8MP + 2MP రియర్ కెమెరాలు, 16MP ఫ్రంట్ కెమెరా, 5,000 mAh బ్యాటరీ వంటి ఫీచర్లు ఈ ఫోన్‌లో ఉన్నాయి.
Published by:Nikhil Kumar S
First published:

Tags: 5G Smartphone, Smartphones

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు