Home /News /technology /

HERE IS THE LIST OF BEST RECHARGE PLANS UNDER 300 RUPEES FROM JIO AIRTEL AND VODAFONE NS

Recharge Plans Under Rs 300: రూ.300లోపు ధరకే బెస్ట్ రీఛార్జ్ ప్లాన్లు.. ఓ లుక్కేయండి

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

అగ్ర టెలికాం కంపెనీలు అయిన Jio, Airtel, Vodafone Idea వంటి కంపెనీలు తక్కువ ధరకే అద్భుతమైన ఇంటర్నెట్, అపరిమిత వాయిస్ కాలింగ్ మరియు SMSలను వినియోగదారులకు అందిస్తున్నాయి.

    కస్టమర్లను ఆకర్షించడమే లక్ష్యంగా టెలికాం కంపెనీలు పోటీలు పడీ ఆఫర్లను అందిస్తున్నాయి. మెరుగైన రీఛార్జ్ ప్లాన్‌లను అందిస్తున్నాయి. అగ్ర టెలికాం కంపెనీలు అయిన Jio, Airtel, Vodafone Idea వంటి కంపెనీలు తక్కువ ధరకే అద్భుతమైన ఇంటర్నెట్, అపరిమిత వాయిస్ కాలింగ్ మరియు SMSలను వినియోగదారులకు అందిస్తున్నాయి. మారిన ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో అనేక మంది కస్టమర్‌లు తక్కువ ధరకు నెల ప్లాన్ల కోసం ఎదురు చూస్తున్నారు. మీరు కూడా అలాంటి ప్లాన్లు కావాలంటే.. Jio, Airtel, Vodafone Idea అందించే 28 రోజుల వ్యాలిడిటీ రూ.300 కంటే తక్కువ ధరకు అందించే ప్లాన్ల వివరాలు మీకు అందిస్తున్నాము.

    Jio Rs.249 Plan: రిలయన్స్ జియో తన వినియోగదారుల కోసం రూ. 249 రీఛార్జ్ ప్లాన్‌ను అందిస్తుంది. ఈ రీఛార్జ్ ప్లాన్ యొక్క వ్యాలిడిటీ 23 రోజులు. ఈ ప్లాన్ ను ఎంచుకున్న వినియోగదారులకు నిత్యం 2GB డేటా లభిస్తుంది. ఇంకా.. అపరిమిత వాయిస్ కాలింగ్, ప్రతిరోజూ 100 SMSలతో పాటు JioTv, JioCinema వంటి Jio యాప్‌లకు ఉచిత సబ్క్రిప్షన్ లభిస్తుంది.
    Flipkart 5G Smartphone Offer: ఫ్లిప్‌కార్ట్ లో రూ.299కే 5G స్మార్ట్​ఫోన్.. ఈ బంపరాఫర్ కోసం ఇలా బుక్ చేయండి

    Airtel Rs.265 Plan: ఎయిర్టెల్ అందిస్తున్న ఈ ప్లాన్ వ్యాలిడిటీ 28 రోజులు. మరియు ఈ ప్లాన్‌ ఎంచుకున్న వినియోగదారులకు నిత్యం 1GB డేటా లభిస్తుంది. ఇంకా.. కస్టమర్లు నిత్యం 100 SMSలతో పాటు అన్ లిమిటెడ్ కాలింగ్ సదుపాయం లభిస్తుంది. అమెజాన్ ప్రైమ్ వీడియో (మొబైల్ ఎడిషన్) ప్రయోజనాన్ని కూడా పొందవచ్చు. ఇంకా.. Airtel యొక్క రూ. 239 ప్లాన్‌లో 1.5GB డేటా మరియు 28 రోజుల చెల్లుబాటు అందుబాటులో ఉంది.
    Best Smartphones Under Rs.15000: రూ. 15 వేల ధరకు మూడు బెస్ట్ స్మార్ట్‌ఫోన్లు.. ఓ లుక్కేయండి

    Vodafone-Idea: టెలికాం కంపెనీ Vodafone-Idea తన కస్టమర్ల కోసం రూ. 299 రీఛార్జ్ ప్లాన్‌ను ప్రారంభించింది. ఈ ప్లాన్ వాలిడిటీ కూడా 28 రోజులు. ఈ ప్లాన్‌లో ప్రతిరోజూ అపరిమిత వాయిస్ కాలింగ్ మరియు 100 SMSలు అందుబాటులో ఉన్నాయి. ఇంకా 1.5 జీబీ డేటా లభిస్తుంది.
    Published by:Nikhil Kumar S
    First published:

    Tags: AIRTEL, Airtel recharge plans, Jio, Vodafone Idea

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు