Home /News /technology /

HERE IS THE LIST OF BEST BUDGET SMARTPHONES PRICED UNDER RS 5000 FROM SAMSUNG MICROMAX ITEL NS

Smartphones Under Rs 5000: ఈ స్మార్ట్‌ఫోన్‌ల ధర కేవలం రూ. 5 వేలలోపే.. లిస్ట్ లో Samsung, Micromax కంపెనీల ఫోన్లు.. వివరాలివే

ఈ స్మార్ట్‌ఫోన్‌ల ధర కేవలం రూ. 5 వేలలోపే.. లిస్ట్ లో Samsung, Micromax కంపెనీల ఫోన్లు..

ఈ స్మార్ట్‌ఫోన్‌ల ధర కేవలం రూ. 5 వేలలోపే.. లిస్ట్ లో Samsung, Micromax కంపెనీల ఫోన్లు..

తక్కువ బడ్జెట్లో స్మార్ట్ ఫోన్ (Budget Smartphone) కొనాలని మీరు ప్లాన్ చేస్తున్నారా? అయితే, మీకో శుభవార్త. సాంసంగ్(Samsung), మైక్రోమాక్స్ (Micromax) తో పాటు పలు కంపెనీలు రూ. 5 వేలలోపు బడ్జెట్లో బెస్ట్ స్మార్ట్ ఫోన్లు అందిస్తున్నాయి. ఆ వివరాలు మీ కోసం..

ఇంకా చదవండి ...
    ప్రస్తుతం ప్రపంచమంతా స్మార్ట్ ఫోన్ (Smartphone) గుప్పిట్లోకి వచ్చేసింది. అనేక అవసరాలను ఒక్క క్లిక్ తో స్మార్ట్ ఫోన్ తీర్చేస్తోంది. ముఖ్యంగా ఈ కరోనాతో (Corona) స్మార్ట్ ఫోన్ అవసరం మరింతగా పెరిగింది. అంతా ఆన్లైన్లోనే సాగే రోజులు వచ్చాయి. కొత్త కొత్త యాప్ లు అనేక రకాల సేవలను మనకు అందిస్తున్నాయి. మార్కెట్లోకి ప్రతీ నెలలో వందల సంఖ్యలో నూతన స్మార్ట్ ఫోన్లు విడుదల అవుతున్నాయి. అయితే స్మార్ట్ ఫోన్ అనగానే కనీసం పది వేల ధర ఉంటుందని అంతా భావిస్తారు. అయితే ఐదు, ఆరు వేలల్లో కూడా స్మార్ట్ ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. అలాంటి స్మార్ట్ ఫోన్ల వివరాలు మీ కోసం..

    Samsung Galaxy M01 Core: తక్కువ ధరలో లభించే బెస్ట్ స్మార్ట్‌ఫోన్ ఇది. ఈ ఫోన్ 5.3 అంగుళాల HD ప్లస్ డిస్‌ప్లేను కలిగి ఉంది. మీరు ఈ ఫోన్‌ను నలుపు, నీలం మరియు ఎరుపు రంగుల్లో లభిస్తుంది. Samsung Galaxy M01 కోర్ స్మార్ట్‌ఫోన్‌లో 3000 mAh బ్యాటరీ ఉంటుంది. ఇందులో MediaTek Quadcore 6739 ప్రాసెసర్ ఉంది. ఫ్లాష్ లైట్‌తో 8-మెగాపిక్సెల్ వెనుక కెమెరా వైపు ఉంది. ఇంకా సెల్ఫీల కోసం 5 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా కూడా ఈ ఫోన్లో ఉంది. ఈ ఫోన్ ధర విషయానికి వస్తే Samsung Galaxy M01 కోర్ ధర స్పెసిఫికేషన్ల ఆధారంగా రూ.5199 నుంచి రూ.7500 రూపాయల వరకు ఉంది.
    Flipkart New Year Offers: ఫ్లిప్‌కార్ట్ లో కేవలం రూ. 5 వేలకే Smasung, Mi స్మార్ట్ టీవీలు.. న్యూఇయర్ సేల్ లో బంపరాఫర్లు

    Micromax Bharat 2 Plus (మైక్రోమ్యాక్స్ భారత్ 2 ప్లస్): బడ్జెట్ ఫోన్‌లో మైక్రోమ్యాక్స్ పేరు అగ్రస్థానంలో ఉంటుంది. మైక్రోమ్యాక్స్ భారత్ 2 ప్లస్ స్మార్ట్‌ఫోన్ రూ. 3599 ధరకు అందుబాటులో ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ 1GB RAM మరియు 8GB స్టోరేజ్ తో లభిస్తుంది. ఈ ఫోన్ డిస్‌ప్లే 4 అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంది. ఫోన్‌లో 5 మెగాపిక్సెల్ వెనుక కెమెరా, సెల్ఫీ కోసం 2 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. ఈ ఫోన్‌లో 1600 mAh బ్యాటరీ ఉంది.
    Samsung Galaxy M52 5G: Samsung Galaxy M52 ధరలు భారీగా తగ్గించేశారు...ఎంత తగ్గిందో తెలిస్తే షాక్ తింటారు..

    Itel A25 Pro: Itel యొక్క A-24 Pro ఫోన్‌ను రూ. 4999కే సొంతం చేసుకోవచ్చు. ఈ ఫోన్ 2GB RAM మరియు 32GB స్టోరేజ్ కెపాసిటీని కలిగి ఉంటుంది. స్టోరేజీని 32GB వరకు పెంచుకోవచ్చు. ఇది 3020 mAh బ్యాటరీని కలిగి ఉంది. ఈ ఫోన్‌లో 5MP బ్యాక్ కెమెరా, 2MP ఫ్రంట్ కెమెరా ఉంటుంది. 5-అంగుళాల HD డిస్‌ప్లేతో కలిగిన డ్యూయల్ సిమ్ ఫోన్ ఇది
    Published by:Nikhil Kumar S
    First published:

    Tags: Micromax, Samsung, Samsung Galaxy, Smartphone

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు