హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Storage monitoring apps: స్మార్ట్‌ఫోన్ లో అవసరంలేని ఫోటోలను గుర్తించే టాప్-5 యాప్స్‌ ఇవే.. ఓ లుక్కేయండి

Storage monitoring apps: స్మార్ట్‌ఫోన్ లో అవసరంలేని ఫోటోలను గుర్తించే టాప్-5 యాప్స్‌ ఇవే.. ఓ లుక్కేయండి

స్మార్ట్‌ఫోన్ లో అవసరంలేని ఫోటోలను గుర్తించే టాప్-5 యాప్స్‌ ఇవే.. ఓ లుక్కేయండి

స్మార్ట్‌ఫోన్ లో అవసరంలేని ఫోటోలను గుర్తించే టాప్-5 యాప్స్‌ ఇవే.. ఓ లుక్కేయండి

గూగుల్ ఇప్పుడు అన్ లిమిటెడ్ స్టోరేజీ ఇవ్వడం లేదు. దీంతో ల్యాప్‌ట్యాప్‌లు, హార్డ్ డిస్క్‌లలో ఫోటోలు, వీడియోలను సేవ్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో పాటు ఇతర క్లౌడ్ స్టోరేజ్ ఆప్షన్లు కూడా ఉన్నాయి. కానీ..

  స్మార్ట్‌ఫోన్ల (Smartphone) వినియోగదారులు ఫోటోల స్టోరేజ్ కోసం గూగుల్ ఫోటోస్ (Google Photos) యాప్‌ను ఎక్కువగా వాడుతుంటారు. కానీ గూగుల్ (Google) ఇప్పుడు అన్ లిమిటెడ్ స్టోరేజీ ఇవ్వడం లేదు. దీంతో ల్యాప్‌ట్యాప్‌లు, హార్డ్ డిస్క్‌లలో ఫోటోలు, వీడియోలను సేవ్ చేసుకోవాల్సిన సమయం వచ్చిందని వినియోగదారులు చర్చించుకుంటున్నారు. దీంతో పాటు ఇతర క్లౌడ్ స్టోరేజ్ ఆప్షన్లు కూడా ఉన్నాయి. కానీ ఇవన్నీ ఆన్‌లైన్ స్టోరేజీని పరిమితంగానే అందిస్తున్నాయి. అందువల్ల మనకు అందుబాటులో ఉన్న కొద్దిపాటి స్టోరేజీని జాగ్రత్తగా వాడుకోవాలి. డూప్లికేట్ పోటోలు, బ్లర్ అయినవి, క్వాలిటీ సరిగా లేని వాటిని డిలీట్ చేసుకోవడం ద్వారా స్టోరేజీని సమర్థంగా వాడుకోవచ్చని టెక్ నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి అనవసర ఫోటోలను గుర్తించడానికి కొన్ని యాప్‌లు అందుబాటులో ఉన్నాయి.

  డూప్లికేట్స్ క్లీనర్ (Duplicates Cleaner)

  ఈ ఆండ్రాయిడ్ యాప్ ద్వారా డూప్లికేట్ ఫైల్స్‌ను సులభంగా గుర్తించి డిలీట్ చేసుకోవచ్చు. స్మార్ట్‌ఫోన్‌ స్టోరేజ్‌లోని ఇమేజెస్, ఆడియో ఫైల్స్, డాక్యుమెంట్లు, వీడియోలు వంటి మీడియా ఫైల్స్‌ను ఈ యాప్ గుర్తించి కస్టమర్లకు చూపిస్తుంది. వీటిని పోల్చి చూస్తూ, ఒకదాని తరువాత మరొక ఫైల్‌ను డిలీట్ చేసుకోవచ్చు. అన్నింటినీ ఒకేసారి సెలక్ట్ చేసి డిలీట్ చేసే ఆప్షన్ కూడా ఉంది.

  Hacking Alert: ఆండ్రాయిడ్ యూజర్లకు హెచ్చరిక.. ఈ 7 యాప్స్ తో డేంజర్.. వెంటనే డిలీట్ చేయండి

  ఫైల్స్ బై గూగుల్ (Files by Google)

  ఈ యాప్‌లో మంచి స్టోరేజ్ మేనేజ్‌మెంట్ ఫీచర్లు ఉన్నాయి. డూప్లికేట్ ఫైల్స్‌ను గుర్తించి డిలీట్ చేయడం, కస్టమర్లు వాడని యాప్స్‌ను గుర్తించడం, కాపీలను బ్యాకప్ చేయడం వంటి ఆప్షన్లకు కస్టమర్లు ఎంచుకోవచ్చు. యూజర్ల స్మార్ట్‌ఫోన్ స్టోరేజీని ఈ యాప్ విశ్లేషించి, సూచనలు ఇచ్చింది. డూప్లికేట్ ఫోటోలు, ఫైల్స్‌ను స్కాన్ చేయడంతో పాటు ఫోటోలు, వీడియోలను ఫోల్డర్ల వారీగా విభజిస్తుంది. ఈ యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకున్న తరువాత కొన్ని పర్మిషన్లకు యాక్సెస్ ఇవ్వాల్సి ఉంటుంది. దీని ద్వారా జంక్ ఇమేజెస్‌ను, వాట్సాప్ మీడియా ఫోల్డర్లను, స్క్రీన్‌షాట్లను, పెద్ద ఫైల్స్‌ను డిలీట్ చేసుకోవచ్చు.

  సీ క్లీనర్ (C Cleaner)

  సీ క్లీనర్ యాప్ సిస్టమ్ ఆప్టిమైజర్‌గా ఉపయోగపడుతుంది. ఇది జంక్‌, రీ క్లెయిమ్ స్పేస్, ర్యామ్‌ను క్లీన్ చేస్తుంది. సిస్టమ్ మానిటర్‌గా సమర్థంగా పనిచేస్తూ సేఫ్ బ్రౌజింగ్‌కు భరోసా ఇస్తుంది. ఈ యాప్‌లో స్టోరేజ్ మేనేజ్‌మెంట్ ఫీచర్లు కూడా ఉన్నాయి. దీంట్లో ఉండే మీడియా ఓవర్‌వ్యూ ఆప్షన్‌ ఒకేలా ఉన్న ఫోటోలను, నాణ్యత సరిగా లేని ఫోటోలను గుర్తించి కస్టమర్లకు సూచిస్తుంది.

  రెమో డూప్లికేట్ ఫోటో రిమూవర్ (Remo Duplicate Photo Remover)

  దీంట్లో మంచి ఇమేజ్ మేనేజ్‌మెంట్ ఫీచర్లు ఉన్నాయి. వీటి సహాయంతో డూప్లికేట్ ఫైల్స్‌ను డిలీట్ చేసుకోవచ్చు. డూప్లికేట్, సిమిలర్ ఫోటోలను ఇది గుర్తిస్తుంది. వీటి నుంచి అవసరం లేని ఫోటోలను సులభంగా డిలీట్ చేసుకోవచ్చు.

  నాక్స్ క్లీనర్ (Nox cleaner)

  ఈ యాప్‌ ద్వారా స్మార్ట్‌ఫోన్ సిస్టమ్ జంక్‌ క్లీన్ చేసుకోవచ్చు. ఇది స్టోరేజ్‌ను మానిటర్ చేసి, ఎలాంటి ఫైల్స్ డిలీట్ చేయవచ్చో సూచిస్తుంది. దీంట్లో జంక్ క్లీనర్, ఫోటో బూస్టర్, యాంటీవైరస్, సీపీయూ కూలర్, ఇమేజ్ మేనేజర్ వంటి ఎన్నో ఫీచర్లు ఉన్నాయి.

  Published by:Nikhil Kumar S
  First published:

  Tags: 5G Smartphone, Google photos, Smartphone

  ఉత్తమ కథలు