Home /News /technology /

HERE IS THE LIST OF 3 BEST SMARTPHONES AVAILABLE UNDER RS 15000 NS

Best Smartphones Under Rs.15000: రూ. 15 వేల ధరకు మూడు బెస్ట్ స్మార్ట్‌ఫోన్లు.. ఓ లుక్కేయండి

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Bust Budget Smartphones: తక్కువ ధరకు బెస్ట్ స్మార్ట్ ఫోన్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే.. రూ. 15 వేల లోపు ధరకే లభిస్తున్న ఈ బెస్ట్ స్మార్ట్ ఫోన్లపై ఓ లుక్కేయండి.

    ప్రస్తుతం ప్రపంచమంతా స్మార్ట్ ఫోన్ల (Smartphones) చుట్టూ తిరుగుతోంది. నిత్యం కొత్త కొత్త ఫీచర్లతో కూడిన స్మార్ట్ ఫోన్లు మార్కెట్లోకి విడుదల అవుతున్నాయి. అయితే.. తక్కువ ధరలో బెస్ట్ ఫీచర్లు ఉన్న స్మార్ట్ ఫోన్ల కోసం అనేక మంది వెతుకుతున్నారు. మార్కెట్లోని అలాంటి స్మార్ట్ ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. ఈ నేపథ్యంలో రూ. 15 వేలలోపు ధరతో లభిస్తున్న బెస్ట్ స్మార్ట్ ఫోన్ల వివరాలు మీ కోసం...

    Samsung Galaxy F22: ఈ ఫోన్ ధర రూ.14,999. ఈ ఫోన్ 6.4-అంగుళాల sAMOLED 90Hz డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఫోటోగ్రఫీ కోసం.. ఈ ఫోన్లో 48-మెగాపిక్సెల్ క్వాడ్ కెమెరా ఉంటుంది. ఈ ఫోన్లో 6000mAh సామర్థ్యం కలిగిన భారీ బ్యాటరీని ఉంటుంది. 15W ఫాస్ట్ ఛార్జింగ్‌కు ఈ ఫోన్ సపోర్ట్ చేస్తుంది. Samsung Galaxy F22 రెండు రంగులు మరియు రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంది. మీరు దీన్ని డెనిమ్ బ్లాక్ లేదా డెనిమ్ బ్లూలో కొనుగోలు చేయవచ్చు. 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ కెపాసిటీ ఉన్న ఫోన్ ధర రూ.12,999 కాగా.. 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.14,999.
    Best Budget Smartphone: మార్కెట్లోకి మరో బడ్జెట్ ఫోన్.. రూ.5999కే 4000mAh స్మార్ట్ ఫోన్.. వివరాలివే

    Samsung Galaxy M32: ఈ స్మార్ట్ ఫోన్ ధర రూ.14,999. ఈ ఫోన్ 6.4-అంగుళాల Full HD + sAMOLED 90Hz డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఈ ఫోన్‌లో 6000mAh భారీ బ్యాటరీ ఉంటుంది. ఇది 15W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. 4G కనెక్టివిటీ ఉన్న ఈ ఫోన్ లైట్ బ్లూ మరియు బ్లాక్ కలర్ లో అందుబాటులో ఉంటుంది. 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ కెపాసిటీ ఉన్న ఫోన్ ధర రూ.16,999. 4 జీబీ ర్యామ్, 64 జీబీ కెపాసిటీ ఉన్న ఫోన్ ధర రూ.14,999.
    Flipkart Cooling Days Sale: ఫ్లిప్‌కార్ట్ లో ఈ ఫ్రిడ్జ్ లు, ఏసీలు, ఫ్యాన్లు, కూలర్లపై భారీగా డిస్కౌంట్.. కూలింగ్ డేస్ సేల్ లో ఆఫర్ల పండగ

    POCO M4 Pro 5G: Poco X4 Pro 5G స్మార్ట్‌ఫోన్ ధర రూ.14,999. ఫ్లిప్‌కార్ట్ రూ.2000 ప్రత్యేక తగ్గింపును అందిస్తోంది. ఈ ఫోన్ కూల్ బ్లూ, పోకో ఎల్లో మరియు పవర్ బ్లాక్ అనే మూడు ఆకర్షణీయమైన కలర్లలో లభిస్తుంది. బెస్ట్ సౌండ్ కోసం డ్యూయల్ స్టీరియో స్పీకర్లు ఈ స్మార్ట్ ఫోన్లో ఉన్నాయి. ఈ ఫోన్ 4 GB RAM+64 GB స్టోరేజ్ ను కలిగి ఉంటుంది.
    Published by:Nikhil Kumar S
    First published:

    Tags: 5G Smartphone, POCO, Samsung, Smartphones

    తదుపరి వార్తలు