HERE IS THE EASY PROCESS TO LOCK YOUR FACE BOOK PROFILE IN ANDROID AND IPHONE PRN GH
Facebook: ఆండ్రాయిడ్, ఐఫోన్లలో ఫేస్ బుక్ ప్రొఫైల్ ఎలా లాక్ చేయాలి..? తెలుసుకోండి..
(ప్రతీకాత్మక చిత్రం)
ప్రపంచంలోనే అతిపెద్ద సోషల్ మీడియా (Social Media) ప్లాట్‌ఫాం ఫేస్ బుక్ (Face Book). ఫేస్బుక్ ని కోట్లాది మంది యూజర్లు (Facebook Users) వినియోగిస్తున్నారు. నిత్యం ఫేస్ బుక్ లో చాటింగ్ (Face Book Chatting), ఫోటోలు, తమ అభిప్రాయాలను షేర్ చేస్తుంటారు.
Facebook Profile Lock: ప్రపంచంలోనే అతిపెద్ద సోషల్ మీడియా (Social Media) ప్లాట్‌ఫాం ఫేస్ బుక్ (Facebook). ఫేస్బుక్ ని కోట్లాది మంది యూజర్లు వినియోగిస్తున్నారు. నిత్యం ఫేస్ బుక్ లో చాటింగ్ (Facebook Chatting), ఫోటోలు, తమ అభిప్రాయాలను షేర్ చేస్తుంటారు. అయితే ఫేస్ బుక్ ప్రొఫైల్ డీటెయిల్స్ ప్రైవేట్ లో ఉంచుకోకపోతే.. మీ సమాచారం ఇతరులకు తెలిసే ప్రమాదం ఉంది. ఫోన్ నంబర్, ఫొటో, అడ్రస్సు, ఈ-మెయిల్ అడ్రస్ వంటి పర్సనల్ ఇన్ఫర్మేషన్ అజ్ఞాత వ్యక్తులకు కనిపించకుండా జాగ్రత్త పడటం చాలా ముఖ్యం. వ్యక్తిగత సమాచారం లీకైతే ఇబ్బందులు ఎదుర్కొవలసి వస్తుంది. అయితే ఫేస్ బుక్ అందిస్తున్న ఒక సింపుల్ ఆప్షన్ తో సైబర్ నేరగాళ్ల నుంచి మనల్ని మనం కాపాడుకోవచ్చు. ప్రొఫైల్‌ని లాక్ చేయడం ద్వారా అపరిచితులు మీ గురించి ఎలాంటి సమాచారాన్ని తెలుసుకోకుండా నివారించవచ్చు.
టైమ్ లైన్ లోని న్యూ పోస్ట్స్, అబౌట్ పేజీ, ఫొటోలు సురక్షితంగా ఉంచుకోవచ్చు. లాక్ చేసిన ప్రొఫైల్‌లోని అన్ని "పబ్లిక్" పోస్ట్స్ కేవలం ఫ్రెండ్స్ లిస్టులో ఉన్న వారికే కనిపిస్తాయి. ఇప్పటికే చాలా మంది యూజర్లు ప్రొఫైల్ లాక్ ఆప్షన్ ను యూజ్ చేస్తున్నారు. ఇది ఎలా యూజ్ చేయాలో కొందరికి తెలియకపోవచ్చు. అదెలాగో ఇప్పుడు చూద్దాం.
ఆండ్రాయిడ్ ఫోన్ యూజర్లు:
స్టెప్ 1: ఫేస్బుక్ యాప్ ఓపెన్ చేసి.. యాడ్ స్టోరీ పక్కనే ఉన్న త్రీ డాట్స్ మెనూ ఐకాన్ పై క్లిక్ చేయండి.
స్టెప్ 2: లాక్ ప్రొఫైల్ (Lock Profile) ఆప్షన్ పై క్లిక్ చేయండి. తరువాత మీకు మీ ప్రొఫైల్ ను ఎలా లాక్ చేసుకోవాలో ఇన్స్ట్రక్షన్స్ కనిపిస్తాయి.
స్టెప్ 3: ఆ ఇన్స్ట్రక్షన్స్ అన్ని ఫాలో అయ్యాక.. “You Locked Your Profile" అనే ఒక పాప్-అప్ నోటిఫికేషన్ కనిపిస్తుంది. దాంతో మీ ప్రొఫైల్ లాక్ అయిపోతుంది. ఇప్పుడు అజ్ఞాత వ్యక్తులు ఎవరూ కూడా మీ సమాచారాన్ని చూడటానికి వీలుపడదు.
* ఐఫోన్ లో ప్రొఫైల్‌ను ఎలా లాక్ చేయాలి..?
ప్రస్తుతానికి, ఐఓఎస్ ఫేస్బుక్ యాప్‌లో ప్రొఫైల్‌లను లాక్ చేయడానికి ఏ ఆప్షన్ అందుబాటులో లేదు. కానీ వెబ్ వెర్షన్‌ను యాక్సెస్ చేయడం ద్వారా ప్రొఫైల్ లాక్ చేయొచ్చు. యాప్‌లో కాకుండా ఏదైనా బ్రౌజర్ లో మీ అకౌంట్ ను ఫేస్బుక్ వెబ్ వెర్షన్ లో లాగిన్ అవ్వండి. తర్వాత ఈజీగా ప్రొఫైల్ లాక్ చేసుకోవచ్చు.
* డెస్క్ టాప్ లో ప్రొఫైల్ ని లాక్ చేయడం ఎలా..?
స్టెప్-1: https://www.facebook.com కి వెళ్లి, మీ ప్రొఫైల్‌పై క్లిక్ చేయండి.
స్టెప్-2: URLలో, “www” ని క్లియర్ చేసి “m” అనే లెటర్ టైపు చేసి ఎంటర్ చేయండి. URL... m.facebook.com/profilename.. ఇలా ఉండాలి. ఈ లింక్ డెస్క్‌టాప్ బ్రౌజర్‌లోనే మొబైల్ సైట్‌ను తెరుస్తుంది.
స్టెప్-3: ఎడిట్ యువర్ ప్రొఫైల్ బటన్ పక్కనే ఉన్న 3-డాట్స్ మెనూపై క్లిక్ చేయండి.
స్టెప్-4: 'లాక్ ప్రొఫైల్'ను చేసుకొని ఓకే(OK) పై క్లిక్ చేయండి. ఇప్పుడు లాక్ యువర్ ప్రొఫైల్ ఆప్షన్ పై క్లిక్ చేయండి.
ఒకవేళ భవిష్యత్తులో మీరు మీ ప్రొఫైల్ అన్ లాక్ (Unlock) చేయాలనుకుంటే పైన పేర్కొన్న స్టెప్స్ ఫాలో అయ్యి అన్ లాక్ ఆప్షన్ పై క్లిక్ చేస్తే సరిపోతుంది.
Published by:Purna Chandra
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.