హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Whatsapp: వాట్సాప్‌ వాడే వారికి భారీ ఊరట.. ఇకపై..

Whatsapp: వాట్సాప్‌ వాడే వారికి భారీ ఊరట.. ఇకపై..

 Whatsapp: వాట్సాప్‌ వాడే వారికి భారీ ఊరట.. ఈ ఫీచర్లతో బోలెడు బెనిఫిట్స్!

Whatsapp: వాట్సాప్‌ వాడే వారికి భారీ ఊరట.. ఈ ఫీచర్లతో బోలెడు బెనిఫిట్స్!

Whatsapp News | యూజర్లు చాలా కాలం నుంచి గ్రూప్ సభ్యుల సంఖ్యను పెంచాలనే రిక్వెస్ట్‌లు వస్తున్నాయని పేర్కొంది. అందుకే ఇప్పుడు 512 సభ్యులతో కూడిన వాట్సాప్ గ్రూప్‌లను క్రియేట్ చేసుకోవచ్చని కంపెనీ తెలిపింది.

 • News18 Telugu
 • Last Updated :
 • Hyderabad | Visakhapatnam

  Whatsapp update| దిగ్గజ మెసేజింగ్ యాప్ వాట్సాప్ (Whatsapp) మూడు రకాల సర్వీసులు అందుబాటులోకి తీసుకువచ్చింది. దీని వల్ల కస్టమర్లకు మరింత మెరుగైన సేవలు అందుబాటులోకి వచ్చాయని చెప్పుకోవచ్చు. రియాక్షన్స్, 2 జీబీ ఫైల్ షేరింగ్, 512 గ్రూప్స్ వంటి ఫీచర్లను అందుబాటులోకి తీసుకువచ్చింది. స్కిన్ టోన్ సెలెక్టర్‌తో సహా పూర్తి ఎమోజి (Emoji) కీబోర్డ్‌తో వాట్సాప్‌లో రియాక్షన్స్ అనేవి మరింత మెరుగవుతున్నాయి. వినియోగదారులు తన కుటుంబం, స్నేహితులతో చాట్ చేస్తున్నప్పుడు తన భావాలను వ్యక్తీకరించడానికి, మరిన్ని మార్గాలను పరిచయం చేయడానికి సంతోషిస్తున్నామని కంపెనీ తెలిపింది.

  ‘వాట్సాప్‌లో కమ్యూనిటీల కోసం గత నెలలో ప్రకటించినట్లుగా, మేము ఇప్పుడు సంస్థలు, వ్యాపారాలు, ఇతర సన్నిహిత సమూహాల కోసం సురక్షితంగా కమ్యూనికేట్ చేయడాని వాట్సాప్‌లో పనులను పూర్తి చేయడానికి రూపొందిస్తున్నాము. మేము ఇప్పటివరకు స్వీకరించిన ఫీడ్‌బ్యాక్ చాలా సానుకూలంగా ఉంది. అనేక కొత్త ఫీచర్‌లను ప్రజల చేతుల్లోకి తీసుకురావడానికి మేము వేచి ఉండలేము’ అని కంపెనీ వివరించింది.

  ఆ భయాలతో కుప్పకూలిన బంగారం ధర.. 2 ఏళ్ల కనిష్టానికి పతనం.. ఇప్పుడు కొనొచ్చా?

  ఎమోజీ రియాక్షన్లు ఇప్పుడు వాట్సాప్ లేటెస్ట్ మొబైల్ యాపలో అందుబాటులో ఉన్నాయి. రియాక్షన్లు అనేవి ఫన్, ఫాస్ట్. రీలోడ్ టైమ్ కూడా చాలా తగ్గుతుంది. అంతేకాకుండా వాట్సాప్ యూజర్లు ఇకపై 2 జీబీ వరకు ఫైల్‌ను షేర్ చేయొచ్చు. ఒకేసారి ఈ పెద్ద సంఖ్యలని వీడియోను సెండ్ చేయొచ్చు. ఎండ్ టు ఎండ్ ఎన్‌క్రిప్షన్ ఉంటుంది. ఇదివరకు ఈ లిమిట్ 100 ఎంబీగా ఉండేది. వైఫై సాయంతో లార్జ్ ఫైల్‌ను సెండ్ చేయడం ఉత్తమం అని కంపెనీ పేర్కొంటోంది.

  ఎస్‌బీఐ కిర్రాక్ ఆఫర్లు.. భారీ క్యాష్‌బ్యాక్, రూ.వేలలో తగ్గింపు!

  అలాగే చాలా మంది నుంచి తమకు మరో రిక్వెస్ట్ వచ్చిందని కంపెనీ చిట్టీ తెలిపింది. యూజర్లు చాలా కాలం నుంచి గ్రూప్ సభ్యుల సంఖ్యను పెంచాలనే రిక్వెస్ట్‌లు వస్తున్నాయని పేర్కొంది. అందుకే ఇప్పుడు 512 సభ్యులతో కూడిన వాట్సాప్ గ్రూప్‌లను క్రియేట్ చేసుకోవచ్చని కంపెనీ తెలిపింది. కొత్త ఫీచర్లతో చాలా మందికి ఊరట కలుగుతుందని చెప్పుకోవచ్చు. అయితే ఈ కొత్త ఫీచర్లు అందరికీ అందుబాటులోకి వచ్చాయో లేదో తెలీదు. అయితే కంపెనీ మాత్రం ఈ సేవలను లాంచ్ చేసినట్లు పేర్కొంటోంది.  కాగా చాలా మంది గతంలో వీడియో షేరింగ్ లిమిట్ వల్ల చాలా ఇబ్బందులు పడేవారు. ఇకపై ఇలాంటి సమస్యలు ఉండవు. 2 జీబీ వరకు వీడియోలను సులభంగానే సెండ్ చేయొచ్చు. అయితే ఇలా చేయడం వల్ల ఇరు వైపులా కస్టమర్లు ఫైల్ అప్‌లోడింగ్, వీడియో డౌన్‌లోడ్‌కు అధిక డేటా ఖర్చు అవుతుంది.

  Published by:Khalimastanvali Khalimastanvali
  First published:

  Tags: Money, Whatsapp, Whatsapp tricks

  ఉత్తమ కథలు