Amazon Prime | ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ ఇటీవల కాలంలో చాలా పాపులర్ అయ్యాయి. చాలా మంది వీటిని ఉపయోగిస్తూ ఉంటారు. స్మార్ట్‌ఫోన్ (Smartphone) లేదంటే స్మార్ట్ టీవీ (Smart TV) ఇలా ఎందులోనైనా వీటిని ఉపయోగించి సినిమాలు, వెబ్ సిరీస్ వంటివి చూడొచ్చు. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్, నెట్‌ఫ్లిక్స్ దగ్గరి నుంచి హాట్‌స్టార్ డిస్నీ వరకు చాలా వరకు ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ అందుబాటులో ఉన్నాయి. ఎలాంటి ఫిక్స్‌డ్ కేబుల్ ఆపరేటర్‌తో పని లేకుండా సులభంగానే ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ ద్వారా వీడియో కంటెంట్ పొందొచ్చు.
ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ సాధారణంగా రెండు రకాలుగా కంటెంట్ పొందుతాయి. సొంతంగా మూవీస్ లేదంటే వెబ్ సిరీస్ వంటివి తీస్తాయి. దీనికి కూడా రూ.కోట్లలో కావాలి. అలాగే సినిమా ప్రొడ్యూసర్ల దగ్గరి నుంచి స్ట్రీమింగ్ రైట్స్ పొందుతాయి. దీనికి కూడా పెద్ద మొత్తం అవసరం అవుతుంది. ఎక్కువ మంది సబ్‌స్క్రైబర్లను పొందటానికి ఎక్కువ మీడియా లైబ్రెరీని కలిగి ఉండటానికి ఓటీటీలు ప్రయత్నిస్తాయి. అందుకే సినిమా రైట్స్, క్రికెట్ మ్యాచ్ స్ట్రీమింగ్ రైట్స్ వంటి వాటిని కొనేందుకు కూడా పోటీ ఉంటుంది.
కొత్త ఏడాది షాక్.. టీవీ ఛానల్స్ ధర పెంపు, కొత్త రేట్లు ఇలా!
కానీ ఓటీటీ సబ్‌స్క్రిప్షన్స్ కోసం యూజర్లు చెల్లించేది రూ.1500 లోపే ఉంటుంది. మరి ఓటీటీ సంస్థలకు కార్యకలాపాలు నిర్వహించడానికి, సినిమాలు తీయడానికి, మూవీస్ స్ట్రీమింగ్ రైట్స్ కొనేందుకు ఎక్కడి నుంచి రాబడి వస్తుంది? ఇలాంటి ప్రశ్నలు మీ మదిలోనూ మెదిలే ఉంటాయి. ఇప్పుడు ప్రశ్నలకు సమాధానం తెలుసుకుందాం. ఓటీటీ ప్లాట్‌ఫ్లామ్స్‌కు రెవెన్యూ 4 మార్గాల్లో వస్తుంది. అవేంటంటే..
ఎస్‌వీఓడీ – సబ్‌స్క్రిప్షన్ వీడియో ఆన్ డిమాండ్. అంటే ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ యూజర్ల నుంచి సబ్‌స్క్రిప్షన్ రూపంలో కొంత మొత్తాన్ని పొందుతాయి. నెట్‌ఫ్లిక్స్ , అమెజాన్ ప్రైమ్, సోనీ లివ్ వంటి పలు రకాల ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ ప్రధానంగా ఈ విధానాన్ని అనుసరిస్తాయి.
ఏవీఓడీ – అడ్వర్టైజింగ్ వీడియో ఆన్ డిమాండ్. ఈ విధానంలో యాడ్స్ ద్వారా ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ డబ్బులు పొందుతాయి. బ్రాండ్లు, కంపెనీల నుంచి యాడ్స్ తీసుకొని, వాటిని వాటి ప్లాట్‌ఫామ్స్‌లో డిస్‌ప్లే చేస్తాయి. దీని ద్వారా వీటికి డబ్బులు వస్తాయి. వూట్, ఎంఎక్స్ ప్లేయర్ వంటివి ప్రధానంగా ఈ విధానాన్ని అనుసరిస్తాయి.
హైబ్రిడ్ – పేరులో ఉన్నట్లు గానే ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ అటు యాడ్స్ రూపంలో, ఇటు యూజర్ల నుంచి సబ్‌స్క్రిప్షన్ రూపంలో రెండు విధాలుగా డబ్బులు పొందుతాయి. హాట్‌స్టార్ డిస్నీ, జీ5 వంటివి ఈ బిజినెస్ మోడల్‌ను అనుసరిస్తాయి.
టీవీఓడీ – ట్రాన్సాక్షన్ వీడియో ఆన్ డిమాండ్. ఈ బిజినెస్ మోడల్‌లో యూజర్లకు రెండు రకాల స్ట్రీమింగ్ ఆప్షన్లు ఉంటాయి. సబ్‌స్క్రైబర్లు వారి అవసరాలకు అనుగుణంగా నచ్చిన దాని చుకోవచ్చు. యాపిల్ ఐట్యూన్స్, అమెజాన్ వీడియో స్టోర్, స్కై బాక్స్ ఆఫీస్ వంటివి ఈ మోడల్‌ను అనుసరిస్తాయి.
కొత్త స్కీమ్ తెచ్చిన బ్యాంక్.. కస్టమర్లకు అదిరే శుభవార్త, రూ.5 వేలు ఉంటే చాలు..
ప్రస్తుతం దేశంలో వివిధ రకాల ప్లాట్‌ఫామ్స్ అందుబాటులో ఉన్నాయి. ఇవి వాటిని నచ్చిన బిజినెస్ మోడళ్లను అనుసరిస్తూ వివిధ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్స్‌ను అందుబాటులో ఉంచాయి. ఇలా డబ్బులు సంపాదిస్తున్నాయి. ఉదాహరణకు అమెజాన్ ప్రైమ్ తీసుకుంటే ఇది ఎస్‌వీఓడీ, టీవీఓడీ, హైబ్రిడ్ బిజినెస్ మోడళ్లను అనుసరిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా చూస్తే అమెజాన్ ప్రైమ్ సబ్‌స్క్రైబర్ల సంఖ్య 20 కోట్లకు పైమాటే. ఇకపోతే హాట్‌స్టార్ డిస్నీ కూడా అతిపెద్ద స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్స్‌లో ఒకటి. దీని సబ్‌స్క్రైబర్ల సంఖ్య 30 కోట్లకు పైనే ఉంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Amazon prime, Disney plus hotstar, Disney+ Hotstar, Netflix, Ott, Ott platform, OTT Streaming