Instagram: పిల్లల భద్రత కోసం ఇన్‌స్టాగ్రామ్ అదిరిపోయే మార్పులు.. కొత్త ఫీచర్లపై ఓ లుక్కేయండి..

ప్రతీకాత్మక చిత్రం

ఇన్‌స్టాగ్రామ్ తమ వినియోగదారుల కోసం సరికొత్త మార్పులు ప్రకటించింది. టీనేజ్ పిల్లలకు తమ ప్లాట్‌ఫామ్‌ను సురక్షితమైన వేదికగా మార్చడానికి కొత్త ఫీచర్లను అందించింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

  • Share this:
ప్రముఖ ఫోటో షేరింగ్ ప్లాట్‌ఫామ్ ఇన్‌స్టాగ్రామ్ తమ వినియోగదారుల కోసం సరికొత్త మార్పులు ప్రకటించింది. టీనేజ్ పిల్లలకు తమ ప్లాట్‌ఫామ్‌ను సురక్షితమైన వేదికగా మార్చడానికి కొత్త ఫీచర్లను అందించింది. కొత్త అప్‌డేట్ తరువాత ఎవరైనా టీనేజర్స్‌ (16-18) అకౌంట్‌ క్రియేట్ చేయగానే.. అది ఆటోమేటిక్‌గా ప్రైవేట్ అకౌంట్‌గా మారిపోతుందని ఇన్‌స్టాగ్రామ్ తెలిపింది. అపరిచితుల నుంచి అసభ్యకరమైన మెసేజ్‌లు రాకుండా టీనేజర్లను సంరక్షించడమే డిఫాల్ట్ ప్రైవేట్ అకౌంట్ ముఖ్య ఉద్దేశమని తెలుస్తోంది. అయితే ఇప్పటికే అకౌంట్ క్రియేట్ చేసుకున్న టీనేజర్ల కోసం పుష్‌ నోటిఫికేషన్స్ పంపిస్తుంది. మీ అకౌంట్ ని ప్రైవేట్ అకౌంట్ గా మార్చుకోండి అంటూ టీనేజర్లకు తరచూ నోటిఫికేషన్లను పంపిస్తుంది. కానీ బలవంతం మాత్రం చేయడం లేదు. పబ్లిక్ అకౌంట్ గా ఉంచుకోవాలి అనుకున్న టీనేజర్లు.. అలాగే ఉంచుకోవచ్చు.
Gmail: జీమెయిల్ ఇన్‌బాక్స్ నిండిపోయిందా.. ఒకేసారి వేలాది ఈ-మెయిల్స్‌ను డిలీట్ చేసే చిట్కా

ఈ ఏడాది అభివృద్ధి చేసిన టెక్నాలజీ ఆధారంగా టీనేజ్ యూజర్ల భద్రత కోసం మరిన్ని మార్పులను ఇన్‌స్టాగ్రామ్ తీసుకు వచ్చింది. ఒక వ్యక్తి లేదా అకౌంట్‌ని టీనేజ్ పిల్లలు చాలామంది బ్లాక్ చేసినా.. రిపోర్టు చేసినా.. ఆ వ్యక్తి లేదా అకౌంట్‌ని అనుమానాస్పద అకౌంట్ గా ఇన్‌స్టాగ్రామ్ ఫ్లాగ్ చేస్తుంది. అలాగే ఆ వ్యక్తిని టీనేజ్ పిల్లలతో మాట్లాడనివ్వకుండా బ్లాక్ చేస్తుంది. ఇలాంటి అనుమానాస్పద వ్యక్తుల అకౌంట్లకు చిన్నపిల్లల అకౌంట్ కనిపించవు. వీరికి రీల్స్, ఎక్సప్లోర్, కామెంట్స్ వంటి సెక్షన్లలో టీనేజ్ పిల్లలకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు కనిపించవు. ఫాలో చేయడానికి కూడా వీలు ఉండదు.

ఇక ప్రకటనల విషయంలో కూడా ఇన్‌స్టాగ్రామ్ సరికొత్త మార్పులను తీసుకు వచ్చింది. ఇకపై ప్రకటనదారులు టీనేజర్ల ‌ ఇంట్రస్ట్స్ ఆధారంగా ప్రకటనలను ఇవ్వలేరు. సరికొత్త మార్పులతో టీనేజర్స్‌ యాక్టివిటీస్, ఇతర వెబ్ సైట్ల లాగిన్స్, అప్లికేషన్ల వినియోగం అనేది ప్రకటనదారులకు తెలిసే అవకాశం ఉండదు. మార్పులు అమల్లోకి రాగానే వయస్సు, లింగం, ప్రదేశం వంటి అంశాల ఆధారంగా తమ యాడ్స్ ని ప్రకటనదారులు టార్గెట్ చేయాల్సి ఉంటుంది.

ఈ అడ్వర్టైజ్మెంట్ మార్పులు ఫేస్‌బుక్ మెసెంజర్ లో కూడా అమలు చేసే అవకాశం ఉంది. కానీ ప్రకటనదారులపై ఎక్కువ నిబంధనలు అమలు చేయడం వల్ల యాడ్ నెట్వర్క్ కి నష్టం చేకూరే ప్రమాదం ఉంది. పిల్లల భద్రత విషయంలో కొత్త మార్పులు తీసుకు రావడంతో పాటు రీల్స్‌లో వీడియోల నిడివిని 60 సెకన్లకు పెంచుతూ ఇన్‌స్టాగ్రామ్ నిర్ణయం తీసుకుంది. ఈ రోజు నుంచే రీల్స్‌లో 60 సెకన్ల వీడియోలని క్రియేట్ చేసుకోవచ్చని కూడా ప్రకటించింది.
Published by:Nikhil Kumar S
First published: