ఇంటర్నేషనల్ టెక్ దిగ్గజం యాపిల్ (Apple) ఎప్పటికప్పుడు సరికొత్త టెక్నాలజీ (Technology)ని తీసుకొస్తుంది. అయితే ఈ సంస్థ టెలికాం నెట్‌వర్క్ కనెక్టివిటీ క్వాలిటీపై కూడా దృష్టి పెట్టింది. ఈ క్రమంలో టెలికమ్యూనికేషన్స్ నెట్‌వర్క్ అందుబాటులో లేని మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో శాటిలైట్ బేస్డ్ కనెక్టివిటీ ద్వారా డేటా కమ్యూనికేషన్స్ కోసం గ్లోబ్‌స్టార్ కంపెనీతో కలిసి గత ఏడాది శాటిలైట్ టెక్ అనే ఫీచర్‌ను ప్రారంభించింది. ఈ ఫీచర్‌ను ఐఫోన్స్ కోసం తీసుకొచ్చినట్లు యాపిల్ తెలిపింది. అయితే ఈ టెక్నాలజీతో ఈ ఏడాది అనేక బ్రాండ్ ఫోన్లు మార్కెట్లోకి రానున్నాయి.
* శాటిలైట్ బేస్డ్ కనెక్టివిటీ అంటే?
టెలికమ్యూనికేషన్స్ నెట్‌వర్క్స్ అందుబాటులో లేని మారుమూల, గ్రామీణ ప్రాంతాల్లో శాటిలైట్ బేస్డ్ కనెక్టివిటీ ద్వారా డేటా కమ్యూనికేషన్స్ చేయవచ్చు. అంటే శాటిలైట్ సిగ్నల్స్ ద్వారా డేటాను పంపడానికి, స్వీకరించడానికి అవకాశం ఉంటుంది.
ఇటీవల బార్సిలోనా వేదికగా మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ (MWC)- 2023 అట్టహాసంగా జరిగింది. ప్రధాన మొబైల్ కంపెనీలు తమ అప్ కమింగ్ మోడల్స్‌ను ప్రదర్శించడంతో పాటు తమ ఫోన్‌లలో శాటిలైట్ కనెక్టివిటీ ఫీచర్స్ కోసం క్వాల్‌కమ్, మీడియా టెక్ వంటి చిప్‌సెట్ కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. దీంతో శాటిటైల్ టెక్ ఫీచర్ త్వరలోనే ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్స్‌లో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
* ఆ బ్రాండ్ ఫోన్లలో కొత్త ఫీచర్
ఈ శాటిలైట్ టెక్నాలజీ ద్వారా ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్స్ మరింత బెస్ట్ పర్ఫార్మెన్స్ అందించడానికి చిప్‌సెట్ కంపెనీలు క్వాల్‌కమ్(Qualcomm), మీడియా టెక్(MediaTek) సిద్ధంగా ఉన్నాయి. క్వాల్‌కమ్ ఇప్పటికే స్నాప్‌డ్రాగన్ శాటిలైట్ ఫీచర్‌ను పరిచయం చేసింది. హై-ఎండ్, మిడ్-రేంజ్ చిప్‌సెట్స్ ద్వారా ఈ ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది.
ఇది కూడా చదవండి : వాట్సాప్ నుంచి అదిరిపోయే ఫీచర్.. ఎక్స్‌పైరీ డేట్‌ను సెట్ చేసుకోవచ్చు!
క్వాల్‌కమ్‌కు చెందిన స్నాప్‌డ్రాగన్ శాటిలైట్ ఫీచర్ అందుబాటులోకి రానున్న స్మార్ట్‌ఫోన్ బ్రాండ్స్ జాబితాలో హానర్, మోటోరోలా, నథింగ్, ఒప్పొ, వివో , షియోమి వంటి టాప్ బ్రాండ్స్ ఉన్నాయి. ఈ మొబైల్ కంపెనీల అప్‌కమింగ్ మోడల్స్‌లో ఈ ఏడాది స్నాప్‌డ్రాగన్ శాటిలైట్ ఫీచర్ అందుబాటులోకి రానుంది.
* అమెరికా, యూరప్ మార్కెట్‌లకు మాత్రమే
2023 చివరిలో లాంచ్ అయ్యే ఈ బ్రాండ్స్ మోడల్స్‌లో శాటిలైట్ టెక్ ఫీచర్స్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. అయితే ఈ సర్వీస్ ప్రపంచవ్యాప్తంగా ఇప్పట్లో అందుబాటులోకి రాకపోవచ్చు. కేవలం అమెరికా, యూరప్ వంటి మొబైల్ మార్కెట్‌లకు మాత్రమే పరిమితమయ్యే అవకాశం ఉంది.
* 3GPP నాన్-టెరెస్ట్రియల్ నెట్‌వర్క్
మీడియాటెక్ చిప్‌సెట్ కంపెనీ శాటిలైట్ టెక్‌ను తక్కువ ఖరీదైన డివైజ్‌ల్లో తీసుకురావాలని భావిస్తోంది. ఇందుకోసం తమ చిప్‌సెట్‌లకు 3GPP నాన్-టెరెస్ట్రియల్ నెట్‌వర్క్ (NTN)ను తీసుకురానుంది. ఈ టెక్నాలజీ సామర్థ్యం స్మార్ట్‌ఫోన్‌లకు మించి ఉంటుందని, కార్లలో సైతం వాడవచ్చని కంపెనీ పేర్కొంది. ఈ చిప్ మేకర్ మొబైల్ వరల్డ్ కాంగ్రెస్-2023లో బుల్లిట్(Bullit), మోటోరోలా వంటి బ్రాండ్స్ ద్వారా శాటిలైట్ టెక్నాలజీని ప్రదర్శించింది. కాగా, కొరియన్ దిగ్గజం శామ్‌సంగ్ ఇప్పటికే గెలాక్సీ ఎస్ 23 సిరీస్‌లో శాటిలైట్ టెక్ ఫీచర్‌ను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది చివరిలో రానున్న గూగుల్ పిక్సెల్ 8 సిరీస్‌లో ఈ ఫీచర్ ఉండే అవకాశం ఉందని టెక్ వర్గాలు భావిస్తున్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.